Nagababu Financial Help For Child: గుండె సంబంధిత వ్యాధితో పసివాడికి చికిత్స.. నాగబాబు ఆర్థిక సహాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagababu Financial Help For Child: గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉండి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మూడేళ్ల చిన్నారి శ్రీహర్షకు తన వంతు సాయం అందించారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు నాగబాబు.. చిన్నారి వైద్య ఖర్చుల కోసం హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన జనసైనికుడు కట్టా రామకృష్ణ కుమారుడు శ్రీహర్ష గత 26 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చిన్నారి పరిస్థితి తెలుసుకున్న నాగబాబు విచారం వ్యక్తం చేస్తూ.. ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఇక, పసివాడి శ్రీహర్ష ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నాగబాబు..
Read Also: MAA: మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ డైరీని ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం భట్టి
Also Read
- Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
- Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే "మినప జంతికలు" చేసేయండి ఇలా..!
- Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
- PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
కాగా, గుండె వ్యాధితో బాధపడుతున్న చిన్నారి శ్రీహర్షకు కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.. గుండె నుంచి కేవలం 10 శాతం మాత్రమే రక్తం పంపింగ్ అవుతున్నట్లు వైద్యులు వెల్లడించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది.. 26 రోజులుగా బాలుడికి చికిత్స కొనసాగుతుండగా.. ఇప్పటివరకు రూ. 13 లక్షలు ఖర్చు చేసింది ఆ కుటుంబం… ఇంకా రూ. 10 లక్షలు అవసరమని ఆసుపత్రి అంచనా వేస్తోంది.. చిన్నారి పరిస్థితి ప్రస్తుతం కొంత మెరుగ్గా ఉందని సమాచారం ఇచ్చారు వైద్యులు.. బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పిన ఎమ్మెల్సీ నాగబాబు.. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు తన వంతుగా రూ.లక్ష ఇవ్వడంతో పాటు.. దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.. సోషల్ మీడియాలో చిన్నారి తండ్రి తనను కలిసి వీడియోతో పాటు బాధిత బాలుడికి సాయం చేసేందుకు సంబంధించిన డిజిటల్ పేమెంట్‌కు చెందిన క్యూఆర్ కోడ్‌ను కూడా షేర్ చేశారు నాగబాబు..
గుండె సంబంధ వ్యాధితో ఇబ్బంది పడుతున్న కట్టా శ్రీహర్ష (3సంవత్సరాలు) వైద్యఖర్చుల కోసం ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు రూ. 1 లక్ష ఆర్థిక సహాయం సోమవారం హైదరాబాద్ లో అందజేశారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం… pic.twitter.com/mcfZCUvkLe
— Naga Babu Konidela (@NagaBabuOffl) February 23, 2026
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
RRB NTPC Recruitment 2026: రైల్వేలో 3,477 ఉద్యోగాలు.. అర్హత, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!