Kerala Story 2: కేరళ స్టోరీ 2 ‘బీఫ్’ వివాదం.. ప్రకాష్ రాజ్ సెటైరికల్ కౌంటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సంచలన విజయం సాధించిన ‘ది కేరళ స్టోరీ’కి సీక్వెల్‌గా వస్తున్న ‘ది కేరళ స్టోరీ 2’ విడుదలకు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. లవ్ జీహాద్, బలవంతపు మత మార్పిడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. అయితే, తాజాగా విడుదలైన ట్రైలర్‌లో ఒక ముస్లిం కుటుంబం ఒక అమ్మాయికి బలవంతంగా బీఫ్ (గోమాంసం) తినిపించినట్లు చూపించిన దృశ్యం ఇప్పుడు దేశవ్యాప్తంగా అగ్గి రాజేసింది.
Also Read : Rashmika : లెస్బియన్ పాత్రలో రష్మిక మందన్న..?
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
ఈ వివాదంపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ తన ఎక్స్ (Twitter) ఖాతాలో పంది మాంసం, బీఫ్, చేపలు, శాఖాహార వంటకాలతో కూడిన ‘కేరళ సద్యా’ ఫోటోను షేర్ చేశారు’ అన్ని రకాల వంటకాలు కలిసి సామరస్యంగా ఉండటమే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండి’ అంటూ క్యాప్షన్ ఇచ్చి చిత్ర యూనిట్‌కు గట్టి చురకలు అంటించారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా స్పందిస్తూ.. మత సామరస్యానికి మారుపేరైన కేరళను తీవ్రవాద కేంద్రంగా చిత్రీకరించే ప్రయత్నాలను తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ప్రజంట్ సోషల్ మీడియాలో ప్రకాశ్ రాజ్ పోస్ట్ వైరల్ గా మారింది.
The real #KeralaStory is how pork, beef and fish coexist with vegetarian sadya and all of them live in harmony. Please relish 😍😍😍 #justasking happy Sunday everyone ❤️❤️ pic.twitter.com/Ea2JCPd6n6
— Prakash Raj (@prakashraaj) February 22, 2026
తాజావార్తలు
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!