కొందరికి కడుపు నొప్పి తరచుగా వస్తుంటుంది. వికారం, గ్యాస్‌, అసిడిటీ వంటివి రెగ్యులర్‌గా వేధిస్తూ ఉంటాయి.

జీర్ణం కాని ఆహారాలతో పాటు కారం, మసాలా ఎక్కువగా ఉండే ఫుడ్ తినడం, ఫుడ్‌ పాయిజనింగ్‌ అవడం వల్ల.. కడుపు నొప్పి వస్తుంది.

ఇలాంటప్పుడు మందుల కన్నా.. ఇంటి చిట్కాలు పాటిస్తేనే ఎంతో ఉత్తమం. మరి.. ఆ చిట్కాలేంటో తెలుసుకుందామా..?

అల్లం: ఒక పాత్రల్లో అల్లం వేసి, బాగా మరిగించి, ఆ తర్వాత వచ్చే కషాయాన్ని తాగాలి. దీంతో కడుపునొప్పి తగ్గుతుంది.

పుదీనా ఆకులు: కొన్ని పుదీనా ఆకుల్ని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగాలి. దీంతో జీర్ణ సమస్యలు తగ్గి, కడుపు నొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.

నిమ్మరసం: ఒక గ్లాస్ నీటిలో కొద్ది నిమ్మరసం, ఒక స్మూల్ బేకింగ్ సోడా కలిపి తాగితే.. కడుపు నొప్పి, గ్యాస్‌ సమస్యలు దూరమవుతాయి.

దాల్చిన చెక్క: ఒక గ్లాస్ నీటిలో దాల్చిన చెక్క పొడి వేసి, బాగా మరగించి, ఆ నీటిని వడకట్టి తాగాలి. ఫలితంగా.. కడుపునొప్పి, జీర్ణ సమస్యలు తగ్గుతాయి.

లవంగాలు: భోజనం చేశాక ఒకట్రెండు లవంగాలు నోట్లో వేసుకొని, దాని రసాన్ని మింగాలి. దీంతో.. జీర్ణ సమస్యలు, కడుపు నొప్పి మాయమవుతాయి.

జీలకర్ర: ఒక పాత్రలో నీళ్లు వేసి, అందులో జీలకర్ర వేసి, బాగా మరిగించి, కషాయంలా తాగాలి. దీంతో.. గ్యాస్‌, అజీర్ణం, కడుపు నొప్పి తగ్గుతాయి.

అంజీర్‌ పండ్లు, కలబంద గుజ్జు, తులసి ఆకులను, కొబ్బరి నీళ్లు, అరటిపండ్లను తీసుకున్నా.. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను తగ్గుముఖం పడతాయి.