US Iran Tensions: ఇరాన్‌పై యుద్ధానికి సై అంటున్న అమెరికా.. వణుకుపుట్టిస్తున్న శాటిలైట్ ఫోటోలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US Iran Tensions:మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం అమెరికా – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నాయి. తాజాగా వైరల్‌గా మారిన శాటిలైట్ ఫోటోలను గమనిస్తే అమెరికా సైనిక స్థావరాలలో యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థల సంఖ్య వేగంగా పెరిగినట్లు తెలుస్తుంది. ప్లానెట్ ల్యాబ్స్, రాయిటర్స్ చిత్రాలు ఖతార్, జోర్డాన్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలలో సైనిక మార్పులను స్పష్టంగా చూపిస్తున్నాయి. నిజానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కోరుకుంటున్నారు, అదే సమయంలో ఆయన ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇరాన్ దీనిని పూర్తిగా తిరస్కరించింది. అగ్రరాజ్యం ప్రతిపాదించిన ఈ ఒప్పందం కుదరకపోతే, ఇరాన్‌పై తదుపరి దాడి వినాశకరమైనదని ట్రంప్ హెచ్చరికలు కూడా జారీ చేసిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం అమెరికా ఇరాన్ అణు స్థావరాలపై దాడి చేసింది. ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.
Also Read
- Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- CJP Leaders Released: సీజేపీ నాయకులకు బిగ్ రిలీఫ్.. అభిజీత్, సౌరవ్, అశుతోష్, ధృవ్ రాఠీ విడుదల..
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
శాటిలైట్ ఫోటోల్లో ఏమి కనిపిస్తుందంటే..
ప్లానెట్ ల్యాబ్స్ చిత్రాలు 2026 జనవరి – ఫిబ్రవరి మధ్య US స్థావరాలలో ప్రధాన మార్పులను వెల్లడిస్తున్నాయి. ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్‌లో US సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉంది. ఇక్కడ జనవరి 17, ఫిబ్రవరి 1 మధ్య విమానాల సంఖ్య పెరిగింది. ఇరానియన్ క్షిపణులను ఎదుర్కోవడానికి మొబైల్ పేట్రియాట్ క్షిపణి లాంచర్లు కూడా ఇక్కడ మోహరించారు. జోర్డాన్‌లోని మువాఫాక్ సాల్టి ఎయిర్ బేస్‌లో జనవరి 25, ఫిబ్రవరి 2 మధ్య కాలంలో అమెరికాకు చెందిన డజన్ల కొద్దీ F-15E ఫైటర్ జెట్‌లు, A-10 గ్రౌండ్ అటాక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, MQ-9 డ్రోన్‌లు వచ్చాయి. ఇది ఇరాన్‌కు దగ్గరగా ఉన్న అమెరికా ఎయిర్ బేస్. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్‌లో కూడా అమెరికా భారీ ఆయుధాలను మోహరించింది. ఈ ఎయిర్ బేస్‌లో అమెరికాకు చెందిన భారీ వస్తువులను మోస్తున్న సి-5 గెలాక్సీ, సి-17 రవాణా విమానాలు కనిపిస్తున్నాయి.

ఒమన్, డియెగో గార్సియా వంటి ఇతర ప్రదేశాలలో కూడా అమెరికా విమానాల సంఖ్య పెరిగింది. మొత్తం మీద యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, రక్షణ వ్యవస్థల విస్తరణ పెరిగింది. అమెరికా ఇతర దేశాలలో ఉన్న యూఎస్ సైనిక స్థావరాల్లో చేస్తున్న ఆయుధ విస్తరణ చాలా ఖరీదైనదిగా రక్షణ వర్గాలు అభిప్రాయడుతున్నాయి. ఇది అమెరికా ఇరాన్‌పై యుద్ధానికి సిద్ధంగా ఉందని స్పష్టమైన సందేశాన్ని పంపుతోందని అంటున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. కానీ రెండు వైపులా యుద్ధానికి జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. అమెరికా- ఇరాన్ యుద్ధం, ప్రాంతీయ యుద్ధానికి దారితీయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

READ ALSO: Prakash Raj: ఫేక్ న్యూస్‌పై ఇచ్చిపడేసిన ప్రకాశ్ రాజ్..
తాజావార్తలు
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!