IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
- ఫిబ్రవరి 15న భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్
- ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రికెట్ ప్రపంచం
- పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salman Ali Agha on IND vs PAK Match in T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌పై మొన్నటివరకు కమ్ముకున్న నీలినీడలు తొలగిపోయాయి. భారత్‌తో మ్యాచ్ ఆడడానికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పెట్టిన డిమాండ్లను ఐసీసీ తిరస్కరించడంతో.. ఇక తప్పక పీసీబీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌పై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా సంచలన వ్యాఖ్యలు చేశాడు.
భారత్‌తో తలపడేందుకు పాకిస్థాన్ జట్టు పూర్తిగా సిద్ధంగా సల్మాన్ అలీ అఘా చెప్పాడు. ఈసారి భారత్‌పై గెలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. గతంలో ఆసియా కప్‌లో భారత్ చేతిలో వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయిన విషయాన్ని అంగీకరించిన సల్మాన్.. ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నాడు. జట్టు సమతుల్యత, ఆటగాళ్ల ప్రస్తుత ఫామ్ తమకు బలమని పేర్కొన్నాడు. ప్రస్తుతం జట్టు మంచి ప్రదర్శనలు ఇస్తోందని, అదే ఆత్మవిశ్వాసంతో భారత్‌పై విజయం సాధిస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో గెలిచి పాకిస్థాన్ అభిమానులను ఆనందపరచాలనే లక్ష్యంతో జట్టు ముందుకు సాగుతోందని సల్మాన్ తెలిపాడు.
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
Also Read: AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్‌తో సభ్యుల హాజరు నమోదు!
భారత్–పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ ఉత్కంఠభరిత పోటీగా ఉండడం తెలిసిందే. రెండు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ పోరు మరోసారి భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో సల్మాన్ అఘా చేసిన వ్యాఖ్యలు మ్యాచ్‌కు మరింత ఉత్సాహాన్ని తెచ్చాయి. మొత్తం 16 టీ20 మ్యాచ్‌లలో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. ఇందులో 13 సార్లు టీమిండియా, పాక్ 3 సార్లు గెలిచాయి. ప్రపంచకప్ హెడ్-టు-హెడ్‌లలో భారత్ ఆధిక్యంలో ఉంది. టీమిండియా 7 విజయాలు, పాకిస్తాన్ 1 విజయం సాధించాయి.
తాజావార్తలు
-
Traffic Jam: ప్రపంచంలోనే భారీ ట్రాఫిక్ జామ్.. 97 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు.. 12 రోజుల పాటు కదలని ట్రాఫిక్
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది
-
Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?
-
US-China Talks: అమెరికా-చైనా ద్వైపాక్షిక చర్చలు పూర్తి.. వైట్‌హౌస్ డిన్నర్లో ట్రంప్-జిన్‌పింగ్
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!