చైత్ర నవరాత్రి చివరి రోజు శ్రీరామునికి అంకితం చేయబడింది. చైత్ర మాసం శుక్ల పక్షం తొమ్మిదో రోజున పుష్య నక్షత్రంలో పూర్ణిమ రోజున శ్రీ రాముడు అవతరించినందున శ్రీరాముని భక్తులు  చాలా రోజుల ముందు నుంచే సన్నాహాలు చేస్తారు.

ఏ రామ భక్తుడికైనా ఇది చాలా ప్రత్యేకమైన రోజు. అయితే ఆరోజు చేయవలసిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం.

చేయవలసిన పనులు.. చాలా ప్రాంతాల్లో రాముడి విగ్రహాన్ని ఊయలలో ఉంచుతారు. ఉపవాసం ఆచరించడం వల్ల మీకు సుఖం, శ్రేయస్సు కలుగుతాయి. పాపాలు నశిస్తాయి. మీరు లేచిన వెంటనే దేవునికి అర్ఘ్యం సమర్పించండి. 

అయోధ్యలోని సరయూ నదిలో పవిత్ర స్నానం చేయడం వలన మీ గత, ప్రస్తుత జన్మల పాపాలు తొలగిపోతాయి.

రామచరిత్ మానస్, రామ్ చాలీసా,  హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని త్రికరణ శుద్ధిగా పఠించాలి. మీ భక్తి ఎంత ఎక్కువగా ఉంటే అంత ఫలితాలు వస్తాయి.

నిరుపేదలకు దానం చేయండి.. రాముడు మధ్యాహ్న సమయంలో జన్మించాడు కాబట్టి, ఈ సమయంలో రామ నవమి పూజ చేయడం అత్యంత అనుకూలమైనది.

ఈ రోజున అర్చనలు, నిర్దిష్ట పూజలు చేయవచ్చు. వీటన్నింటిని ఏకకాలంలో నామ జపం, మంత్రాలు, శ్లోక పఠనంతో అనుసరించాలి.

ఉపవాసం ఉన్నప్పుడు చాలా నీరు తాగండి. ఈరోజు ఎవరినీ మోసం చేయకూడదు గుర్తుంచుకోండి.

చేయకూడని పనులు.. తామసిక ఆహారాలు, మాంసాహారం, మద్యపానానికి దూరంగా ఉండండి.

ఉల్లిపాయలు, వెల్లుల్లి జోడించకుండా మీరు కూరలను తీసుకోవచ్చు.

నవరాత్రి వేళ జుట్టు కత్తిరించుకోకూడదు. ఈ పండుగ సమయంలో షేవింగ్ కూడా నిషేధించబడింది.

ఇతరులను విమర్శించవద్దు లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకండి. మాట, ఆలోచన లేదా చేత ఇతరులను బాధించవద్దు.