Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Lifestyle Diabetes Reversal Lifestyle Changes Hba1c Explained

Diabetes: షుగర్ వ్యాధి తగ్గాలా, HBA1C నార్మల్ కావాలా?.. ఈ లైఫ్‌స్టైల్ పాటించండి..

Published Date :February 11, 2026 , 4:11 pm
By BV Reddy
  • షుగర్ వ్యాధి ‘‘రివర్సల్’’ కావాలంటే లైఫ్ ‌స్టైల్ ప్రధానం..
  • డైట్, వ్యాయామంతో డయాబెటిస్ మాయం..
  • 100 రోజుల్లోనే Hba1c నార్మల్ కావడం ఖాయం..
Diabetes: షుగర్ వ్యాధి తగ్గాలా, HBA1C నార్మల్ కావాలా?.. ఈ లైఫ్‌స్టైల్ పాటించండి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Diabetes reversal: ఇటీవల కాలంలో ప్రి-డయాబెటిస్, డయాబెటిస్‌(Diabetes)తో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా, ప్రస్తుత కాలంలో ఉన్న ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్ర లేమి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా షుగర్ వ్యాధిని పెంచుతున్నాయి. పరిస్థితి చేయిదాటిపోయే వరకు షుగర్ వ్యాధి తమకు వచ్చిందనే విషయం చాలా మందికి తెలియడం లేదు. చాలా మందిలో Hba1c(రక్తంలో 3 నెలల సగటు షుగర్) 7 శాతానికి మించి పోతోంది. సాధారణంగా ఆరోగ్యవంతుడికి ఈ ఇది 5.7 శాతం లోపు ఉండాలి. 5.7-6.4 శాతం వరకు ప్రీ డయాబెటిక్‌గా పరిగణిస్తారు. 6.4 శాతం దాటితే షుగర్ వచ్చిన వారిగా పరిగణలోకి తీసుకుంటారు.

అయితే, షుగర్ ఉన్నట్లు తెలిసిన వెంటనే, మన లైఫ్ స్టైల్‌లో మార్పులు చేస్తే తిరిగి నార్మల్ స్థితిలోకి అంటే షుగర్ లేని స్థితిలోకి వెళ్లవచ్చు. డయాబెటిస్ రివర్సల్ సాధించి ఎలాంటి మందులు లేకుండా లైఫ్ లీడ్ చేయవచ్చు. అయితే, దీనికి ఎంతో క్రమశిక్షణ, ఆహారపు అలవాట్లు, వ్యాయామం ముఖ్యం.

షుగర్ వ్యాధికి కారణం:

సాధారణంగా మన శరీరంలో ప్రాంక్రియాసిస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మనం తినే ఆహారంలోని గ్లూకోజ్‌ను కణాల్లోకి తీసుకెళ్తుంది. అయితే, కొన్ని సందర్భాల్లో మన శరీర కణాలు ‘‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’’ అనే స్థితికి చేరుకుంటాయి. మన కణాలు ఇన్సులిన్‌కు స్పందించవు. ఇన్సులిన్ అనేది కణాలను తెరిచి అందులోకి గ్లూకోజ్ పంపించే ఒక ‘‘కీ’’గా పనిచేస్తుంది. శరీరం ఇన్సులిన్ రెసిస్టెన్స్‌గా మారితే కణాలు ఇన్సులిన్ మాట వినవు. దీంతో శరీరంలో షుగర్ రక్తంలోనే ఉంటుంది. దీంతో మనకు టెక్నికల్‌గా డయాబెటిస్ వచ్చినట్లు చెబుతారు. మనం సాధారణంగా గమనించే షుగర్ ఇదే. దీనినే టైప్-2 డయాబెటిస్ అంటారు. ఇన్సులిన్ శరీరంలో ఉత్పత్తి అవుతున్నా కూడా సక్రమంగా పనిచేయకపోవడమే ఇది.

ఆహారపు అలవాట్లు కీలకం:

షుగర్ అసలు రావడానికి కారణాల్లో మితిమీరిన కార్బోహైడ్రేట్స్, ఆయిల్, జంక్ ఫుడ్ తినడం ఉంటుంది. వీటిని మనం మన ఆహారం నుంచి తీసేస్తే డయాబెటిస్‌ లేకుండా చేయవచ్చు. ముఖ్యంగా ప్రొటీన్ రిచ్ ఫుడ్‌ ( ఎగ్స్, చికెన్, ఫిష్, పన్నీర్, పెరుగు, పప్పులు) వంటి ఫుడ్ తీసుకోవాలి. దీంతో పాటు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్(రాగులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఊదలు, సామలు వంటి మిల్లెట్స్) వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి.

వైట్ రైస్ చాలా తక్కువ లేదంటే పూర్తిగా మానేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మైదాతో పాటు రెస్టారెంట్ ఫుడ్స్, బిర్యానీలు, బేకరీ ఐటమ్స్, స్వీట్లను పూర్తిగా తినకుంటే చాలా సేఫ్.

వ్యాయామం మెట్‌ఫార్మిన్‌తో సమానం:

షుగర్ వచ్చిందంటే టెన్షన్ పడకుంటా మన లైఫ్‌లో ఏం మార్పులు తీసుకురావాలో తెలుసుకుంటే చాలా మంచింది. కొత్తగా షుగర్ వచ్చిన వారిలో రివర్సల్ ప్రక్రియ చాలా త్వరగా జరుగుతుంది. మీ హెచ్‌బీఏ1సీ శాతం 7-8కి చేరినా కూడా మూడు నెలల్లో 5.7 లోపు అంటే దాదాపుగా నార్మల్ చేసుకోవచ్చు.

అయితే, దీనికి వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం మన శరీరంలో షుగర్‌ను తగ్గించే ‘‘మెట్‌ఫార్మిన్’’ ట్యాబ్లెట్‌కు సమానంగా పనిచేస్తుంది. ప్రతీ రోజూ ఒక గంట పాటు వ్యాయామం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదయం 40 నిమిషాల నుంచి ఒక గంట వేగంగా నడవడం, నెమ్మదిగా నడవడంతో పాటు సూర్య నమస్కారాలు, యోగా వంటివి చేస్తే శరీరంలోని గ్లూకోజ్‌ను కణాలు ఇన్సులిన్ అవసరం లేకుండానే ఉపయోగించుకుంటాయి. మనం వ్యాయామం చేస్తే కణాల్లోని GLUT4 (Glucose Transporter Type 4)రిసెప్టార్లు యాక్టివేట్ అవుతాయి. ఇవి ఇన్సులిన్ అసవరం లేకుండానే కణాల్లోకి గ్లూకోజ్‌ను తీసుకెళ్తాయి. దీంతో ఇన్సులిన్, ప్రాంక్రియాసిస్‌పై భారం తగ్గుతుంది. ప్రాంక్రియాసిస్‌పై ఉన్న ఒత్తిడి తగ్గుతుంది.

నిద్ర, విటమిన్‌లు, లివర్ హెల్త్ కూడా చాలా ముఖ్యమే:

నైట్ లైఫ్ కూడా టైప్-2 డయాబెటిక్‌కు ముఖ్యమైన కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. నిద్ర సరిగా లేకుంటే ఉదయం ఫాస్టింగ్ షుగర్ పెరుగుతుంది. ఇది మొత్తం షుగర్ పెరుగుదలకు కారణమవుతుంది. ఇదే కాకుండా ఈ మధ్య కాలంలో చాలా మంది విటమిన్-డీ సరిపడినంతగా ఉండటం లేదు. సూర్యుడికి మన శరీరం ఎక్స్‌పోజ్ కాకపోవడంతో విటమిన్ డి లోపం ఏర్పడుతోంది. విటమిన్ -డి సరిగా ఉంటే ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్థితి రాకుండా ఉంటుంది.

ఇక లివర్ హెల్త్ అన్నింటి కన్నా ముఖ్యం. ఫ్యాటీ లివర్ పరిస్థితి షుగర్‌కు కారణం అవుతోంది. ఫ్యాటీ లివర్ వల్ల శరీరానికి గ్లూకోజ్ అవసరమయ్యే దాని కన్నా ఎక్కువగా లివర్ నుంచి రిలీజ్ అవుతుంది. దీంతో ఇన్సులిన్‌పై భారం పడుతుంది. దీంతో హఠాత్తుగా షుగర్ పెరగడం, తగ్గడం జరుగుతుంది. దీనిని రివర్స్ చేయాలంటే హెల్తీ డైట్, వ్యాయామం చాలా కీలకం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • diabetes lifestyle changes
  • Diabetes reversal
  • exercise for diabetes
  • HbA1c levels
  • Health News

తాజావార్తలు

  • Off The Record: నూజివీడు నియోజకవర్గంలో మంత్రి పార్థసారథికి తలనొప్పులు

  • Deep Sleep Tips : చిటికెలో గాఢ నిద్రలోకి జారుకోవాలంటే.. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు..!

  • CM Revanth Reddy : నల్ల చెరువుకు పూర్వవైభవం.. నాడు చేయలేకపోయా.. నేడు చేసి చూపిస్తున్నా..

  • Hyderabad: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. పని ఒత్తిడి తట్టుకోలేకనే ఇలా..!

  • Off The Record: తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులివ్వడం వెనుక ఆంతర్యం ఏంటి?

ట్రెండింగ్‌

  • Kidney Stones in Children : తల్లిదండ్రులు ఈ తప్పు చేస్తే.. చిన్న పిల్లల్లోనూ కిడ్నీ రాళ్లు.. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదమే.!

  • Late Night Hunger : అర్ధరాత్రి ఆకలి వేస్తుందా..? కారణం ఇదే అంటున్న డాక్టర్లు..!

  • Black Hair Tips : ఇక రంగు వేయాల్సిన పనిలేదు.. ఈ చిన్న విషయం తెలుసుకుంటే చాలు…!

  • Jasprit Bumrah Bowling: పిసినారి ‘బుమ్రా’.. భారత్ ఫైనల్ చేరడానికి కారణం ఆ మూడు ఓవర్లే!

  • 8.12 అంగుళాల డిస్‌ప్లే, Snapdragon 8 Elite Gen 5 చిప్‌సెట్‌ తో వచ్చేస్తున్న OPPO Find N6..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions