Anil Ambani: అంబానీకి షాక్ ఇచ్చిన బాంబే హైకోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anil Ambani: రిలయన్స్ గ్రూప్ అధినేత అనిల్ అంబానీకి బాంబే హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతంలో ఆయనకు అనుకూలంగా ఉన్న మధ్యంతర ఉపశమనాన్ని తాజాగా కోర్టు రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు వివాదం ఏంటంటే.. అనిల్ అంబానీకి చెందిన కంపెనీల వ్యవహారాల్లో నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంకులు ఆయన ఖాతాలను ‘మోసపూరితమైనవి’ గా ప్రకటించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ప్రక్రియను సవాలు చేస్తూ అనిల్ అంబానీ గతంలో కోర్టును ఆశ్రయించారు.
Also Read
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
కోర్టులో ఏం జరిగిందంటే..
2025 డిసెంబర్‌లో ఒక సింగిల్ జడ్జి అనిల్ అంబానీకి ఉపశమనం కల్పించారు. నిధుల దుర్వినియోగాన్ని తేల్చిన ‘ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్ట్’ తయారు చేసిన వ్యక్తి అర్హత కలిగిన చార్టర్డ్ అకౌంటెంట్ కాదని, అందుకే బ్యాంకులు చర్యలు తీసుకోకూడదని స్టే విధించారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బ్యాంకులు డివిజన్ బెంచ్ (ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం)ను ఆశ్రయించాయి. ఆడిట్ నివేదిక సరైనదేనని, నిధుల మళ్లింపు ఆరోపణలు వాస్తవమని బ్యాంకులు వాదించాయి. బ్యాంకుల వాదనతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్‌ను కొట్టివేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చట్టబద్ధంగా సరికాదని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు సమయం ఇవ్వాలని, స్టే విధించాలని అనిల్ అంబానీ కోరినప్పటికీ హైకోర్టు అందుకు నిరాకరించింది. ఫలితంగా, అనిల్ అంబానీ ఖాతాలను ‘ఫ్రాడ్’గా ప్రకటించి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి బ్యాంకులకు ఇప్పుడు మార్గం సుగమం అయ్యింది. ఈ తీర్పుతో అనిల్ అంబానీ బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో మరిన్ని కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి