Ram Pothineni: రామ్ రాసుకున్న కధకి అలాంటి డైరెక్టర్ కావలెను
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ ‘ఎనర్జిటిక్ స్టార్’ రామ్ పోతినేని కేవలం నటనకే పరిమితం కాకుండా, తనలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నారు. గత కొంతకాలంగా వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న రామ్, ఇప్పుడు ఏకంగాఒక అద్భుతమైన కథను వెండితెరపైకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, రామ్ పోతినేని స్వయంగా ఒక పవర్‌ఫుల్ కథను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నటుడిగా ఎన్నో పాత్రలు పోషించిన ఆయన, తన మనసుకు నచ్చిన ఒక పాయింట్‌ను పూర్తిస్థాయి కథగా మలిచారు. అయితే, ఇప్పుడు ఆ కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడి కోసం ఆయన అన్వేషణ మొదలైంది.
Also Read:Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..
Also Read
- Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా 'ఆదర్శ కుటుంబం'పై ఇంత సైలెన్స్ ఏంటి?
- The Paradise OTT: సిల్వర్ స్క్రీన్‌పై 'ది ప్యారడైజ్'లో మిస్సయిన ఆ పాట.. నెట్‌ఫ్లిక్స్ కోసం శ్రీకాంత్ ఓదెల మాస్టర్ స్కెచ్!
- Srikanth Odela: "ఎవర్రా నువ్వు.. ఏంది నీ గోల?".. శ్రీకాంత్ ఓదెల మొండితనం చూసి సుకుమార్ షాక్!
- Srikanth Odela: సుకుమార్ కోసం.. ఇండియాలోనే నెం.1 డైరెక్టర్ ఆఫర్‌కి 'నో' చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాను అనుకున్న భావోద్వేగాలను, సన్నివేశాలను ఏమాత్రం తగ్గకుండా, ఉన్నది ఉన్నట్లుగా తెరకెక్కించగల సత్తా ఉన్న డైరెక్టర్ కోసం రామ్ వెతుకుతున్నారు. సరైన దర్శకుడు దొరికిన వెంటనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. రామ్ లోని క్రియేటివిటీ కేవలం కథ రాయడానికే పరిమితం కాలేదు. చివరిగా ఆయన హీరోగా నటించిన ఆంధ్రా కింగ్ తాలూకా అనే ప్రాజెక్ట్ కోసం ఆయన ఒక పాటను కూడా రాశారు. విశేషమేమిటంటే, ఆ పాటను స్వయంగా ఆయనే ఆలపించడం విశేషం. నటన, డ్యాన్స్, ఇప్పుడు రైటింగ్ మరియు సింగింగ్‌తో రామ్ తనలోని ‘ఆల్ రౌండర్’ను బయటకు తీస్తున్నారు. రామ్ స్వయంగా కథ రాసిన వార్ బయటకు రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. తమ హీరో డ్రీమ్ ప్రాజెక్టును ఏ దర్శకుడు హ్యాండిల్ చేస్తారో అన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తన ప్రతి సినిమా కోసం ఎంతో కష్టపడే రామ్, ఈ సొంత కథ కోసం ఇంకెంత కేర్ తీసుకుంటారో అని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
తాజావార్తలు
-
VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Telangana Rain Alert: తెలంగాణలో వాన మోత.. ఈ జిల్లాలకు పిడుగుల ముప్పు
-
Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
-
Adarsha Kutumbam: రూ.300 కోట్ల హీరో.. తోపు డైరెక్టర్.. అయినా ‘ఆదర్శ కుటుంబం’పై ఇంత సైలెన్స్ ఏంటి?
-
Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!