Beetroot Face Mask: మీ ముఖం గులాబీ రంగులో మెరిసిపోతుంది.. హోం మేడ్ బీట్‌రూట్ ఫేస్ మాస్క్ ట్రై చేయండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Beetroot Face Mask: అందమైన, ఆకట్టుకునే ముఖం ఉండాలని ఎవరు కోరుకోరు.. అంతేకాదు.. అందమైన, మెరిసే చర్మం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా పార్లర్ ట్రీట్‌మెంట్స్ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి కూడా వెనుకాడరు.. అయితే, డబ్బులు భారీగా ఖర్చు చేసే అవసరం లేకుండానే.. మన వంటగదిలోనే లభించే సహజ పదార్థాలతో చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా మార్చుకోవచ్చు. వాటిలో బీట్‌రూట్ ఒక ముఖ్యమైన పదార్థం. బీట్‌రూట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి సహజమైన గులాబీ కాంతిని అందించడంలో సహాయపడతాయి. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే 4 బీట్‌రూట్ ఫేస్ మాస్క్‌లు ఇవి.
1. బీట్‌రూట్ – క్యారెట్ ఫేస్ మాస్క్
బీట్‌రూట్ మరియు క్యారెట్ రసం చర్మాన్ని చల్లబరుస్తూ సహజ కాంతిని ఇస్తాయి… బీట్‌రూట్ రసం, క్యారెట్ రసం సమాన మోతాదులో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేసి తయారు చేసుకోవచ్చు.. ఆ తర్వాత ప్రతి ఉదయం ఒక ఐస్ క్యూబ్‌ను ముఖంపై సున్నితంగా రుద్దాలి. 10–15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.
Also Read
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ "చిట్టి పునుగులు".. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
2. బీట్‌రూట్ – పెరుగు ఫేస్ మాస్క్
ఈ మాస్క్ చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా మారుస్తుంది. ఒక మధ్యస్థ బీట్‌రూట్ తురిమి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల బాదం నూనె కలపి తయారు చేసుకోవాలి.. ముఖం, మెడపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 15–20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
3. బీట్‌రూట్ – క్రీమ్ ఫేస్ మాస్క్
చర్మంలోని ట్యాన్‌ను తగ్గించడంలో ఈ మాస్క్ సహాయపడుతుంది.. 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం, 1 టీస్పూన్ తాజా క్రీమ్ (సోర్ క్రీమ్) కలపి తయారు చేసుకోవచ్చు.. ఇక, ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
4. బీట్‌రూట్ – నారింజ తొక్కల ఫేస్ మాస్క్
తక్షణ సహజ మెరుపు కోసం ఇది ఉత్తమమైన మాస్క్ ఇది.. 2 టీస్పూన్ల నారింజ తొక్కల పొడి, 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం కలిపి మందపాటి పేస్ట్ చేయాలి.. ఆ తర్వాత ముఖం, మెడకు అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించవచ్చు.
గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే.. బీట్‌రూట్ సాధారణంగా చర్మానికి సురక్షితం. అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. సున్నితమైన లేదా దీర్ఘకాలిక చర్మ సమస్యలు ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ చర్మ సంరక్షణలో మార్పులు చేయడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
తాజావార్తలు
-
Sabudana Soup Recipe: మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్‌ను పక్కన పెట్టి.. ఈ సగ్గుబియ్యం సూప్ తాగితే అలసట, నీరసం ఉండవు..
-
సైబర్ నేరగాళ్లపై Telangana Cyber Security Bureau మెగా ఆపరేషన్.. 6 రాష్ట్రాల్లో 101 మంది అరెస్ట్..!
-
Homemade Ghee: గంటల తరబడి చిలకాల్సిన పనిలేదు.. ఇంట్లోనే మీగడ నుంచి పూస పూస లాంటి నెయ్యి తయారు చేయండిలా..
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
Telangana DA Hike: ఉద్యోగులకు దసరా కానుక.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు.. బకాయిల చెల్లింపుపై క్లారిటీ!
ట్రెండింగ్
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?