Healthy Laddu Recipe: రోజుకో హెల్తీ లడ్డు చాలు.. శరీరానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్, ఐరన్ ఇట్టే లభిస్తాయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Laddu Recipe: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ సరిపడా పోషకాలు త్రిసుకోవడం ఎంత అవసరమో చెప్పక్కర్లేదు. ముఖ్యంగా కాల్షియం, ప్రోటీన్, ఐరన్ వంటి పోషకాలు ఎముకల బలం, కండరాల అభివృద్ధి, రక్తహీనత నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పోషకాలు అన్నీ ఒకే లడ్డులో లభించేలా ఇంట్లోనే సులభంగా తయారు చేసే హెల్తీ లడ్డు గురించి చూసేద్దాం.
అవసరమైన పదార్థాలు:
* పల్లీలు – 100 గ్రాములు
* బాదం – 30 గ్రాములు
* కాజు – 30 గ్రాములు
* తెల్ల నువ్వులు – 250 గ్రాములు
* బెల్లం – రుచికి సరిపడా (సుమారు 150–200 గ్రాములు)
* నెయ్యి – 3 స్పూన్లు
* నీరు – కొద్దిగా (బెల్లం పాకం కోసం)
Also Read
- Heart Attacks: 18ఏళ్లకే గుండెపోటు.. కారణాలు ఇవే!
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
WhatsAppలో కొత్త ఫీచర్.. గ్రూప్‌లో చేరిన వెంటనే “గ్రూప్ మెసేజ్ హిస్టరీ”!
తయారీ విధానం:
ఈ హెల్తీ లడ్డు తయారీకి ముందుగా 100 గ్రాముల పల్లీలు తీసుకుని బాగా వేయించాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకుని పక్కన ఉంచాలి. ఆ తర్వాత 30 గ్రాముల బాదం, కాజు తీసుకుని కాస్త వేయించి వాటిని కూడా మిక్సీలో వేసి పొడిలా చేసి పల్లీల పొడిలో కలపాలి. అదే పాన్ లో పావు కిలో తెల్ల నువ్వులను బాగా వేయించాలి. అందులో నుంచి ఒక గ్లాస్ నువ్వులను పక్కన ఉంచి, మిగిలిన నువ్వులను మిక్సీలో వేసి పొడిలా చేసుకుని పల్లీలు, బాదం, కాజు పొడితో కలిపి బాగా మిక్స్ చేయాలి.
ఇప్పుడు అదే పాన్ లో రుచికి సరిపడా బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి పాకం తయారు చేయాలి. పాకం సిద్ధమైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి కలపాలి. తరువాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి మిశ్రమాన్ని ఈ పాకంలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి తీసి కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మళ్లీ పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసి బాగా కలపాలి. చివరిగా మూడు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి, మీకు నచ్చిన సైజులో లడ్డులుగా చేసుకోవాలి. అంతే ‘హెల్తీ లడ్డు’ రెడీ.
T20 World Cup 2026 India: 0,0,0,0,0,0,0,0,0,0,0.. చెత్త రికార్డును మూటగట్టుకున్న టీమిండియా!
ఈ హెల్తీ లడ్డులో పల్లీలు, నువ్వులు, బాదం, కాజు, బెల్లం వంటి సహజ పదార్థాలు ఉండటం వల్ల ఇది పూర్తి పోషకాహారంగా పనిచేస్తుంది. ఇది ఎముకలను బలపరచడంలో, శక్తిని అందించడంలో, శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో ఎంతగానో సహాయపడుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ ప్రతిరోజూ ఒక లడ్డు తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని సులువుగా మెరుగుపరచుకోవచ్చు.
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!