Hardeep Singh Puri: ‘‘ఎప్‌స్టీన్‌ను 3-4 సార్లు కలిశా, కానీ’’ రాహుల్ విమర్శలపై కేంద్రమంత్రి క్లారిటీ..
- రాహుల్ గాంధీ ‘‘ఎప్‌స్టీన్’’ ఆరోపణలపై కేంద్రమంత్రి క్లారిటీ..
- అధికారిక బృందంతో కలిసినట్లు చెప్పిన హర్దీప్ సింగ్ పూరి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hardeep Singh Puri: ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి పేరు ఉందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై కేంద్రమంత్రి స్పందిస్తూ, కాంగ్రెస్ నేతపై ఎదురుదాడికి దిగారు. ‘‘తాను కొన్ని సందర్బాల్లో ప్రతినిధి బృందంలో భాగంగా మాత్రమే కలిశాను. అతడికి ఒక ఇమెయిల్ మాత్రమే చేశాను’’ అని ఆయన స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నట్లు ఎప్‌స్టీన్‌తో తన సంబంధాల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పూర్తిగా అధికారిక, ప్రొఫెషనల్ మీటింగ్స్‌లో భాగంగా మాత్రమే ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు తెలిపారు. 2009-17 మధ్య కేవలం 3-4 మీటింగ్స్ లో పాల్గొన్నట్లు చెప్పారు.
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- CEC Impeachment: CEC జ్ఞానేష్ కుమార్‌ను తొలగించడం అంత ఈజీ కాదు.. రాజ్యాంగం ఏం చెబుతోంది.?
- Tejasvi Surya: జీన్ జీ అయినా.. ఎవరైనా నిజాయితీ నాయకులనే కోరుకుంటారు
- Aadhaar Free Update Deadline: ఆధార్ అప్డేట్ డెడ్‌లైన్ మిస్ అయితే ఇబ్బందులే.. UIDAI కీలక సూచనలు
“నేను న్యూయార్క్‌లోని UNలో భారత రాయబారిగా చేరిన మే 2009 నుండి 2017లో మంత్రి అయ్యే వరకు మూడు మిలియన్ల ఈమెయిల్‌లు విడుదలయ్యాయి. ఈ కాలంలో, మూడు లేదా నాలుగు సమావేశాల గురించి మాత్రమే ప్రస్తావనలు ఉన్నాయి. నా సంభాషణలు పూర్తిగా ప్రొఫెషనల్‌గా ఉన్నాయి, ఇండిపెండెంట్ కమిషన్ ఆన్ మల్టీలేటరలిజం , ఇతర అంతర్జాతీయ పనులకు సంబంధించినవి” అని పూరి వెల్లడించారు. 8 ఏళ్ల కాలంలో కేవలం ఒక ఈమెయిల్ మాత్రమే ఎప్‌స్టీన్‌లో పంచుకున్నట్లు తెలిపారు.
అంతర్జాతీయ శాంతి సంస్థ (IPI) ప్రతినిధి బృందంలో భాగంగా తాను ఎప్‌స్టీన్‌ను కలిసినట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై వివరణ ఇస్తూ.. ఎప్‌స్టీన్ పైల్స్ తీవ్రమైన నేరాలు, పిల్లలపై లైంగిక దాడులు, సెక్స్ ట్రాఫికింగ్ కేసులు సంబంధిత డేటా అని, తాను పాల్గొన్న మీటింగ్స్‌కు వీటిలో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. 2014లో తాను ఎప్‌స్టీన్‌కు పంపిన మెయిల్‌లో కేవలం భారత డిజిటల్ ఎకానమీ అవకాశాల గురించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు. సెక్స్ ట్రాఫికింగ్ లో నిందితుడిగా ఉన్న జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైలులో ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, బిల్ క్లింటన్, బిల్ గేట్స్ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?