Realme P4 Lite: కేవలం రూ.7,999 కే అదిరిపోయే స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Realme P4 Lite: తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారికోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ రియల్‌మే భారత్‌లో సరికొత్త ఫోన్‌ను రిలీజ్ చేసింది. అదే రియల్‌మే పి4 లైట్. ముఖ్యంగా ఫోన్ బ్యాటరీ రోజంతా రావాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
READ ALSO: Prabhas: “ప్రేమలో పడాలని ఉంది”.. మనసులో మాట బయటపెట్టిన రెబల్ స్టార్ ప్రభాస్!
Also Read
- 50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
- Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్‌ప్లే
- JioBharat 4G Phone: రూ.299కే JioBharat 4G ఫోన్?.. జియో 10వ యానివర్సరీ ఆఫర్ ఇదే!
- 8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
ధర & ఆఫర్లు ఇవే..
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. లాంచ్ ఆఫర్ల తర్వాత ఇది చాలా తక్కువ ధరకే లభిస్తోంది. దీని బేస్ వేరియంట్ ధర సుమారు రూ.9,999 నుంచి స్టార్ట్ అవుతుంది. బ్యాంక్ ఆఫర్లు, కూపన్ డిస్కౌంట్ కలిపి మొత్తంగా ఈ ఫోన్‌పై రూ.2 వేల వరకు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. అన్ని ఆఫర్లు పోను ఈ ఫోన్ కేవలం రూ.7,999 ధరకే లభిస్తుంది. ఈ ఫోన్‌ను ఫిబ్రవరి 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మే వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ప్రీ-ఆర్డర్ కూడా అందుబాటులో ఉంది.
అదిరిపోయే ఫీచర్లు ఇవే..
* ఇందులో 6300 mAh సామర్థ్యం గల పెద్ద బ్యాటరీ ఉంది. దీనివల్ల ఛార్జింగ్ సమస్య లేకుండా ఎక్కువ సేపు వాడుకోవచ్చు. దీనికి సపోర్ట్ ఇచ్చేలా 15W ఛార్జర్ కూడా ఇస్తున్నారు.
* 6.74 అంగుళాల HD+ స్క్రీన్ అందుబాటులో ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది.
* ఇందులో 4GB ర్యామ్, 128GB వరకు మెమరీ ఉంటుంది.
* బ్యాక్ సైడ్ 13MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం ఫ్రంట్ సైడ్ 5MP కెమెరా ఇచ్చారు.
* ఇది బీచ్ గోల్డ్, బ్లాక్, సీ బ్లూ అనే త్రీ కల్లర్స్‌లో లభిస్తుంది.
* వాటర్, డస్ట్ నుంచి ప్రొటక్షన్ కోసం IP54 రేటింగ్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ (సైడ్ మౌంటెడ్), ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?