Kodo Millet Idli: ఇంట్లోనే తక్కువ టైమ్‌లో హెల్తీ, టేస్టీ టిఫిన్.. రైస్ లేకుండా అరికెలతో మృదువైన ఇడ్లీలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodo Millet Idli: ఇడ్లీని చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే మృదువుగా ఉండి సులభంగా జీర్ణమవుతుంది. కడుపు నిండేలా చేస్తుంది. అయితే ఈ ఇడ్లీని ఇంకా ఆరోగ్యకరంగా మార్చాలంటే బియ్యం బదులుగా మిల్లెట్స్ వాడితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచన మీకూ వచ్చే ఉంటుంది. ఇప్పుడు ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే కోడో మిల్లెట్ (ఆరికలు) ఇడ్లీ గురించి తెలుసుకుందాం.. కోడో మిల్లెట్‌ను తమిళంలో వరగు, తెలుగులో అరికెలు అంటారు. ఇది పోషకాలు ఎక్కువగా ఉన్న ఒక మంచి ధాన్యం. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. బియ్యంతో పోలిస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగదు. అందుకే డయాబెటిస్ ఉన్నవారికి ఇది మంచి ఎంపిక. తరచుగా తీసుకుంటే జీర్ణ సమస్యలు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలని భావించే వారికి సైతం ఇది ఉపయోగకరం. ఇప్పుడు ఇంట్లోనే కోడో మిల్లెట్ స్టఫ్డ్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం.
READ MORE: Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ..
Also Read
- Hyderabadi Dalcha Recipe: అన్నంలోకి అదిరిపోయే సైడ్ డిష్.. ఇంట్లోనే అసలైన హైదరాబాదీ దాల్చా..
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
ముందుగా ఆరికెలతో ఇడ్లీ పిండిని సిద్ధం చేసుకోవాలి.పొటాటో మసాలా కోసం మూడు పెద్ద బంగాళాదుంపలను మరిగించి తొక్క తీసి మెత్తగా చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, రెండు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి అందులో మినప్పప్పు, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు వేయించాలి. తరువాత ఉల్లిపాయలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. పసుపు, ఉప్పు వేసి కలపాలి. చివరగా మెత్తగా చేసిన బంగాళాదుంపలు వేసి బాగా కలిపి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించాలి. అంతే, పొటాటో మసాలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఇడ్లీ మోల్డ్స్‌కి కొద్దిగా నూనె రాసి, ముందుగా కొంచెం పిండిని పోయాలి. దాని మీద ఒక స్పూన్ పొటాటో మసాలా వేయాలి. పైగా మళ్లీ కొంచెం పిండిని పోసి మూసివేయాలి. తరువాత 12 నుంచి 15 నిమిషాలు ఆవిరితో ఉడికించాలి. వేడి వేడి కోడో మిల్లెట్ స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. ఇడ్లీలు మెత్తగా రావాలంటే పిండి పులియడం చాలా ముఖ్యం. కనీసం 8 నుంచి 10 గంటలు, రాత్రంతా వేడి ప్రదేశంలో ఉంచితే మంచి ఫలితం ఉంటుంది. ఇలా పులిస్తే ఇడ్లీలు మృదువుగా వస్తాయి. అలాగే పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!