Funky Review: విశ్వక్ సేన్ ‘ఫంకీ’ మూవీ రివ్యూ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rating : 2.5 / 5
- MAIN CAST: Vishwak Sen, Kayadu Lohar
- DIRECTOR: Anudeep KV
- MUSIC: Bheems Ceciroleo
- PRODUCER: Naga Vamsi
సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్, ఈసారి రూట్ మార్చి పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ ఫంకీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భిన్నంగా ఉంటుందని ముందు నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు. దానికి తోడు నాగ వంశీ నిర్మాత కావడం తెలుగులో కాయాధులోహారును చాలా కాలం తర్వాత రిలాంజ్ చేస్తూ ఉండడంతో సినిమా మీద అంచనాలు ఉన్నాయి. మరి అదే స్థాయి మేజిక్‌ను రిపీట్ చేసిందా? లేదా అనేది సమీక్షలో చూద్దాం.
కథ:
కోమల్ (విశ్వక్ సేన్) ఏ విషయాన్నీ సీరియస్‌గా తీసుకోని ఒక విలక్షణమైన యువకుడు. పెద్ద సినిమా డైరెక్టర్ కావాలన్నదే అతని లక్ష్యం. ఈ క్రమంలో ‘మంచి ప్రొడక్షన్స్’ అధినేత సుదర్శన్ (నరేష్) వద్ద ఒక అవకాశం దొరుకుతుంది. అయితే, ఆ నిర్మాణ సంస్థ వారసురాలు చిత్ర (కయదు లోహర్)కు కోమల్ పద్ధతులు అస్సలు నచ్చవు. అసలు కోమల్‌పై చిత్రకు నమ్మకం ఎందుకు లేదు? ఈ ‘ఫంకీ’ డైరెక్టర్ తన సినిమాను ఎలా పూర్తి చేశాడు? మధ్యలో ఎదురైన సవాళ్లు ఏమిటి? అనేదే మిగతా కథ.
Also Read
విశ్లేషణ:
దర్శకుడు అనుదీప్ మార్కు కామెడీ అంటేనే లాజిక్‌లకు దూరంగా, కేవలం మ్యాజిక్ (నవ్వులు) మీద ఆధారపడి ఉంటుంది. ఈ సినిమాలో కూడా కథ కంటే కామెడీ డైలాగులకే ముఖ్యంగా వన్ లైనర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మొదటి 20 నిమిషాల్లోనే సినిమా టోన్ ఏంటో అర్థమైపోతుంది. వన్ లైనర్ పంచ్‌లు, అమాయకపు వేషాలతో నవ్వించే ప్రయత్నం చేశారు. కోమల్ పాత్రలో విశ్వక్ తనదైన శైలిలో ఒదిగిపోయాడు. కొత్త రకమైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నాడు. అలానే విశ్వక్, కయదు లోహర్ మధ్య వచ్చే సీన్స్ రిఫ్రెషింగ్‌గా ఉన్నాయి. కయదు తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెప్పించింది. అనుదీప్ రాసిన కొన్ని జోకులు థియేటర్లో నవ్వులు పూయిస్తాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో వచ్చే పెళ్లి చూపుల సీన్ సినిమాకే హైలైట్. కేవలం కామెడీ బిట్లనే నమ్ముకుని, బలమైన కథను పక్కన పెట్టడం మైనస్. ఒకే పాయింట్ చుట్టూ కథ తిరుగుతున్న భావన కలుగుతుంది. అనుదీప్ మంచి సినిమా వస్తుందంటే కచ్చితంగా జాతి రత్నాలతో పోలుస్తారు. కానీ ఇక్కడ ‘జాతి రత్నాలు’ స్థాయిలో సహజమైన హాస్యం ఆశించలేం. కొన్ని చోట్ల కామెడీ బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు:
విశ్వక్ సేన్ తన భుజాలపై సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కయదు లోహర్ కెరీర్‌లోనే ఇది మంచి పాత్ర అని చెప్పొచ్చు. సంపత్ రాజ్ ‘జికే’ పాత్రలో విలనిజంతో పాటు వినోదాన్ని కూడా పంచాడు. దిల్ రాజు, హరీష్ శంకర్ వంటి ప్రముఖులు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడం ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఎలిమెంట్.
టెక్నికల్ టీమ్:
దర్శకుడు అనుదీప్ కేవీ తన టేకింగ్ తో మెప్పించే ప్రయత్నం చేసిన సరే తీసుకున్న స్టోరీ లైన్ కి పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లే తీసుకురాలేకపోయారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది, సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన పాటలు ఒకే. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
ఫైనల్లీ:
ఫంకీ లాజిక్ వెతకకుండా, టైమ్ పాస్ కామెడీ కోసమైతే ట్రై చేయొచ్చు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!