T20 World Cup: హే బ్రో మీ ఆటిట్యూడ్ మార్చుకోండి.. లేకపోతే సెమీస్ కి వెళ్లలేరు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup: అహ్మదాబాద్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 76 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్‌కప్ మ్యాచుల్లో టీమిండియా వరుస విజయాలకు (12) బ్రేక్ పడింది. దీంతో భారత్ సెమీస్ వెళ్లే అవకాశాలు సంక్లిష్టం అయ్యాయి. అయితే, సూర్య సేన ఆట తీరు మారకుంటే మాత్రం సెమీ ఫైనల్ పోరులో ముందుకు వెళ్లడం చాలా కష్టం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ సెమీస్ కి చేరాలంటే తర్వాత రెండు మ్యాచులలో తప్పక గెలవాల్సిందే.
Read Also: Samantha : నెగెటివిటీ ఉంటే బ్లాక్ చేస్తా.. ట్రోలర్లకు సమంత ‘స్ట్రాంగ్’ వార్నింగ్..
Also Read
- India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
- AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్‌పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
- Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
- Women’s T20 World Cup 2026: 'మారిజాన్ కాప్' దూకుడు.. టీమిండియాకు ప్రపంచకప్ లో తొలి ఓటమి.!
అయితే, భారత్ పై గెలుపుతో దక్షిణాఫ్రికా 2 పాయింట్లతో గ్రూప్ 1లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. భారీ రన్స్ తేడాతో పరాజయం పాలవడంతో టీమిండియా నెట్ రన్‌రేట్ -3.800గా ఉంది.
సూపర్- 8లో భారత్.. జింబాబ్వే, వెస్టిండీస్‌తో మరో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. సెమీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఈ రెండు మ్యాచుల్లోనూ గెలిచి తీరాల్సిందే. అప్పుడు భారత్ ఖాతాలోకి 4 పాయింట్లు వస్తాయి. అలాగే, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో 4 పాయింట్లు లేకపోతే చాలు భారత్ ఈజీగా సెమీస్‌కు వెళ్తుంది.
Read Also: Naresh-Pavitra: ఆమె వచ్చాకే నాన్న అలా మారాడు.. నరేష్ పై కొడుకు నవీన్ షాకింగ్ కామెంట్స్..
ఇక, మిగిలిన రెండు మ్యాచుల్లో ఒకవేళ భారత్ ఒక దాంట్లో విజయం సాధిస్తే పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారుతుంది. దీంతో సౌతాఫ్రికా మిగిలిన తన రెండు మ్యాచుల్లో కచ్చితంగా విజయం సాధించాల్సి ఉంది. వెస్టిండీస్ – జింబాబ్వేకు మధ్య జరగబోయే మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టును టీమిండియా ఓడించాల్సి ఉంటుంది. అప్పుడు భారత్, జింబాబ్వే, వెస్టిండీస్ ఖాతాల్లో తలో రెండు పాయింట్లు మాత్రమే ఉంటాయి. ఇక, ఈ మూడింట్లో నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉన్న టీమ్ సెమీస్‌కు వెళ్తుంది.. కాబట్టి భారత జట్టుకి నెట్ రన్‌రేటే కీలకంగా మారింది. కావునా, ఇప్పటికైనా టీమిండియా ఆటగాళ్లు తమ ఆటిట్యూడ్ ని వదిలి పెట్టి.. మరింత శ్రద్ధగా ఆడాలని క్రికెట్ నిపుణులు సూచిస్తు్న్నారు.
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!