Jos Buttler: 122 మీటర్ల క్యాచ్.. గిన్నిస్ బుక్‌లో చేరిన జోస్ బట్లర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jos Buttler: ఇంగ్లాండ్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ జోస్ బట్లర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన ధనాధన్ బ్యాటింగ్‌తోనే కాకుండా అద్భుతమైన కీపింగ్ తో ప్రత్యుర్థులను ముచ్చెమటలు పట్టించడంలో దిట్ట. ఇప్పుడు జోస్ బట్లర్ మరోసారి క్యాచ్ తో వార్తల్లో నిలిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ రికార్డ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్‌లో నమోదైంది.
Viral Video: ఛీ.. ఛీ.. కాస్తయినా బుద్ది ఉందా? ఒకరు తాగిన కూల్ డ్రింక్‌ను మళ్లీ బాటిల్‌లో పోసి.!
Also Read
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
- Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
- Rothit Sharma: రోహిత్ శర్మ కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాల్సిందే డూడ్..
ఈ రికార్డ్ ఒక ప్రత్యేకమైన ఛాలెంజ్‌లో నమోదైంది. సుమారు 122 మీటర్ల ఎత్తులో డ్రోన్ నుంచి క్రికెట్ బంతిని వదిలారు. అంత ఎత్తు నుండి వేగంగా వస్తున్న బంతిని జోస్ బట్లర్ కళ్లప్పగించి గమనిస్తూ అద్భుత టైమింగ్‌తో క్యాచ్ పట్టాడు. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి ప్రశంసించాడు.
🚨 GUINNESS BOOK OF WORLD RECORD BY JOS BUTTLER 🚨
– Jos Buttler took the world’s highest catch ever 🤯
Height: 122 meters
Location: Cape Town
Method: A drone dropped the ball from the sky– 122 meters is roughly the height of a 40-story building 🥵 pic.twitter.com/Aqq3vl1wUf
— Richard Kettleborough (@RichKettle07) February 12, 2026
ఇంతకుముందు 2021లో ఆస్ట్రేలియాకు చెందిన థిమోతి షానన్ జెబసీలన్ 119.86 మీటర్ల ఎత్తు నుంచి క్యాచ్ పట్టి గిన్నిస్ రికార్డ్ నెలకొల్పాడు. ఇప్పుడు బట్లర్ చేసిన క్యాచ్ ఆ రికార్డ్‌ను బ్రేక్ చేశాడు. అధికారిక ధృవీకరణ రావాల్సి ఉన్నప్పటికీ త్వరలోనే బట్లర్ పేరు గిన్నిస్ బుక్‌లో చేరే అవకాశం ఉంది.
రూ.7,499కే HD+ LCD స్క్రీన్, IP64 రేటింగ్, Android 15 Goతో Lava Yuva Star 3 లాంచ్..
టీ20 వరల్డ్ కప్ 2026లో ఇప్పటివరకు ఇంగ్లాండ్ రెండు మ్యాచ్‌లు ఆడింది. ఆ మ్యాచ్‌లలో బట్లర్ వరుసగా 26 & 21 పరుగులు చేశాడు. మంచి ఆరంభం దక్కినా పెద్ద స్కోర్‌గా మార్చలేకపోయాడు. గ్రూప్ దశలో ఇంగ్లాండ్ తర్వాతి మ్యాచ్ లను స్కాట్లాండ్, ఇటలీతో ఆడనుంది.
తాజావార్తలు
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
-
Jailer 2: రజినీ ‘జైలర్ 2’ బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
-
Kohli 55th Century: రికార్డులే దాసోహమైన వేళ.. విరాట్ కోహ్లీ వీరవిహారం.. పలు రికార్డులు బద్దలు..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?