Couple Friendly Review: కపుల్ ఫ్రెండ్లీ రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 3 / 5
- MAIN CAST: సంతోష్ శోభన్, మానస వారణాసి, రాజీవ్ కనకాల, గోపరాజు రమణ, యోగిబాబు తదితరులు
- DIRECTOR: అశ్విన్ చంద్రశేఖర్
- MUSIC: ఆదిత్య రవీంద్రన్
- PRODUCER: అజయ్ కుమార్ రాజు
టాలీవుడ్‌లో పక్కింటి అబ్బాయి పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన సంతోష్ కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ
శోభన్, ఈసారి వాలెంటైన్స్ డే సందర్భంగా ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సరైన కమర్షియల్ సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంతోష్‌కు ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చింది? మానస వారణాసి నటన ఎలా ఉంది? ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకున్నారు అనే విషయాలు ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
కథా నేపథ్యం:
నెల్లూరుకు చెందిన శివ (సంతోష్ శోభన్) ఒక స్ట్రగ్లింగ్ ఇంటీరియర్ డిజైనర్. ఖాళీగా తిరుగుతున్నాడనే తండ్రి కోపం, ప్రేయసి బ్రేకప్ చెప్పడం లాంటి పరిస్థితుల్లో తన అదృష్టాన్ని వెతుక్కుంటూ చెన్నైకి చేరుకుంటాడు. అక్కడ కష్టాల్లో ఉన్న అతనికి మిత్ర (మానస వారణాసి) పరిచయమవుతుంది. పరిస్థితుల ప్రభావంతో వీరిద్దరూ ఒకే రూమ్‌లో కూడా ఉండాల్సి వస్తుంది. ఒకరికొకరు తోడుగా ఉంటూ ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని ప్రారంభిస్తారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో మిత్ర జీవితంలో ఒక ఊహించని మలుపు ఎదురవుతుంది. ఆ సమస్య ఏమిటి? శివ దాన్ని ఎలా స్వీకరించాడు? అనేదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ:
ఓ నిరుద్యోగ యువకుడు, ఖాళీగా ఉంటున్నాడనే కారణంతో తండ్రితో అను నిత్యం చివాట్లు, గర్ల్‌ఫ్రెండ్ బ్రేకప్‌తో నెల్లూరులో మొదలైన కథ చెన్నైకి షిప్ట్ అవుతుంది. హీరోయిన్ తో పరిచయం తర్వాత వీరి ప్రేమ, లివిన్ రిలేషన్, ఫిజికల్ కాంటాక్ట్, మరో పక్క ఉద్యోగం, బాధ్యతలు కాస్తంత సీరియస్‌గా సాగినా ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా రాసుకున్నాడు దర్శకుడు. నిజానికి ఫస్టాఫ్ లో హీరోహీరోయిన్లు బైక్ మీద తిరుగుతూనే కనిపిస్తారు కానీ ఎక్కడా బోర్ కొట్టవు. అయితే పీక లోతు ప్రేమలో మునిగిపోయిన తరువాత శివకు వేరే అమ్మాయితో మిత్రకు మరో అబ్బాయి తో పెళ్లి అంటూ పెద్దల ఎంట్రీ, ఆపైన హీరోయిన్ వైపు నుండి మరో పెద్ద షాక్ తగలడంతో కథ మరింత ఆసక్తి పెరుగుతుంది. హీరోహీరోయిన్లు ఒకే ఇంట్లో ఉండటం ప్రేమలో పడటం పెళ్లి వరకూ వెళ్లడం లాంటి కథలు టాలీవుడ్‌లో చాలానే వచ్చాయి ఇది కూడా అదేదో కోవలో సాగుతుంది కానీ కొంత ట్విస్ట్ తో.
నటీనటుల పనితీరు:
సంతోష్ శోభన్ శివ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. నిరాశ, నిస్పృహలను పండించడంలో తనదైన మార్కు చూపించాడు. ముఖ్యంగా హాస్పిటల్ సీన్లలో అతని నటన ఎంతో పరిణతితో కూడి ఉంది. తన కెరీర్‌లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్. మానస వారణాసి మిత్ర పాత్రలో ఆశ్చర్యపరిచింది. తన మునుపటి చిత్రంతో పోలిస్తే, ఇందులో ఎమోషనల్ సీన్లలో కళ్లతోనే భావాలను పలికించి ప్రశంసలు అందుకుంది. భారమైన పాత్రను చాలా హుందాగా పోషించింది. ఇతర నటులు: రాజీవ్ కనకాల, గోపరాజు రమణ తమ అనుభవంతో పాత్రలకు ప్రాణం పోశారు. యోగిబాబు కామెడీ ట్రాక్ అక్కడక్కడా నవ్విస్తుంది.
సాంకేతిక విశ్లేషణ:
దర్శకుడు అశ్విన్ చంద్రశేఖర్ ఎంచుకున్న పాయింట్ పాతదే అనిపించినా, దాన్ని డీల్ చేసిన విధానం చాలా కొత్తగా ఉంది. సంభాషణలు చాలా సింపుల్‌గా ఉంటూనే మనసుకు హత్తుకుంటాయి. సినిమాను చాలా నేచురల్‌గా, లైవ్ లొకేషన్స్‌లో చిత్రీకరించడం వల్ల రియలిస్టిక్ ఫీల్ వస్తుంది. సినిమాటోగ్రఫీ: దినేష్ పురుషోత్తమన్ విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. చెన్నై వీధులను, కేరళ లొకేషన్లను ఎంతో అందంగా చూపించారు. సంగీతం: ఆదిత్య రవీంద్రన్ నేపథ్య సంగీతం సినిమాలోని ఎమోషన్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అయితే, మెలోడీ పాటలు మరిన్ని ఉంటే బాగుండేదనిపిస్తుంది.
చివరిగా..’కపుల్ ఫ్రెండ్లీ’ ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!