Ashwin: రాజకీయాలకు అతీతంగా.. పాక్ బౌలర్‌కు అశ్విన్ బాసట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ashwin: ఫిబ్రవరి 15న చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ పోరు జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్‌కు ముందు పాక్ మిస్టరీ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంలో టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎంట్రీ ఇచ్చి, పాక్ బౌలర్‌కు మద్దతు తెలపడం ఇప్పుడు క్రీడాలోకంలో హాట్ టాపిక్‌గా మారింది. క్రికెట్ మైదానంలో నిబంధనల గురించి లోతుగా విశ్లేషించే వారిలో అశ్విన్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా పాకిస్థాన్‌కు చెందిన ఉస్మాన్ తారిక్ బౌలింగ్ శైలిని విమర్శిస్తున్న వారికి అశ్విన్ తనదైన శైలిలో సమాధానమిచ్చారు. తారిక్ బంతిని విసిరే ముందు కాసేపు విరామం (Pause) తీసుకోవడంపై కొందరు మాజీలు అభ్యంతరం వ్యక్తం చేయగా, అశ్విన్ మాత్రం ఈ బౌలర్‌కు అండగా నిలిచారు.
READ ALSO: Speaker Ayyannapatrudu: రేపటి నుంచి అసెంబ్లీలో ఏఐ ఆధారిత హాజరు.. స్పష్టం చేసిన స్పీకర్
Also Read
- Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
- Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
అసలు వివాదం ఏంటంటే..
పాక్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ బంతిని వేసే టైంలో ఒక్క క్షణం ఆగి విసురుతాడు. దీనిపై భారత మాజీ క్రికెటర్ శ్రీవాత్స్ గోస్వామి సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “ఫుట్‌బాల్‌లో పెనాల్టీ కిక్ కొట్టే ముందు రన్-అప్‌లో ఆగడం నిషిద్ధం. మరి క్రికెట్‌లో బంతిని వేసే ముందు ఇలా ఆగి బౌలింగ్ చేయడం ఎలా ఆమోదయోగ్యం? ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధం” అని ప్రశ్నించారు. ఈ క్రమంలో గోస్వామి వ్యాఖ్యలకు అశ్విన్ గట్టి కౌంటర్ ఇచ్చారు. నియమాలు కేవలం బౌలర్లకేనా? అని ప్రశ్నిస్తూ కొన్ని ఆసక్తికరమైన పాయింట్లు లేవనెత్తారు. బ్యాటర్లు అంపైర్‌కు చెప్పకుండానే రివర్స్ స్వీప్ ఆడతారు, స్టాన్స్ మార్చుకుంటారు. అప్పుడు లేని అభ్యంతరం బౌలర్ల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు వచ్చింది. బౌలర్లు తమ శైలిని మార్చుకోవడం తప్పు అన్నప్పుడు, ముందుగా క్రికెట్ చట్టాల్లో మార్పులు చేయాలని, అంపైర్‌కు చెప్పకుండా బౌలర్లు చేయి మార్చి బౌలింగ్ చేసే వెసులుబాటు కూడా కల్పించాలని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే నిబంధనల మధ్య, బౌలర్లు తమదైన శైలితో రాణించడంలో తప్పులేదని అశ్విన్ స్పష్టం చేశారు. పోటీ ఏదైనా, నిబంధనల పరిధిలో ఉన్నంత వరకు ఆటగాడి నైపుణ్యాన్ని గౌరవించాలని అశ్విన్ అభిప్రాయపడ్డారు.
ఉస్మాన్ తారిక్ తన విభిన్నమైన యాక్షన్‌తో బ్యాటర్లను బురిడీ కొట్టిస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 అంతర్జాతీయ టీ20ల్లోనే 11 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ పాకిస్థానీ బౌలర్. ఫిబ్రవరి 15న జరగబోయే మ్యాచ్‌లో భారత బ్యాటర్లకు ఇతడు సవాల్ విసిరే అవకాశం ఉంది. స్పిన్‌ను అద్భుతంగా ఆడే భారత ఆటగాళ్లు ఈ ‘మిస్టరీ’ని ఎలా ఛేదిస్తారో వేచి చూడాల్సిందే.
READ ALSO: Deepali Ghosh: హ్యాట్సాఫ్ బామ్మ.. నెటిజన్ల మనసు గెలుచుకున్న 70 ఏళ్ల బామ్మ! వీడియో వైరల్
తాజావార్తలు
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Steve Smith: డర్బన్ టెస్ట్‌లో ఊహించని పరిణామం.. స్టీవ్ స్మిత్‌కు గాయం..
-
Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?