Viral Smile Boy: జీవితాన్ని మార్చేసిన ఆ ఒక్క నవ్వు.. ఇంతకీ ఆ వైరల్ కుర్రాడు ఎవరంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Smile Boy: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల కొత్త వీడియోలు పుట్టుకొస్తుండగా.. అందులో కొన్ని వైరల్ అవుతుంటాయి. వాటిలో చాలా వీడియోలు కొద్ది రోజులకే మరిచిపోతాం. కానీ కొన్ని మాత్రం ఎలాంటి ప్రత్యేకమైన కథ లేకపోయినా వాటిని మళ్లీ మళ్లీ చూస్తూనే ఉంటాము. అలాంటి వీడియోల్లో ఒకటి టీ గ్లాస్ చేతిలో పట్టుకుని పగలబడి నవ్వే ఒక యువకుడి వీడియో గురించి ఇప్పుడు చూద్దాం. ఆ నవ్వు చూసిన ప్రతి ఒక్కరి ముఖంలోనూ చిరునవ్వు వచ్చే ఆ కుర్రాడెవడో చూసేద్దామా.
NED vs NAM: పాకిస్థాన్ను వెనక్కి నెట్టిన నెదర్లాండ్స్! నమీబియాపై ఘన విజయం..
Also Read
ఆ వైరల్ నవ్వు వెనుక ఉన్న యువకుడి పేరు అరుణ్. అతను తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాలపల్లి (నలపుచ్చటవల్లి) గ్రామానికి చెందిన ఓ సాధారణ యువకుడు. జీవనోపాధి కోసం అతను లారీ క్లీనర్ గా పనిచేస్తున్నాడు. ఈ వీడియోను చిత్రీకరించిన వ్యక్తి లారీ డ్రైవర్ నెహ్రూ. ఇది ముందే ప్లాన్ చేసి తీసిన వీడియో కానేకాదు.
అసలు ఆ నవ్వుకు గల కారణం విషయానికి వస్తే.. ఒక రోజు టీ తాగుతున్న సమయంలో నెహ్రూ సరదాగా చెప్పిన జోక్ విని అరుణ్ పకపక నవ్వాడు. ఆ సహజమైన క్షణం ప్రత్యేకంగా అనిపించడంతో నెహ్రూ తన మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతే ఆ చిన్న వీడియోకు భారీ స్పందన లభించింది. కేవలం కొద్దీ రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఆ నవ్వు ఏ సమయంలో నవ్వాడో కానీ.. మీమ్‌లలో, కామెడీ వీడియోల్లో బాగా వినియోగిస్తూ సోషల్ మీడియాలో ఒక ట్రేడ్ మార్క్ గా మిగిలాడు.
T20 World Cup: యూ-టర్న్ డ్రామా.. పాకిస్తాన్‌ను ఐసీసీ ఎలా దారికి తెచ్చింది..?
అయితే ఈ గుర్తింపు వెనుక అరుణ్ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి. పేదరికం కారణంగా నాలుగో తరగతిలోనే చదువు మానేయాల్సి వచ్చింది. చిన్న వయసులోనే పని చేయడం ప్రారంభించాడు. కానీ డ్రైవర్ నెహ్రూ ప్రోత్సాహంతో మళ్లీ చదువుపై దృష్టి పెట్టి ఇటీవల 10వ తరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణుడయ్యాడని సమాచారం. నిజానికి ఒక సాధారణ నవ్వు అతని జీవితాన్ని మార్చేసిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!