Telangana Municipal Elections: ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు.. రాష్ట్రవ్యాప్తంగా 73.01% పోలింగ్ నమోదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Municipal Elections: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పక్రియ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 73.01 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలోని ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 66.05 శాతం, అలాగే 116 మున్సిపాలిటీలలో 75.88 శాతం ఓటింగ్ నమోదైంది.
Cambodia Cyber Scam: కేజీఎఫ్‌ను తలపించిన సైబర్ సామ్రాజ్యం.. వందల సంఖ్యలో ఉద్యోగులు!
Also Read
- AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
- AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
- Story Board: ఏపీలో లోకల్ వార్.. రిజర్వేషన్లు ఎవరికి లాభం..?
- Off The Record: వైసీపీ టు కూటమి వయా జనసేన.. పాత నేతల అసంతృప్తి వెనుక అసలు కథ..!
మున్సిపాలిటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 91.91 శాతం పోలింగ్ నమోదు కాగా, నల్గొండ జిల్లా నందికొండ మున్సిపాలిటీలో అత్యల్పంగా 59.68 శాతం ఓటింగ్ నమోదైంది. మున్సిపల్ కార్పొరేషన్లలో నల్గొండ కార్పొరేషన్‌లో అత్యధికంగా 77.36 శాతం పోలింగ్ నమోదు కాగా, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యల్పంగా 59.12 శాతం పోలింగ్ నమోదైంది.
Proddatur: బుట్టలో పడ్డారా.. అంతే సంగతులు! క్షణాల్లో బురిడీ కొట్టించి ఉడాయింపు.!
ఓట్లు వేసిన జాబితాలో మహిళలు స్వల్పంగా ముందంజలో నిలిచారు. పురుష ఓటర్లలో 72.63 శాతం కాగా, మహిళా ఓటర్లలో 73.39 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఈ నెల 13న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం మీద ప్రజలు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రజాస్వామ్య ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!