Jowar Recipes: “జొన్న గుగ్గిళ్లు” ట్రై చేయండి.. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ రెసిపీ..
- రోజూ జొన్న రొట్టెలతో బోర్ కొడుతుందా..
- ఒకసారి జొన్న గుగ్గిళ్లు ట్రై చేయండి..
- రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Recipes: ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, వర్క్ కల్చర్ కారణంగా చాలా మంది ప్రిడయాబెటిక్, డయాబెటిక్‌గా మారుతున్న, కూర్చుని ఒకే చోట కదలకుండా పనిచేస్తుండటంతో చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కావడానికి ‘‘జొన్నలు(Jowar)’’లను ఆహారంగా తీసుకుంటుున్నారు. వైట్ రైస్‌ను పరిమితం చేస్తున్నారు.
జొన్నల్లో బీ-కాంప్లె్క్స్ విటమిన్స్, ఐరన్, మెగ్నీషియం,ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) ఫుడ్ కావడంతో జొన్న వంటకాలు షుగర్‌ను వెంటనే పెంచవు. దీంట్లో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడి షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది. చాలా మంది వెయిట్ లాస్ కావడానికి, షుగర్ కంట్రోల్ కావడానికి ఎక్కువ జొన్న రొట్టెలను తింటుంటారు. రోజూ ఒకే విధంగా తినడం వల్ల జొన్నలు బోర్ కొడుతాయి.
Also Read
- World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
- CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
- Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ 'వెజ్ కీమా'.. సులువుగా చేసేయండి ఇంట్లో.!
- Guest Habits: గెస్ట్‌గా వెళ్తున్నారా? పిలిచినవారు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఇలాంటి సమయంలోనే జొన్న గుగ్గిళ్లు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతమవుతుంది.
తయారీ విధానం:
జొన్న గుగ్గిళ్లు చేయడానికి రాత్రి అంతా జొన్నల్ని నానపెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇవి మెత్తగా, సున్నితంగా మారుతాయి. వీటిని ఒక కుక్కర్‌లో వేసుకుని ఉడికించుకోవాలి.
ఒక పాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. దీని తర్వాత కరివేపాకు అల్లం తురుము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసుకుని మగ్గిన తర్వాత క్యారెట్, పచ్చి బఠాణీలు వేసుకుని కలుపుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత ఉడికించిన జొన్నల్ని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. తినే సమయంలో కొద్దిగా నిమ్మ రసం వేసుకుంటే టేస్ట్ నెక్ట్స్ లెవల్‌లో ఉంటుంది. ఇలాంటి ఆహారం ద్వారా వెయిట్ లాస్ కావడంతో పాటు షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది. ఆరోగ్యానికి ఎంతో మంచింది.
తాజావార్తలు
-
Astrology: సెప్టెంబర్ 30 బుధవారం దినఫలాలు.. ఈ పరిహారం చెల్లించండి.. అంతా శుభమే..!
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!