35 లక్షలకుపైగా AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్, HDR10+ సపోర్ట్ తో ఫిబ్రవరి 24న రాబోతున్న iQOO 15R!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
iQOO 15R: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ iQOO భారత మార్కెట్‌లో మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను తీసుకవస్తుంది. iQOO 15R పేరుతో రాబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఫిబ్రవరి 24న భారతదేశంలో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. లాంచ్‌కు ముందు ఈ ఫోన్‌కు సంబంధించిన పలు కీలక స్పెసిఫికేషన్లు, ఫీచర్లను కంపెనీ వెల్లడిస్తోంది.
డిస్‌ప్లే, ప్రీమియం డిజైన్:
iQOO 15Rలో 1.5K రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లే ఉండగా.. ఇది 144Hz వరకు రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్ అందిస్తుంది. అలాగే 5,000 నిట్స్ వరకు లోకల్ పీక్ బ్రైట్‌నెస్ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది. ఫోన్ వెనుక భాగంలో చదరపు ఆకారంలో డ్యూయల్ రియర్ కెమెరా మాడ్యూల్ ఉండనుంది.
Also Read
- Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
- Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
- Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
Raisins vs Dried Grapes: ద్రాక్ష నుండి ఎండుద్రాక్షను ఎలా తయారు చేస్తారో తెలుసా..? అసలు తేడా ఏంటి..?
హైఎండ్ ప్రాసెసర్:
ఈ స్మార్ట్‌ఫోన్ కు క్వాల్కమ్ Snapdragon 8 Gen 5 (3nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ శక్తినిస్తుంది. AnTuTu బెంచ్‌మార్క్‌లో ఇది 35 లక్షలకుపైగా స్కోర్ సాధించగలదని కంపెనీ పేర్కొంది.అంతేకాకుండా Q2 సూపర్‌కంప్యూటింగ్ చిప్, నెట్‌వర్క్ ఎన్‌హాన్స్మెంట్ చిప్ కూడా ఉంటాయి. ఉష్ణోగ్రత నియంత్రణ కోసం 6.5K ఐస్‌కోర్ VC కూలింగ్ సిస్టమ్ అమర్చబడింది. ఇది 10 నిమిషాల్లో 15°C వరకు ఉష్ణోగ్రతను తగ్గించగలదని కంపెనీ చెబుతోంది.
కనెక్టివిటీ, భద్రత:
iQOO 15Rలో బ్లూటూత్ 6, Wi-Fi 7, NFC, USB టైపు-C పోర్ట్, ఇన్‌ఫ్రారెడ్ బ్లాస్టర్ వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు ఉంటాయి. అలాగే IP68+IP69 రేటింగ్‌లతో నీరు, దుమ్ము నిరోధకత ఉంటుంది. భద్రత కోసం అల్ట్రాసోనిక్ 3D ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఇవ్వబడుతుంది.
EPFO కొత్త మొబైల్ యాప్.. UPI ద్వారా PF డబ్బు విత్‌డ్రా సౌకర్యం!
భారీ బ్యాటరీ:
ఈ ఫోన్‌లో 7,600mAh బ్యాటరీ ఉండి, 100W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. కంపెనీ ప్రకారం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 3.1 గంటల గేమింగ్, 7.1 గంటల సోషల్ మీడియా బ్రౌజింగ్, 16.3 గంటల వీడియో ప్లేబ్యాక్ అందించగలదు.
రంగులు, లభ్యత:
iQOO 15R డార్క్ నైట్, ట్రయంఫ్ సిల్వర్ రంగులలో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
తాజావార్తలు
-
RC17 : రామ్ చరణ్ – సుకుమార్ సినిమా షూటింగ్, రిలీజ్‌కు పక్కా ప్లాన్
-
Dhoni-Rohit: ధోనీని చూసి భయపడ్డా.. రోహిత్ సూపర్.. టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Samsung Galaxy A08: సామ్ సంగ్ Galaxy A08 భారత్‌లో లాంచ్.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
-
FASTag నిబంధనల్లో కీలక మార్పులు.. వారికి గుడ్‌న్యూస్..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?