AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 24 అంశాలకు ఆమోదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మొత్తం 24 అజెండా అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న ప్రధాన నిర్ణయాల విషయానికి వస్తే.. నీటిపారుదల శాఖలోని 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం తెలిపింది.. భూముల బదిలీకి సంబంధించి చట్ట సవరణ ముసాయిదా బిల్లుకు ఆమోద ముద్ర వేసింది కేబినెట్.. ఇక, గాజువాకలో వెయ్యి చదరపు గజాల వరకు ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును ఆరు నెలలు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. ప్రభుత్వ భూముల్లో నిర్మించిన ఇళ్ల క్రమబద్ధీకరణ గడువును జూన్ వరకు పెంచేందుకు నిర్ణయం తీసుకుంది..
Read Also: Medipalli Thefts: మేడిపల్లిలో వరుస చోరీలతో వణుకుతున్న జనం.. 9 ఇళ్లు.. కోటి రూపాయల దోపిడీ!
Also Read
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
- Botsa Satyanarayana : బీసీ రిజర్వేషన్లపై బొత్స ఫైర్.. చంద్రబాబుకు సూటి ప్రశ్న
- Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
గన్నవరంలో కస్టమ్స్ శాఖ భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన జీఓలో మార్పులు చేసింది కేబినెట్.. పారిశ్రామిక, ఇంధన రంగంలో నిర్ణయాల విషయానికి వస్తే.. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో 45.6 ఎకరాలు బయోగ్యాస్ ప్లాంట్‌కు కేటాయింపు.. నంద్యాల జిల్లా సంజామలలో 1,500 ఎకరాలు సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఆమోదం.. విశాఖ జిల్లా ఆనందపురంలో 18.57 ఎకరాల కేటాయింపుకు అనుమతి.. సాంకేతిక, మౌలిక సదుపాయాల అభివృద్ధి.. ఏపీ ఏఐ లివింగ్ ల్యాబ్స్ ప్రారంభానికి ఆమోదం తెలిపింది.. తిరుపతిలో డిజాస్టర్ రికవరీ సెంటర్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. రామాయపట్నం పోర్టు అభివృద్ధికి కంఫర్ట్ లెటర్ జారీకి అనుమతి ఇచ్చింది..
ఇతర కీలక అంశాలను పరిశీలిస్తే.. ఓటర్ల జాబితా ప్రచురణకు ఏటా నాలుగు అర్హత తేదీలు కల్పించే సవరణ బిల్లుకు ఆమోదం తెపింది కేబినెట్.. రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, పారిశ్రామిక ప్రోత్సాహం దిశగా ఈ నిర్ణయాలు కీలకమని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
-
Lal Bahadur Shastri Jayanti: నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం.. ‘జై జవాన్ జై కిసాన్’ రూపశిల్పి శాస్త్రి జీ..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?