CM Chandrababu: ప్రతిపక్షం లేదని లైట్ తీసుకోవద్దు.. మంత్రులకు సీఎం కీలక ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.. తొలిరోజు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సమావేశాలకు హాజరైనా.. రేపటి నుంచి వైఎస్ జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు అవుతారా? లేదా? అనే దానిపై క్లారిటీ లేదు.. అయితే, కేబినెట్ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో వివిధ అంశాలపై చర్చించారు.. ఈ సందర్భంగా మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.. అసెంబ్లీకి ప్రతి మంత్రీ సబ్జెక్ట్ ప్రకారం ప్రిపేర్ అయ్యి రావాలి. ప్రతిపక్షం లేకపోయినా “ఏదో ఒకటి సభలో చెప్పుదాం” అనే తార్కిక ధోరణి వద్దు. అసెంబ్లీ ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం వరకు మంత్రుల పేషీలో ఉండి MLAల సమస్యలను పరిష్కరించాలని అని స్పష్టం చేశారు..
Also Read
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- Chandrababu–Pawan Kalyan Meeting: చంద్రబాబు–పవన్ కల్యాణ్ భేటీలో కీలక నిర్ణయాలు.. స్థానిక ఎన్నికలపై ఫోకస్
సభలో మంత్రులు చెప్పే సమాధానాలు సంక్షిప్తం, అర్థమయ్యే రీతిలో ఉండాలని అని సూచించారు సీఎం చంద్రబాబు.. ఇక, స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు పేర్లను స్వర్ణ సచివాలయాలుగా మార్చడం. అసైన్ చేసిన భూములను సౌరశక్తి కింద కౌలు ఇవ్వడానికి అనుమతి.. ఒక్కో ఎకరాకు ఏడాదికి 30,000 రూపాయలు, రెండు సంవత్సరాల తరువాత 5 శాతం పెంపు అంశాలపై సూచనలు చేశారు.. మరోవైపు.. శ్రీశైలంలో క్యూ లైన్‌లో భక్తులు ఇబ్బంది పడకుండా ముందస్తు అనౌన్స్‌మెంట్ చేయాలని సూచించారు.. ఇక, ఏపీకి రావాల్సిన 12,000 కోట్లు కేంద్రం విడుదలకు అంగీకరించింది.. మూడు ఏళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు.. కేంద్రం బడ్జెట్‌లో ప్రకటించిన హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ అమరావతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.. కేంద్రం అంగీకరించిందని వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
తాజావార్తలు
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
-
Ishan Kishan: శ్రేయస్ అయ్యర్ కోసం త్యాగం చేశా.. ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!