Proddatur: బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు! క్షణాల్లో బురిడీ కొట్టించి ఉడాయింపు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Proddatur: మోసపోయేవాడు ఉంటే.. మన దేశంలో మోసం చేసే వాడికి కొదవే లేదు. డబ్బు మీద అత్యాశ ఉంటే చాలు.. అలాంటి వాళ్లను టార్గెట్ చేస్తున్నారు కేటుగాళ్లు. వారి డబ్బు యావను దృష్టిలో పెట్టుకుని పలు రకాలుగా మోసం చేస్తున్నారు. వారిని అమాయకులను చేసి.. అందిన కాడికి దోచేస్తున్నారు. డబ్బు ఇస్తే.. ఖాతాకు నగదు బదిలీ ద్వారా రెట్టింపు సొమ్ము ఇస్తామని చెబితే.. అట్లాంటి వారిని ఎవరైనా నమ్ముతారా? అలాంటి వారిని నమ్మితే ఏం జరుగుతుంది? సింపుల్.. మోసం చేసి సొమ్ము కొట్టేస్తారు. సరిగ్గా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇదే జరిగింది. రెట్టింపు సొమ్ముకు ఆశపడితే అసలు ఎసరొచ్చింది.
ఎంత ముద్దుగున్నావే.. Maroon కలర్‌లో Realme Narzo 90x 5G లాంచ్.. ఫీచర్స్ ఏంటంటే?
Also Read
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
- Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
డబ్బు ఇస్తే.. కొద్ది క్షణాల్లోనే రెట్టింపు సొమ్ము ఇస్తాం. అది కూడా ఆన్‌లైన్‌లో చెల్లిస్తాం. ఇలా చెప్పి అమాయకులకు వల వేస్తారు నేరగాళ్లు. తమ బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు వారిని క్షణాల్లో బురిడీ కొట్టించి ఉన్న సొమ్ము కొట్టేసి ఉడాయిస్తారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఇలాగే జరిగింది. అలా రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికి 33 లక్షల రూపాయల సొమ్ము కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను ప్రొద్దుటూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరుకు చెందిన గంగా ప్రసాద్ తన స్నేహితుడి ద్వారా పరిచయమైన పులివెందులకు చెందిన గంగులయ్య మరో నలుగురు కలిసి అంతర్రాష్ట్ర ముఠాను కలిశారు. రూ. 33 లక్షలు నగదు ఇస్తే 50 లక్షల రూపాయలు బ్యాంకు ఖాతాకు వేస్తామని నమ్మబలికారు ముఠా సభ్యులు. గంగా ప్రసాద్ వద్ద నుంచి 33 లక్ష రూపాయలు నగదు తీసుకొని డబ్బు ఒక బ్యాగులో పెట్టి ఆ బ్యాగును ఒక డబుల్ డోర్ బ్రీఫ్ కేస్‌లో పెట్టారు. బ్యాంకు ఖాతాకు డబ్బు ట్రాన్స్‌ఫర్ చేయడానికి కుదరలేదని తిరిగి నీ డబ్బు తీసుకొమని చెప్పి అప్పటికే బ్రీఫ్ కేస్‌లో ఉంచిన చిత్తుకాగితాలు ఉన్న బ్యాగు ఇచ్చారు. తనను మోసం చేస్తున్నారని గమనించిన గంగా ప్రసాద్ తన డబ్బు తిరిగి ఇచ్చేయాలని అడగడంతో కత్తితో బెదిరించి డబ్బుతో ముఠా సభ్యులు ఉడాయించారు.
Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
గత సంవత్సరం జనవరిలో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులను ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 8 లక్షల 50 వేలు నగదు, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రోజులోనే.. లేదా కొన్ని గంటల్లోనే డబ్బు రెట్టింపు అవుతుందంటే ఎవరూ నమ్మవద్దని.. డబ్బు మీద అత్యాశను చూసే నేరగాళ్లు మోసం చేస్తారనే విషయం గుర్తుంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Be Bald and Be Free Day : బట్టతల అంటే అందమే.. ఆత్మవిశ్వాసానికి కొత్త నిర్వచనం
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!