Dhurandhar OTT Record: ఓటీటీలో ‘ధురంధర్’ జాతర.. వ్యూస్‌లో దూసుకుపోతున్న యాక్షన్ థ్రిల్లర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar OTT Record: బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన చిత్రం ‘ధురంధర్’. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం అక్కడ కూడా దుమ్ములేపుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కూడా కనీవినీ ఎరుగని రీతిలో రికార్డులను తిరగరాస్తోంది. జనవరి 30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ధురంధర్ సినిమా.. విడుదలైన మూడు రోజుల్లోనే గ్లోబల్ లెవల్లో ట్రెండింగ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. కేవలం 72 గంటల్లోనే ఈ సినిమాకు 7.6 మిలియన్ వ్యూస్ లభించాయి. ఈ సినిమాకు పదిరోజుల్లో దాదాపు 16 మిలియన్ల వ్యూస్ (15.9) వచ్చినట్లు నెట్‌ఫ్లిక్స్ తాజాగా తెలిపింది.
READ ALSO: AP Crime: నా కుమార్తెను వ్యభిచార కూపంలోకి దించారు.. కాపాడండి.. హోంమంత్రికి మహిళ విజ్ఞప్తి..
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
- Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
థియేటర్లలో విడుదలై ఇప్పటికే సంచలనం సృష్టించిన ఒక సినిమా ఓటీటీలోను భారీ వ్యూస్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇది నాన్-ఓటీటీ డైరెక్ట్ రిలీజ్ చిత్రానికి ఆల్-టైమ్ రికార్డ్ స్టార్ట్ అని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమాలో ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్, ఎమోషన్స్, మేకింగ్ స్టైల్ ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కేవలం భారతదేశంలోనే కాకుండా, ఇతర దేశాల్లో కూడా ‘ధురంధర్’ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన 72 గంటల్లోనే 7.6మిలియన్ల వ్యూస్‌తో గ్లోబల్ టాప్-10 నాన్ ఇంగ్లీష్ ఫిల్మ్స్ జాబితాలో నెం.1 స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 2 నుంచి 8 వరకూ 8.2 మిలియన్ల వ్యూస్‌ను సాధించి, ఏకంగా 11 దేశాల్లో నం.1 గా ఈ చిత్రం కొనసాగుతుండటం విశేషం. నెక్ట్స్ పార్ట్ కోసం ఇప్పటి నుంచే ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ధురంధర్2’ సినిమాను ఐదు భాషల్లో ఒకేసారి మార్చి 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. రణవీర్ సింగ్ యాక్షన్, అక్షయ్ కన్నా విలనిజం ఈ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా ఓటీటీలో మరెన్ని రికార్డులు కొళ్లగొడుతుందో వేచిచూడాలి మరి.
READ ALSO: Mahesh Babu: గుణశేఖర్ యూఫోరియా సినిమాపై మహేష్ బాబు రివ్యూ ఇదే!
తాజావార్తలు
-
Kerala Assembly: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపునకు కేరళ అసెంబ్లీ తీర్మానం.. అసలు కారణాలివే
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!