AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. కీలకంగా ఆర్-5 జోన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet Meeting: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశముంది. ఇక, రాజధాని అభివృద్ధికి సంబంధించి Andhra Pradesh Capital Region Development Authority (CRDA) సమర్పించిన ప్రతిపాదనలను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. ఇందులో ముఖ్యంగా ఆర్-5 జోన్ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ప్రభుత్వ కాలంలో రాజధాని ప్రాంతమైన అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు R-5 జోన్ ఏర్పాటు చేశారు.
అయితే, ప్రస్తుతం CRDA అథారిటీ R-5 జోన్‌ను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జోన్ కింద కేటాయించిన సుమారు 1,402.58 ఎకరాల భూమిని తిరిగి CRDAకి అప్పగించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. గత ప్రభుత్వ హయాంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన సుమారు 50 వేల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే R-5 జోన్ కారణంగా అమరావతి మాస్టర్ ప్లాన్ అమలులో ఇబ్బందులు తలెత్తుతున్నాయని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో CRDA ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూముల కేటాయింపుపై కూడా కేబినెట్‌లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే State Investment Promotion Board (SIPB) సమర్పించిన పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపే అంశం కూడా అజెండాలో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
- BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
రాజకీయ పరిణామాలపై చర్చ?
ఇక, కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మంత్రులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా తిరుమల లడ్డూ నాణ్యత, కల్తీ పాల అంశంపై కూడా ప్రత్యేకంగా చర్చ జరిగే అవకాశముందని తెలుస్తోంది. రేపటి కేబినెట్ సమావేశం రాజధాని అమరావతి భవిష్యత్తు దిశగా కీలక నిర్ణయాలకు వేదిక కానుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
తాజావార్తలు
-
Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్.. కాసేపట్లో రూ.300 దర్శనం టికెట్లు విడుదల..
-
Jailer 2 : జైలర్ 2 సెన్సార్ కంప్లిట్.. రన్ టైమ్ ఎంతంటే ?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
ట్రెండింగ్
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!