Intermediate Practical Exams: సీసీటీవీ పర్యవేక్షణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ముగింపు.. అక్రమాలపై కఠిన చర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Intermediate Practical Exams: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా ముగిశాయి. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాతాన్ని కాపాడేందుకు ఇంటర్ బోర్డ్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ముఖ్యంగా సీసీటీవీ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహించడం ద్వారా మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ వంటి అక్రమాలను అరికట్టేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
Also Read
- Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
- Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
ఇంటర్ బోర్డ్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ (CCR) ఏర్పాటు చేసి పరీక్షా కేంద్రాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ నిర్వహించారు. ప్రభుత్వ కళాశాలల్లో 5,500 సీసీటీవీ కెమెరాలు, సెక్టార్ కళాశాలల్లో 1,300 కెమెరాలు, ప్రైవేట్ కళాశాలల్లో 7,500 కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని CCRకు అనుసంధానించారు. ఎక్కడైనా అక్రమాలు గమనించిన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించి తక్షణ చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను అమలు చేశారు.
iProjector 3 Plus: థియేటర్‌కు వెళ్లనవసరం లేదు.. మీ ఇంట్లోనే అదిరిపోయే థియేటర్ ఎక్స్‌పీరియన్స్!
ఫ్లయింగ్ స్క్వాడ్లు, జిల్లా పరీక్ష కమిటీలతో సమన్వయం చేస్తూ పరీక్షలను పర్యవేక్షించారు. ఈ క్రమంలో లోపాలు గుర్తించిన కారణంగా 83 మంది పరీక్షాధికారులను విధుల నుంచి తొలగించారు. అలాగే నియమావళి ఉల్లంఘనల కారణంగా 5 పరీక్షా కేంద్రాలను రద్దు చేసి, అక్కడి విద్యార్థులను సమీప కేంద్రాలకు మార్చారు. ఈ ఏడాది సాధారణ కోర్సులకు 1,440 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు, వృత్తిపర కోర్సులకు 484 ప్రాక్టికల్ పరీక్షా కేంద్రాలు, అలాగే 1,495 థియరీ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరగడంతో పరీక్షలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా జరిగాయని ఇంటర్ బోర్డ్ అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Sangameswara Temple: ఆరు నెలల ముందే బయటపడ్డ సంగమేశ్వరుడు.. కృష్ణా తీరంలో ముందస్తుగా కరవు ఛాయలు.!
-
Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
-
Anvay Dravid: రాహుల్ ద్రవిడ్ కొడుకు రఫా రఫా.. 100 బంతుల్లో 151 పరుగులతో విధ్వంసం..
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Team India: ఐదు వన్డేలు, ఇద్దరు కెప్టెన్లు.. ఆకాష్ దీప్ రీఎంట్రీ.. జస్ప్రీత్ బుమ్రాపై బీసీసీఐ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!