Ganja Gang Attack: ప్రశ్నించాడనే కోపం.. పంచ్‌లతో ప్రాణం తీశారు
- ప్రశ్నించిన వారిపైనా పంచ్‌లతో పిడిగుద్దుల వర్షం
- గంటపాటు గంజాయి గ్యాంగ్ హంగామా
- గంజాయి గ్యాంగ్‌ను నిలదీసిన హఫీజ్ ముజామిల్
- మమ్మల్నే నిలదీస్తావా అంటూ దాడి చేసిన గంజాయి గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ సిటీలో గంజాయి గ్యాంగ్ అరాచకాలకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లిలో జరిగింది. గంజాయి రాస్కెల్స్.. స్థానికులపైకి ఇనుప రాడ్లు, కత్తులతో దాడికి పాల్పడ్డట్లు తెలుస్తోంది. తాజాగా గంజాయి బ్యాచ్ చేసిన అరాచకం మరొకటి వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో గంజాయి బ్యాచ్ చేసిన దాడిలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు..
శాస్త్రిపురంలో మహ్మద్ ఖదీర్, మహ్మద్ ఖలీల్, మహ్మద్ అల్తాఫ్ అనే ముగ్గురు తమ నివాసాల ముందు వారి ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. శాస్త్రి పురం కాలనీలోకి వచ్చిన ఓ ఆరుగురు వ్యక్తులు గంజాయి మత్తులో ఆకస్మాత్తుగా ముగ్గురిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఖదీర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అప్రమత్తమయ్యేలోగా గంజాయి గ్యాంగ్ ఎస్కేప్ అయ్యేందుకు ప్రయత్నించారు..
Also Read
మైలార్‌దేవ్‌పల్లి శాస్త్రిపురంలో ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది. అర్థరాత్రి రాడ్‌లతో కర్రలతో రెచ్చి పోయిన గంజాయి గ్యాంగ్.. మత్తులో కాలనీ వాసులపై విరుచుకుపడి రాడ్లతో కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఎందుకు దాడి చేస్తున్నారో అర్థ కాక అక్కడే ఉండి ప్రశ్నించిన వారిపైనా పంచ్‌లతో పిడిగుద్దుల వర్షం కురిపించారు. అడ్డువచ్చిన ప్రతి ఒక్కరిపైనా విరుచుకుపడి దాడి చేశారు. గంటపాటు హంగామా చేసింది గంజాయి గ్యాంగ్. ఒక్కసారిగా భయబ్రాంతులకు గురై చాలా మంది ఇళ్లలోకి పరుగులు తీశారు. ఐతే ఈ గంజాయి గ్యాంగ్‌ను నిలదీసి అడ్డుకునే ప్రయత్నం చేశాడు హఫీజ్ ముజామిల్ అనే యువకుడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా అంటూ వారి చేతిలో ఉన్న రాడ్స్‌తో అతన్ని చితకబాదారు.
ఐతే గంజాయి గ్యాంగ్ దాడిలో ఇంటి ముందే కుప్పకూలిన హఫీజ్ ముజామిల్‌ను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రశ్నించిన పాపానికి తమ కొడుకును గంజాయి గ్యాంగ్ పొట్టన పెట్టుకుందని విలపించారు తల్లిదండ్రులు.. చెట్టంత కొడుకు తమ కళ్ల ముందే విల విలలాడుతూ ప్రాణాలు విడవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేశారు పోలీసులు. తప్పించుకు తిరుగుతున్న వారి కొసం గాలిస్తున్నారు మైలార్ దేవ్ పల్లి పోలీసులు…
మరోవైపు ఏపీలో గంజాయి దందా కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకు అక్రమ రవాణాకే పరిమితమైన నిందితులు.. ఇప్పుడు ఏకంగా గంజాయి సాగు చేస్తున్నారు. ఐతే గతంలో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు చేపట్టేవారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోనే గంజాయి సాగు చేయడం కలకలం రేపుతోంది… చందర్లపాడు మండలం లక్ష్మీపురంలో ఈ గంజాయి సాగు వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. వ్యవసాయ పంటలతో నిండే పొలాల్లోనే అక్రమంగా గంజాయి సాగు జరగడం గ్రామస్థులను ఉలిక్కిపడేలా చేసింది. చందర్లపాడు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామంలో మిర్చి తోట మధ్యలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో నందిగామ పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే పొలం వద్దకు చేరుకున్న అధికారులు, రెవెన్యూ శాఖ సిబ్బందితో కలిసి ఆ గంజాయి మొక్కలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అమ్మకానికి సిద్ధంగా ఉంచిన సుమారు 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు…
గంజాయి సాగులో భాగస్వాములైన లక్ష్మీపురం గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్ళు అంగిరేకుల జ్యోతి, గుడారి తిరుపతమ్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిర్చి పంటతో పాటు గంజాయిని ఇద్దరు సాగు చేస్తున్నారు. స్థానికంగా మోటార్లు పోతున్నాయని పోలీసులకి ఫిర్యాదు అందటంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే సమయంలో బస్టాండ్‌లో గంజాయు సిగరెట్లు తాగుతున్న ఇద్దరిని పట్టుకోగా పోలీసులకి తల్లీ కూతుళ్లు అమ్ముతున్నట్టు చెప్పారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరి సాయంతో తల్లీ కూతుళ్లను విచారించగా గంజాయి సాగు చేస్తున్నట్టు గుర్తించి పొలానికి వెళ్లి గంజాయి సాగు గుర్తించారు.
ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయి విత్తనాలను తెప్పించి మిర్చితో కలిపి సాగు చేస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది. మూడు నెలలుగా మిర్చితో పాటు గంజాయి సాగు చేసినట్లు పోలీసులు విచారణ గుర్తించారు. వీరికి గంజాయి విత్తనాలు తీసుకొచ్చిన వారి గురించి కూడా విచారణ చేపట్టారు. సాగు చేసి.. ఎండ పెట్టిన 10 కిలోల గంజాయిని సీజ్ చేశారు. గంజాయి సాగు చేస్తున్న తల్లి కూతురితోపాటు వాటిని వినియోగిస్తున్న ఒక మైనర్ ఒక వ్యక్తిని మరో నలుగురిని అరెస్ట్ చేశారు..
WI vs Zimbabwe: జింబాబ్వే బౌలర్లకు ‘రక్తకన్నీరు’.. సిక్సర్లతో విరుచపడ్డ విండిస్ బ్యాటర్లు!
తాజావార్తలు
-
Peddi 4 days Collections : పెద్ది 4 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.. జస్ట్ మిస్
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!