Gold and Silver Prices : మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ప్రధాన కారణాలు చెప్పిన ఆర్థిక మంత్రి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold and Silver Prices : దేశీయ మార్కెట్లో విలువైన లోహాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. సోమవారం ట్రేడింగ్‌లో వెండి ధర ఏకంగా కిలోకు రూ.15,000 పైగా పెరగగా, బంగారం ధర 10 గ్రాములకు రూ.3,000 పైగా ఎగబాకింది. ఈ అసాధారణ పెరుగుదలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పెట్టుబడిదారులకు మరియు వినియోగదారులకు కీలక విషయాలు వెల్లడించారు..
ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు
ఆర్బీఐ (RBI) బోర్డు సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ఉన్న అంతర్జాతీయ పరిణామాలను వివరించారు.. కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.. గతంలో కేవలం భారత్, చైనా డిమాండ్ వల్లే ధరలు పెరిగేవి. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నాయి. ఇదే ప్రస్తుత పెరుగుదలకు ప్రధాన కారణం అని వెల్లడించారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ప్రపంచ అనిశ్చితి: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న కొత్త సుంకాల (Tariffs) హెచ్చరికల వల్ల స్టాక్ మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. దీంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని మరో మాటకగా పేర్కొన్నారు ఆర్థిక మంత్రి..
దిగుమతులపై ఆధారపడటం: భారత్ తన బంగారం అవసరాల కోసం పూర్తిగా దిగుమతులపైనే ఆధారపడుతోంది.. దేశీయంగా తగినంత వెలికితీత వనరులు లేకపోవడం కూడా ధరలపై ప్రభావం చూపుతోందని వెల్లడించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
తాజా ధరల వివారల్లోకి వెళ్తే.. ఈ రోజు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,724 పెరిగి.. రూ.1,60,600కి చేరింఇ.. ఇదే సమయంలో కిలో వెండి ధర రూ.15,931 పెరిగి రూ.2,68,875కు ఎగబాకింది.. అయితే, బంగారం, వెండి ధరల పెరుగుదలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఆర్బీఐ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కొనుగోళ్లు ఇంకా పరిమితి దాటలేదు” అని పేర్కొన్నారు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్..
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!