తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలెక్కేందుకు ఏర్పాట్లు

సెమీ హైస్పీడ్‌ రైలును సికింద్రాబాద్‌ నుంచి పచ్చజెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ

అత్యాధునిక హంగులు, విమాన తరహా ప్రయాణ అనుభూతిని కలిగించేలా వందేభారత్ రైలు ప్రయాణం

నల్గొండ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

సికింద్రాబాద్‌ నుంచి ఉదయం 6గంటలకు బయల్దేరి మధ్యాహ్నం 2.30గంటలకు తిరుపతి చేరుకోనున్న రైలు

తిరుపతి నుంచి మధ్యాహ్నం 3.15 గంటలకు బయల్దేరి రాత్రి 11.45 గంటలకు సికింద్రాబాద్‌ చేరిక

సికింద్రాబాద్‌ నుంచి తిరుపతి ఏసీ ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1680గా నిర్ణయం

గ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ టికెట్‌ ధరను రూ.3080లుగా నిర్ణయించిన రైల్వే అధికారులు

 సికింద్రాబాద్ నుంచి గుంటూరు - రూ.865, ఒంగోలు - రూ.1075, నెల్లూరు - రూ.1270, తిరుపతి - రూ.1680.

ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌ కార్‌ ఛార్జీలు..సికింద్రాబాద్ నుంచి నల్గొండ - రూ.900, గుంటూరు - రూ.1620, ఒంగోలు - రూ.2045, నెల్లూరు - రూ.2455,తిరుపతి - రూ.3080