Usman Tariq Bowling: వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు.. ఉస్మాన్ తారిక్‌పై సెహ్వాగ్ ఫైర్!
- యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లో తారిక్ బౌలింగ్
- తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు
- వీధుల్లో ఆడే పిల్లలు కూడా బౌలింగ్ చేస్తారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్ స్పిన్నర్ ఉస్మాన్ తారిక్ పేరు ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇందుకు కారణం.. అతడి బౌలింగ్ యాక్షన్. ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా, పాకిస్థాన్ సిరీస్‌లో తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై విమర్శలు వచ్చాయి. ఆసీస్ టాప్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ మైదానంలోనే అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా యూఎస్ఏతో జరిగిన మ్యాచ్‌లోనూ మరోసారి అతడి బౌలింగ్ యాక్షన్ చర్చకు వచ్చింది. ఈసారి ఏకంగా అభిమానులే అతడిని టార్గెట్ చేశారు. ఇక తారిక్ బౌలింగ్ యాక్షన్‌పై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి బౌలింగా.. అలా అయితే వీధుల్లో ఆడే చిన్న పిల్లలు కూడా బౌలింగ్ చేయగలరు అని ఉస్మాన్ తారిక్‌ను వీరేంద్ర సెహ్వాగ్ విమర్శించారు. తారిక్ బంతి విసిరే ముందు బ్యాట్స్‌మన్ వైపు చూసి.. ఆ తరువాత చేతితో విడుదల చేస్తున్న విధానం ప్రపంచం మొత్తం చూస్తోందన్నారు. ఇలాంటి బౌలింగ్ యాక్షన్‌పై సమగ్ర విచారణ జరగాలని ఐసీసీకి సూచించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో నిబంధనలు, ప్రమాణాలు కచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందని వీరూ అభిప్రాయపడ్డారు. సెహ్వాగ్ వ్యాఖ్యలతో ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Also Read
- India Squad for New Zealand Series: న్యూజిలాండ్‌తో వన్డే, టెస్ట్ సిరీస్‌ల కోసం భారత జట్ల ప్రకటన.. జడేజాకు షాక్!
- IND W vs ZIM W 1st T20: బౌలర్ల దెబ్బకు వణికిన జింబాబ్వే.. భారత్ టార్గెట్ 115
- IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
- Aryaveer: వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు విధ్వంసం.. 143 బంతుల్లో 173 పరుగులు, 8 సిక్సర్లతో చెలరేగిన ఆర్యవీర్!
Also Read: IND vs PAK: ఈసారి గెలుపు మాదే.. పాకిస్థాన్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు!
వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు, విశ్లేషకులు ఈ అంశంపై మద్దతుగా నిలుస్తూ.. మరింత వేడెక్కిస్తున్నారు. క్రికెట్ ప్రపంచంలో మరోసారి బౌలింగ్ యాక్షన్‌పై వివాదం చెలరేగే సూచనలు కనిపిస్తున్నాయి. యూఎస్ఏ మ్యాచ్‌లో ఉస్మాన్ తారిక్ నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి.. 27 పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు పడగొట్టాడు. తారిక్ త్రో వేస్తున్నాడు అంటూ యూఎస్ఏ ఫాన్స్ మైదానంలో అరుస్తూ, ఇమిటేట్ చేస్తూ గోలగోల చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 190/9 పరుగులు చేయగా.. యూఎస్ఏ 159/8 పరుగులకే పరిమితమైంది. తారిక్‌ను టీమిండియాపై ఆడించాలన్నదే పాక్ అసలు ప్లాన్.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!