Home Loan EMI: హోమ్ లోన్ కట్టడం కుదరలేదా? అయితే మీరు చేయాల్సిన మొదటి పని ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Loan EMI: ఈరోజుల్లో పని చేసే ప్రతి ఒక్కరి కల.. సొంత ఇల్లు కొనుక్కోవడమూ లేదంటే కట్టుకోవడం. చాలా మందికి ఈ కలను నిజం చేసుకోవడానికి డబ్బులు సరిపోక అనేక అవస్థలు పడుతున్నారు. అలాంటి టైంలో చేసేది లేక ఈఎంఐల ద్వారా వారి కలను నిజం చేసుకుంటున్నారు. నిజానికి అనేక మంది జీతాన్ని నమ్ముకొని సొంతింటి కలను నిజం చేసుకోవడం అయితే చేస్తారు కానీ, తర్వాత ఈఎంఐలు కట్టలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రతినెల వాళ్లకు వచ్చే జీతంలో కొంత మొత్తం ఈఎంఐకే వెళ్లిపోతుంది. పొరపాటున ఒక నెలలో వాళ్లకు వచ్చిన జీతంలో ఈఎంఐ కట్ కావాల్సిన అమౌంట్ తర్వాత మిగిలిన డబ్బులు వాళ్లకు వచ్చిన తెలియకుండా వచ్చే అవసరాలను తీర్చడంలో విఫలం అయితే చేసేది లేక ఆ ఈఎంఐ డబ్బులను కూడా వాడుకోవాల్సిన దుస్థితి ఎదురౌతుంది. ఆ డబ్బులను వాడుకుంటే ఆ నెల హోమ్ లోన్ కట్టడం కుదరకపోతే ఏం జరుగుతుందో తెలుసా.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Jowar Recipes: “జొన్న గుగ్గిళ్లు” ట్రై చేయండి.. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ రెసిపీ..
Also Read
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
- Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
- రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
- SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
నిజానికి మీ EMI తేదీ దాటిన వెంటనే, బ్యాంక్ రికార్డుల్లో మీ ఖాతా ‘గడువు ముగిసినది’ అని కనిపిస్తుంది. ఫస్ట్ మీకు ఆటోమేటెడ్ మెసేజ్‌లు వస్తాయి. ఆ తర్వాత బ్యాంక్ ప్రతినిధుల నుంచి కాల్స్ వస్తాయి. ఈ దశలో బ్యాంక్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూడదు. కేవలం పొరపాటున మర్చిపోయారా లేక ఏదైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఫోన్ ఎత్తి, “ఫలానా తేదీన కడతాను” అని స్పష్టంగా చెబితే వారు మర్యాదగానే వ్యవహరిస్తారు. ఆలస్యంగా కట్టినందుకు కొంత పెనాల్టీ లేదా వడ్డీ అదనంగా పడుతుంది. ఇది కొంత చికాకు కలిగించినా, అది భరించదగ్గ స్థాయిలోనే ఉంటుంది.
క్రెడిట్ స్కోరుపై ప్రభావం ఎప్పుడంటే..
చాలా మంది EMI మిస్ అయిన మరుక్షణమే క్రెడిట్ స్కోరు దెబ్బతింటుందని అనుకుంటారు. కానీ అది నిజం కాదని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా 30 రోజుల వరకు సమయం ఉంటుంది. మీరు ఆ 30 రోజుల్లోపు కట్టేస్తే బ్యాంకులు సిబిల్ వంటి క్రెడిట్ బ్యూరోలకు రిపోర్ట్ చేయవు. ఒకవేళ 30 రోజులు దాటినా చెల్లించకపోతే, అప్పుడు మీ స్కోరు తగ్గే అవకాశం ఉంటుంది. బ్యాంకులకు ఒక నెల EMI మిస్ అవ్వడం కంటే, మీరు ఫోన్ ఎత్తకుండా మౌనంగా ఉండటం అంటేనే ఎక్కువ భయం. మీరు సమాధానం చెప్పకపోతే, మీ ఖాతాను ‘రిస్క్’లో ఉన్నట్లుగా పరిగణిస్తారు.
తీవ్రమైన పరిణామాలు ఎప్పుడు మొదలవుతాయంటే..
ఒక్క EMI తప్పినంత మాత్రాన రికవరీ ఏజెంట్లు రావడం లేదా లీగల్ నోటీసులు రావడం జరగదు. RBI నిబంధనల ప్రకారం.. వరుసగా 90 రోజుల పాటు (3 నెలలు) ఒక్క రూపాయి కూడా కట్టకపోతేనే ఆ లోన్‌ను ‘నిరర్థక ఆస్తి’ (NPA)గా గుర్తిస్తారు. అప్పటివరకు మీ ఇల్లు సురక్షితమే. EMI మిస్ అయినప్పుడు బ్యాంకుకు మీరే ఫోన్ చేసి విషయం చెప్పండి. ఎప్పుడు కడతారో స్పష్టత ఇవ్వండి. మీ దగ్గర డబ్బు సమకూరగానే వెయిట్ చేయకుండా వెంటనే కట్టేయండి. ఆటో-డెబిట్ ఫెయిల్ అయిందా? లేక అకౌంట్లో డబ్బు లేదా? అన్నది చెక్ చేసుకుని భవిష్యత్తులో అలా జరగకుండా చూసుకోండి. ఒక్క నెల EMI మిస్ అవ్వడం అనేది పెద్ద సమస్య ఏమీ కాదు. అది కేవలం ఒక చిన్న ఆటంకం మాత్రమే. మీరు బాధ్యతగా స్పందించి, వెంటనే చెల్లింపులు చేస్తే మీ లోన్ నిబంధనలు గానీ, వడ్డీ రేట్లు గానీ ఏమీ మారవు. గృహ రుణం అనేది లాంగ్ టర్మ్ రిలేషన్ షిప్.. అక్కడ మీరు ఎంత నిజాయితీగా స్పందిస్తారన్నదే ముఖ్యం.
READ ALSO: Jagapathi Babu: ఆ సినిమా షూటింగ్‌కి వెపన్ పట్టుకెళ్లిన జగపతి బాబు.. ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..