Last Words Before D*eath: ప్రాణాలు విడిచే ముందు ప్రజలు చెప్పే చివరి మాటలు ఇవే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Last Words Before D*eath: పుట్టినవారికి మరణం తప్పదు అన్నట్టుగా.. పుట్టిన ఏ జీవి అయినా మరణించక తప్పదు.. ప్రజలు రకరకాల కారణాలతో ప్రాణాలు విడిస్తారు.. కొందరు అనారోగ్య సమస్యలతో.. కొందరు ప్రమాదాల్లో.. మరికొందరు వృద్ధాప్య సమస్యలు.. ఇలా ఎన్నో రకాలుగా తనువు చాలిస్తారు.. మరణం అనేది ప్రకృతిలో అత్యంత అనివార్యమైన సత్యం. దాని గురించి మాట్లాడటానికి చాలా మంది భయపడతారు లేదా ఇష్టపడరు. కానీ, ఆసుపత్రుల్లోని ఐసీయూ (ICU) వార్డుల్లో పని చేసే నర్సులకు మరణం అనేది నిత్యం కనిపించే దృశ్యం. ఫ్లోరిడాకు చెందిన 29 ఏళ్ల నర్సు కిర్స్టీ రాబర్ట్స్, గత నాలుగేళ్లుగా వందలాది మంది రోగుల చివరి క్షణాలను దగ్గరుండి చూశారు. ఆమె పంచుకున్న అనుభవాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి..
* మరణానికి ముందు మాటలు.. ఆ 9 సంకేతాలు!
కిర్స్టీ వెల్లడించిన వివరాల ప్రకారం, మరణానికి చేరువలో ఉన్నప్పుడు దాదాపు ప్రతి రోగి పలికే మాటలు ఒకేలా ఉంటాయి. వైద్య పరికరాలు (Monitors) అన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ, రోగికి తన అంత్యం సమీపించిందని ముందే తెలుస్తుందని ఆమె చెబుతున్నారు.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
* మరణానికి ముందు వాళ్లు చెప్పే మాటలు ఇవే..
– “నా కుటుంబ సభ్యులను ప్రేమిస్తున్నానని చెప్పండి”.. ఆఖరి క్షణాల్లో ఆస్తిపాస్తులు కాదు, కేవలం అనుబంధాలే గుర్తుకు వస్తాయి.
– “నేను చనిపోతున్నానని నాకు తెలుసు” – రిపోర్టులు బాగున్నా, లోపల ప్రాణశక్తి తగ్గిపోతున్న విషయాన్ని వారు గ్రహిస్తారు.
– “ఎవరో నన్ను పిలుస్తున్నారు” – చనిపోయిన తమ బంధువులు లేదా దైవ స్వరూపాలు కనిపిస్తున్నట్లు చెబుతుంటారు.
– “నాకు బాగా లేదు.. అసౌకర్యంగా ఉంది” – శరీరం నుంచి ఆత్మ నిష్క్రమించే ముందు కలిగే మార్పు ఇది.
– “నన్ను క్షమించండి” – జీవితంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు.
– “నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది” – భయం పోయి ఒక రకమైన నిశ్శబ్దం ఆవరిస్తుంది.
– “నన్ను గట్టిగా పట్టుకో” – తోడు కావాలని కోరుకుంటారు.
– “నేను వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను” – జీవితంపై మమకారాన్ని వదిలేసిన క్షణం.
– “ధన్యవాదాలు” – తమకు సేవ చేసిన వారికి కృతజ్ఞత తెలుపుతారని ఆమె వెల్లడించారు..
* వైద్య శాస్త్రానికి అందని ఆధ్యాత్మిక మార్పు
మెదడు మరణానికి ముందు శరీరానికి కొన్ని సంకేతాలను పంపుతుందని శాస్త్రవేత్తలు భావిస్తారు. కానీ కిర్స్టీ అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం మెదడు రసాయనాల పని కాదు. మందులు పనిచేయడం మానేసి, ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్లే ముందు ఒక రకమైన “ఆధ్యాత్మిక పరివర్తన” జరుగుతుందని ఆమె నమ్ముతున్నారు. ఈ మార్పును యంత్రాలు కూడా గుర్తించలేవు. ఇక, రోగులతో బంధం ఏర్పరచుకోవడం, వారు వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పడం అత్యంత కష్టమని కిర్స్టీ అంటారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, చివరకు మనం ప్రతిదీ వదిలివెళ్లాల్సిందేనని ఆమె గుర్తు చేస్తున్నారు. అందుకే ఉన్నప్పుడే ఇతరులను ప్రేమించాలని, సహాయం చేయాలని, కృతజ్ఞతతో ఉండాలని ఆమె హితవు పలుకుతున్నారు.
తాజావార్తలు
-
Bhuvneshwar Kumar Comeback: అగార్కర్ హయాంలో భువనేశ్వర్‌కు ఎందుకు చోటు దక్కలేదు?
-
RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
-
Dhanush Political Entry : తమిళనాడు రాజకీయాల్లోకి ధనుష్.. పార్టీ పేరు ఇదే?
-
Amaravati Land Pooling: అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై ఫోకస్.. అధికారులకు మంత్రి నారాయణ కీలక సూచనలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
ట్రెండింగ్
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!