Off The Record : ఇస్నాపూర్‌లో కొత్త రకం రాజకీయ సమీకరణలు..
- ఇస్నాపూర్‌లో కొత్త రకం రాజకీయ సమీకరణలు..
- బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య దోబూచులాడిన ఛైర్మన్ పీఠం..
- చేతులు కలిపిన బీజేపీ ఎంపీ రఘునందన్, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మహిపాల్..
- వాస్తవంగా రాజకీయ శత్రువులు రఘునందన్, మహిపాల్..
- ఉమ్మడి శత్రువు నీలం మధుకు చెక్ పెట్టడం కోసమే కలిశారా?..
- మధు భార్య ఛైర్‌పర్సన్ అయితే బలపడతారని భావించారా?..
- ఉమ్మడి శత్రువును ఇద్దరూ కలిసి దెబ్బ కొట్టారా?..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record : సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపల్ ఎన్నికలు ఈ సారి సంచలనం రేపాయి. ఛైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మెజార్టీ ఎవరికీ దక్కలేదు. అటు బీజేపీ ఒక్క వార్డు కూడా గెలవలేదు. మొత్తం 26 వార్డులకుగాను బీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 10చోట్ల గెలిచాయి. మిగతా 4 సీట్లలో స్వతంత్ర కౌన్సిలర్లు విజయం సాధించారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు భార్య కవిత ఇస్నాపూర్ 4వ వార్డు నుంచి గెలిచారు. మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ జనరల్ మహిళకి కావడంతో తన భార్యకు పదవి ఇప్పించుకోవాలనుకున్నారు నీలం మధు. ఇస్నాపూర్ చైర్మన్ పీఠం దక్కించుకోవడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 14. బీఆర్ఎస్ 2 సీట్ల దూరంలో ఉంటే.. కాంగ్రెస్ 4 అడుగుల దూరంలో నిలిచింది. దీంతో ఇక్కడ గెలిచిన నలుగురు స్వతంత్ర కౌన్సిలర్లు కీలకంగా మారారు. వాళ్ళలో ముగ్గురు కాంగ్రెస్‌కి మద్దతు ఇచ్చి ఆ క్యాంప్‌లో చేరిపోయారు. మరొకరు బీఆర్ఎస్ తో చేతులు కలపగా ఆ పార్టీ బలం 13కు చేరి రాజకీం రక్తి కట్టింది. ఈ పరిణామాల నడుమే… బీఆర్ఎస్ కౌన్సిలర్ ఒకరు కాంగ్రెస్ క్యాంపులో చేరడంతో ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ 14 దక్కింది. వెంటనే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి విప్ జారీ చేశారు. ఇక కాంగ్రెస్‌కే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుందని అనుకునేలోపు పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గేమ్ మార్చేశారు. తన ఎక్స్ అఫిషియో ఓటుని ఇస్నాపూర్‌లో నమోదు చేసుకున్నారాయన. దీంతో… రెండు పార్టీల బలం మళ్లీ 14కి చేరింది.
సరే…. ఇక టాస్‌లోనైనా అదృష్టం వరిస్తుందని భావించారు కాంగ్రెస్ నేత నీలం మధు. భారమంతా దేవుడిపైనే వేశామన్నట్టు నడుస్తున్న టైంలో ఆ పార్టీ అస్సలు ఊహించని పరిణామం జరిగింది. బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా తన ఎక్స్ అఫిషియో ఓటును ఇస్నాపూర్‌లోనే నమోదు చేసుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ని గెలిపించడానికే అక్కడ రిజిస్టర్ చేసుకున్నారనేది అందరికి తెలిసిన విషయం. కానీ ప్రత్యర్థి పార్టీ ఎంపీ రఘునందన్ రావు అలా ఎందుకు చేశారో ఎవరికీ అంతుచిక్కలేదు. అదే సమయంలో కాంగ్రెస్‌కు మరోషాక్ తగిలింది. ఆ పార్టీ కౌన్సిలర్ మాధవి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి టచ్ లోకి వెళ్లారు. నీలం మధు భార్య కవితకి మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవి దక్కడం ఇష్టం లేకే ఆమె బీఆర్ఎస్‌తో చేతులు కలిపారట. మరోవైపు ఛైర్మన్ ఎన్నిక రోజున రెండు వేర్వేరు పార్టీలకు చెందిన ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఓకే కారులో రావడం ఇంకా ఆసక్తి రేపింది. దాంతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డే నీలం మధు భార్యను మున్సిపల్ ఛైర్‌పర్సన్ కానివ్వొద్దన్న లక్ష్యం పెట్టుకుని ఎంపీతో చేతులు కలిపినట్టు అంచనా వేశారు అంతా.
Also Read
- OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
- OTR : బీజేపీలో బిగ్ ట్విస్ట్..ఈటెల ఇంట్లో ఏం జరిగింది? బండి సంజయ్‌తో రాజీ ఎలా కుదిరింది?
- OTR : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు? ములుగులో సీతక్కకు చెక్ పెట్టేలా బీఆర్ఎస్ కొత్త స్కెచ్
- Off The Record: అవనిగడ్డ కూటమి పరిణామాలతోబుద్ధప్రసాద్ మధనపడుతున్నారా?
ఇక ఎన్నికలో బీఆర్ఎస్‌కు చైర్మన్ పదవి, కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ మినిట్‌లో హ్యాండ్ ఇచ్చిన మాధవికి వైస్ చైర్మన్ పదవి దక్కాయి.వాస్తవానికి పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాజకీయ శత్రువులు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూడా మహిపాల్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు రఘునందన్. ఇటు నీలం మధు ఈ ఇద్దరు నేతలకు రాజకీయ విరోధి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పటాన్ చెరు నుంచి మహిపాల్ రెడ్డిపై పోటీ చేశారు నీలం. ఆ తర్వాత మెదక్ ఎంపీగా రఘునందన్ పై పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. దీంతో ఇద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువయ్యాడు నీలం. ఆ ప్రకారమే ఇద్దరూ చేతులు కలిపి నీలంకు చెక్ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. ఒక వేళ ఇస్నాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే నీలం మధు సతీమణి మున్సిపల్ ఛైర్‌పర్సన్ అవుతారు. అప్పుడాయన మళ్లీ రాజకీయంగా బలోపేతం అవుతారు కాబట్టి ఇద్దరూ కలిసి దెబ్బ కొట్టారన్న విశ్లేషణలున్నాయి.
తాజావార్తలు
-
NTR : బాలా బాబాయ్ త్వరగా కోలుకోవాలి!
-
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్కు ఊరట.. మెదాంతకు తరలించాలని హైకోర్టు ఆదేశం..
-
Rahul Gandhi-Om Birla: లోక్‌సభ స్పీకర్‌తో రాహుల్ గాంధీ భేటీ.. ఏం డిమాండ్ చేశారంటే..!
-
Kalyan Ram: ‘గెట్ వెల్ సూన్ బాబాయ్’.. బాలయ్య కోసం కళ్యాణ్ రామ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!
-
Gopichand Malineni: ఫ్యాన్స్ టెన్షన్ పడొద్దు.. బాలయ్యకు స్వల్ప గాయమే
ట్రెండింగ్
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!
-
స్క్రీన్ లేకుండానే పనిచేసే Google Fitbit Air త్వరలో భారత్‌లో లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Railway Bedsheet Kurta: ఎంతకు తెగించార్రా.. రైల్వే బెడ్‌షీట్‌తో కుర్తా ఏంటయ్యా.? వైరల్ వీడియో..
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!