Quick Dinner Recipes: వంట రాని బ్యాచ్‌లర్స్ కూడా ఈజీగా చేసేయొచ్చు.. సింపుల్ ‘ఎగ్ ఫ్రైడ్ రైస్’ ఇలా చేసుకోండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Quick Dinner Recipes: బయట హోటళ్లలో దొరికే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమే. ఆ రుచి, ఆ సువాసన ఇంట్లో చేస్తే రాదని చాలా మంది అనుకుంటారు. కానీ, కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే రెస్టారెంట్ కంటే అద్భుతమైన రుచితో ఆరోగ్యకరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను మనమే తయారు చేసుకోవచ్చు. తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో చేసుకునే ఈ వంటకం బ్యాచిలర్లకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇంతకీ సింపుల్‌గా, రెస్టారెంట్ స్టైల్‌లో ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Akhilesh Yadav: ‘‘100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మీరే సీఎం అవ్వండి’’.. అఖిలేష్ బంపర్ ఆఫర్..
Also Read
కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం – 1 కప్పు (200 గ్రాములు)
గుడ్లు – 4
కూరగాయ ముక్కలు: క్యారెట్, బీన్స్, క్యాప్సికం, క్యాబేజీ (సన్నగా తరిగినవి)
అల్లం, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి
సాస్‌లు: సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్
ఇతరాలు: మిరియాల పొడి, ఉప్పు, నూనె, స్ప్రింగ్ ఆనియన్స్
తయారీ విధానం:
ముందుగా బాస్మతి బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఎసరు మరిగేటప్పుడు అందులో ఉప్పు, కొంచెం నూనె వేసి బియ్యం వేయాలి. అన్నం 80-90 శాతం మాత్రమే ఉడకాలి. అన్నం పొడిపొడిగా రావాలంటే ఉడికేటప్పుడు ఒక టీస్పూన్ నిమ్మరసం కలిపితే అన్నం తెల్లగా, పొడిపొడిగా ఉంటుంది. అన్నం అయ్యాక ఫ్యాన్ కింద ఆరబెట్టాలి. తర్వాత నాలుగు గుడ్లను ఒక గిన్నెలో కొట్టి, అందులో కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా బీట్ చేయాలి. బాణలిలో కొంచెం నూనె వేసి, ఈ గుడ్డు మిశ్రమాన్ని వేసి పెద్ద ముక్కలుగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. చివరిలో కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కలిపితే రుచి పెరుగుతుంది.
అదే బాణలిలో కొంచెం ఎక్కువ నూనె వేసి (ఫ్రైడ్ రైస్‌కు నూనె ఎక్కువుంటేనే బాగుంటుంది), తురిమిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేయాలి. ఆపై క్యారెట్, బీన్స్, క్యాప్సికం, క్యాబేజీ ముక్కలు వేసి హై ఫ్లేమ్ మీద రెండు నిమిషాల పాటు వేయించాలి. కూరగాయలు మరీ మెత్తగా ఉడకకూడదు, కొంచెం క్రంచీగా ఉంటేనే బాగుంటుంది. వేయించిన కూరగాయల్లో ఆరబెట్టిన అన్నం వేసి ఐదు నిమిషాల పాటు బాగా కలపాలి. అందులో మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్ వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేయాలి. చివరగా ముందుగా వేయించి పెట్టుకున్న ఎగ్ ముక్కలు, మరికొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ వేసి కలిపితే వేడి వేడి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. అన్నం వండేటప్పుడు నిమ్మరసం వాడితే అన్నం పొడిపొడిగా, తెల్లగా వస్తుంది. ఫ్రైడ్ రైస్ ఎప్పుడూ హై ఫ్లేమ్ (పెద్ద మంట) మీద చేస్తేనే ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అల్లాన్ని ముక్కలుగా కాకుండా తురిమి వేస్తే అన్నంలో బాగా కలిసిపోయి మంచి రుచిని ఇస్తుంది. మరెందుకు ఆలస్యం? ఈ రోజే మీ ఇంట్లో ఈ రెస్టారెంట్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్‌ను ప్రయత్నించి చూడండి.
READ ALSO: England vs Sri Lanka: శ్రీలంకను వణికించిన ఇంగ్లాండ్ స్పిన్నర్లు.. 95 పరుగులకే కుప్పకూలిన లంక!
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!