AFg vs NZ T20 WC: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆప్ఘనిస్తాన్.. ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన కివీస్
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నఆఫ్ఘనిస్తాన్..
- చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్..
- ఆప్ఘనిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైన కివీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AFg vs NZ T20 WC: ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో ఆఫ్ఘనిస్తాన్- న్యూజిలాండ్ మధ్య కీలక మ్యాచ్‌కు వేదిక సిద్ధమైంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఈరోజు జరుగుతున్న మ్యాచ్‌తో రెండు జట్లు తమ టోర్నమెంట్ ప్రయాణాన్ని ప్రారంభించాయి. అయితే, స్పిన్‌కు అనుకూలంగా పేరున్న చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఇటీవలి కాలంలో తక్కువ సహకారం లభిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ పిచ్‌పై మ్యాచ్ ఎలా కొనసాగుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: Love Marriage Tragedy: ప్రతి ఒక్కరికీ నా జీవితం గుణపాఠం.. లవ్ మ్యారేజీ చేసుకున్న పాపానికి..?
Also Read
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
- Women's T20 World Cup 2026 : పాకిస్తాన్‌ను చిత్తు చేసిన భారత్.. దీప్తి శర్మ ఐదు వికెట్ల సునామీ.!
అయితే, ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ జట్లు 2024 వరల్డ్‌కప్‌లో కూడా పోటీ పడ్డాయి. ఆ టోర్నమెంట్‌లో ఆఫ్ఘనిస్తాన్ సంచలన విజయం సాధించడంతో న్యూజిలాండ్ మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అప్పటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కివీస్ ఈసారి బరిలోకి దిగింది. ఇక, ఆ మ్యాచ్ తర్వాత ఏ ఫార్మాట్‌లోనూ న్యూజిలాండ్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆఫ్ఘన్ జట్టుతో పోటీ పడలేదు. కాగా, ఈ మ్యాచ్‌కు ముందు న్యూజిలాండ్ జట్టును గాయాల సమస్య వెంటాడుతోంది. రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. మైకేల్ బ్రేస్‌వెల్, లాకీ ఫెర్గూసన్ కాల్ఫ్ గాయాలతో బాధపడుతున్నారు. ఫిన్ అలెన్ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో భుజానికి గాయం అయింది. ఈ పరిస్థితుల్లో కివీస్ జట్టు సమతూకం ఎలా ఉండనుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
Read Also: Suryakumar Yadav: కోచ్-కెప్టెన్ మ్యాజిక్.. గంభీర్ గేమ్ ఛేంజర్ సలహా.. మ్యాచ్ గెలిపించిన సూర్య
వరల్డ్‌కప్‌కు ముందు ఆఫ్ఘనిస్తాన్ అద్భుత ఫామ్‌లో ఉంది. ఈ టోర్నమెంట్‌కు ముందు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఆరు విజయాలు సాధించింది. మరోవైపు, న్యూజిలాండ్ భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1తో కోల్పోయి ప్రపంచ కప్‌లోకి అడుగు పెట్టింది. ఇరు జట్ల ప్రస్తుత పరిస్థితులు, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చెన్నై వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ హోరాహోరీగా కొనసాగనుంది. సూపర్-8కి చేరుకునే మార్గంలో ఈ మ్యాచ్ ఫలితం కీలకంగా మారనుంది.
తాజావార్తలు
-
Honor 600 Elite 5G: హానర్ 600 Elite 5G లాంచ్.. 108MP కెమెరా, 8,100mAh బ్యాటరీ, IP69K రేటింగ్
-
Kajal Aggarwal: డిన్నర్‌కి వెళ్లినా ఫోన్లతోనేనా? విడాకులపై కాజల్ షాకింగ్ కామెంట్స్.. భర్తతో మాత్రం ఇలా!
-
Sudan Gold Mine Collapse: సూడాన్‌లో మరోసారి కుప్పకూలిన బంగారు గని.. 11 మంది మృతి, 30 మందికి పైగా గాయాలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ నాలుగు రాశుల వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
-
US sanctions on Russia: ట్రంప్ కొత్త ఆంక్షల చట్టంపై రష్యా తీవ్ర స్పందన.. శాంతి ప్రయత్నాలు కష్టతరం అవుతాయంటూ హెచ్చరిక
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!