T20 World Cup 2026: టీమిండియాకు 2012 ప్రపంచ కప్ గండం.. అప్పట్లాగే నెట్ రన్ రేట్ దెబ్బకొడుతుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: 2026 టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయం ముటగట్టుకున్న భారత్, ప్రస్తుతం ఈ మెగా టోర్నీలో చాలా ఇబ్బందులను ఎదుర్కుంటుంది. ఈ ఓటమితో భారత్‌కు సెమీఫైనల్ చేరడం ఒక పెద్ద సవాలుగా మారింది. ప్రస్తుతం టీమిండియా నెట్ రన్ రేట్ -3.800 గా ఉంది. ఇది అభిమానులను తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది.
READ ALSO: WhatsApp Supreme Court Case: సుప్రీంకోర్టులో యూ-టర్న్ తీసుకున్న వాట్సాప్..
Also Read
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
- India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
- Ganesh Idol Protest: 'వినాయకుడి'తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
- New Smart Phone: 10,000mAh బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా.. కనీవినీ ఎరుగని రీతిలో రెడ్ మీ కొత్త సిరీస్.. సెప్టెంబర్ 15న లాంచ్..
భారత్ ముందున్న మ్యాచులు ఇవే..
సెమీస్ చేరాలంటే టీమిండియా తన నెక్ట్స్ రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. భారత్ ఫిబ్రవరి 26న జింబాబ్వేతో, మార్చి 1న వెస్టిండీస్‌తో తలపడబోతుంది. టీమిండియా సెమీస్ చేరాలంటే ఉన్న ఛాన్స్‌లు ఏమిటంటే.. దక్షిణాఫ్రికా తన మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ (జింబాబ్వే, విండీస్) గెలవాలి. అప్పుడు భారత్ తన రెండు మ్యాచ్‌లు గెలిస్తే, రన్ రేట్ తో సంబంధం లేకుండా నేరుగా సెమీస్ కి వెళ్తుంది. ఒకవేళ వెస్టిండీస్ జట్టు.. జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై గెలిస్తే.. అప్పుడు భారత్, విండీస్, సౌతాఫ్రికా మూడూ తలో రెండు విజయాలతో సమానంగా ఉంటాయి. అప్పుడు ఎవరి రన్ రేట్ బాగుంటే వారే సెమీస్ కి వెళ్తారు. ప్రస్తుతం భారత్ రన్ రేట్ మైనస్‌లో ఉండటం పెద్ద సమస్యగా మారింది.
2012 నాటి సీన్ రిపీట్ అవుతుందా..
సరిగ్గా 14 ఏళ్ల క్రితం (2012లో) టీమిండియాకు ఇలాగే జరిగింది. అప్పుడు సూపర్-8లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ భారీ తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై గెలిచినప్పటికీ.. ఆస్ట్రేలియా కంటే తక్కువ రన్ రేట్ ఉండటంతో భారత్ సెమీస్ చేరకుండానే ఇంటికి వచ్చేసింది. ఆ టోర్నీలో భారత్ 3 మ్యాచ్‌ల్లో 2 గెలిచినా రన్ రేట్ వల్ల సెమీస్‌కు చేరకుండా తిరిగి రావాల్సి వచ్చింది. పాకిస్థాన్, ఆస్ట్రేలియా మెరుగైన రన్ రేట్‌తో సెమీస్‌కి వెళ్లాయి. ఆ మెగా టోర్నీలో చివరికి వెస్టిండీస్ కప్పు కొట్టింది. సొంత గడ్డపై జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు, రన్ రేట్‌ను కూడా భారీగా మెరుగుపరుచుకోవాలి. ముఖ్యంగా వెస్టిండీస్, జింబాబ్వేపై భారీ తేడాతో గెలిస్తేనే సెమీస్ ఆశలు సజీవంగా ఉంటాయని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. లేదంటే 2012 నాటి కథే మళ్లీ పునరావృతం అవుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
Post Office Schemes: బంపర్ స్కీమ్.. పైసా రిస్క్ లేకుండా నెలనెలా రూ.9 వేలకు పైగా ఆదాయం! ఓ లుక్ వేయండి
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
-
India: అమెరికా, చైనాలను దాటి భారత్ నెంబర్-1.. యూఎస్ ఆర్థికవేత్త సంచలన వ్యాఖ్యలు..
-
Ganesh Idol Protest: ‘వినాయకుడి’తో వినూత్న నిరసన.. దేవుడికి ఈ తిప్పలు తప్పలేదా..?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!