Bangladesh President: “నన్ను చంపినా సరే.. రాజీనామా చేయనని చెప్పాను!” యూనస్‌పై బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh President: బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాబుద్దీన్, ఆ దేశ మాజీ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూనస్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తనను పదవి నుంచి తొలగించడానికి యూనస్ మూడుసార్లు విఫలయత్నం చేశారని ఆయన బహిరంగంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “అక్టోబర్ 2024లో నన్ను పదవి నుంచి తప్పించడానికి మొదటి ప్రయత్నం జరిగింది. యూనస్ నన్ను ఒక భారంగా భావించారు. కానీ నేను లొంగలేదు, ‘నన్ను ఇక్కడే చంపండి, కానీ రాజీనామా చేయను’ అని తెగేసి చెప్పాను.” అని షాబుద్దీన్ తెలిపారు.
Also Read
- ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
- Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
- CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
- Nirmala Sitharaman: "మరో సంక్షోభం ముంచుకొస్తోంది".. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
తనను తొలగించడానికి మొదట న్యాయమూర్తులను, ఆ తర్వాత ఆర్మీ చీఫ్‌ను కూడా యూనస్ సంప్రదించారని, అయితే ఆర్మీ చీఫ్ అందుకు నిరాకరించడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదని అధ్యక్షుడు వెల్లడించారు. దేశంలో ఎప్పటి నుంచో ఉన్న సంప్రదాయం ప్రకారం ప్రధాన సలహాదారు విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అధ్యక్షుడికి సమాచారం ఇవ్వాలి. కానీ యూనస్ తన పర్యటనల గురించి గానీ, తీసుకున్న నిర్ణయాల గురించి గానీ తనకు ఏమీ చెప్పడం లేదని షాబుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. అమెరికాతో జరిగిన సుంకాల ఒప్పందం వంటి కీలక విషయాలను కూడా తన నుంచి దాచిపెట్టారని, తన ఆఫీసులోని ప్రెస్ విభాగాన్ని కూడా రద్దు చేశారని ఆయన మండిపడ్డారు.
అధ్యక్షుడిని ఒక ఖైదీలా..
“నేను ప్రధాన సలహాదారుని నియమించినప్పటికీ, నన్ను ప్రభుత్వంలో పేరుకే ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఆహ్వాన లేఖలను కూడా నాకు ఇవ్వడం లేదు. నేను ఎవరినీ కలవకుండా, మాట్లాడకుండా అడ్డుకుంటున్నారు. ఒకవేళ నేను అధ్యక్షుడిగా లేకపోతే, ఈ ప్రభుత్వం ఇప్పటికీ ఎన్నికల ఊసే ఎత్తేది కాదు” అని షాబుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనస్, ఆయన ప్రభుత్వం విచారణ ఎదుర్కొంటున్న సమయంలో షబుద్దీన్ ఇంటర్వ్యూ బయటికి రావడం సంచలనాన్ని రేపుతుంది.
తాజావార్తలు
-
ICC fine: వెస్టిండీస్‌తో ఓటమి.. టీమిండియాకు బిగ్ షాక్ ఇచ్చిన ఐసీసీ..
-
Oppo F35, F35 Pro: ఒప్పో F35, F35 Pro భారత్‌లో లాంచ్.. రూ.38,999కే 8,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్!
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?