UP: భార్య చనిపోయిన 2 ఏళ్లకు ‘ఓటీపీ’.. అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే..!
- ఓటీపీతో వీడిన మర్డర్ మిస్టరీ
- ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఘటన
- కేసు పరిష్కారంపై పోలీసుల తర్జనభర్జన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య చనిపోయిన రెండేళ్ల తర్వాత మొబైల్‌కు ఓటీపీ వచ్చింది. పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేయగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అసలేం జరిగింది? ఓటీపీ మిస్టరీ ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

Also Read
- Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
- Jantar Mantar Protest: తీహార్ జైలుకు సీజేపీ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా..
- Explainer: యువత ఆరోగ్యానికి "రాజకీయ" గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
- Marco Rubio: మరోసారి భారత్ టూర్కు మార్కో రూబియో.. ముంబై, గుజరాత్లో పర్యటన
సందీప్-ప్రియాంక భార్యాభర్తలు. మే 14, 2017న వివాహం జరిగింది. ప్రియాంకది కప్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని పిల్ఖాన్ గ్రామం. సందీప్‌ది బస్తీ జిల్లా. ఏడేళ్లు సంసారం బాగానే సాఫీగా సాగింది. ఒక కొడుకు కూడా జన్మించాడు. అనంతరం భార్యాభర్తల మధ్య గొడవలు జరగడం ప్రారంభం అయ్యాయి. జూలై 1, 2024న ఇంట్లో నుంచి నగలు తీసుకుని పుట్టింటికి వెళ్లిపోయిందని ఆరోపణలు వచ్చాయి. అలా ఆరోపణలు వచ్చాయో.. లేదో గంటల వ్యవధిలోనే బిడ్డను తీసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు అయోధ్యకు వెళ్లింది. ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడుతుండగా.. రాజస్థాన్ నుంచి అయోధ్యకు వచ్చిన మంగళచంద్ర అనే వ్యక్తి అడ్డుకున్నాడు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన విరమించుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మంగళచంద్రతో కలిసి రాజస్థాన్ వెళ్లిపోయి భార్యాభర్తలుగా జీవిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Shopping Mall: షాపింగ్ మాల్‌లో ప్రియురాలితో పట్టుబడ్డ భర్త.. భార్య ఏం చేసిందంటే..!
అయితే ఇంతలో భార్య అదృశ్యం కావడంపై సందీప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నగల కోసం తన భార్యను అత్తమామలు చంపేసి నదిలో పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసును పోలీసులు స్వీకరించలేదు. దీంతో అతడు కోర్టును ఆశ్రయించాడు. నవంబర్ 4, 2024న న్యాయస్థానం ఆదేశాల మేరకు ప్రియాంక తండ్రి దయారాం, తల్లి శుభవతి దేవి, మామ కుమార్తె, మరొక గ్రామస్థుడు అశోక్ కుమార్ మౌర్యపై కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో నిందితులుగా చేర్చి హత్య కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు నడుస్తోంది.
ఇది కూడా చదవండి: Vande Mataram: వందేమాతరంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. ఇకపై ఇలా చేయాల్సిందే!
అయితే ఈ క్రమంలో ప్రియాంక ఆధార్ కార్డు అప్‌డేట్ కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లింది. ఫొటో, అడ్రస్ మార్పు చేసుకుంటుండగా సడన్‌గా ‘‘ఓటీపీ’’ నెంబర్ సందీప్ మొబైల్‌కు వెళ్లింది. ఆధార్ ఓటీపీ రావడంతో ఒక్కసారిగా అవాక్కై పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో వెంటనే పోలీసులు రాజస్థాన్‌లోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి కూపీలాగారు. ప్రియాంక చిరునామా తెలుసుకుని ఇంటికి వెళ్లగా ప్రత్యక్షమైంది. అనంతరం ఆమెను బస్తీ జిల్లాకు తీసుకొచ్చారు.
పోలీస్ స్టేషన్‌లో ప్రియాంకను చూసి తండ్రి దయారాం, భర్త సందీప్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తండ్రి కౌగిలించుకుని ఏడ్చారు. సందీప్ తన కుమారుడిని దగ్గర తీసుకునేందుకు ప్రయత్నించగా వెళ్లేందుకు నిరాకరించాడు. కుమారుడు నిజమైన తండ్రి అని గుర్తించలేకపోయాడు. భార్యను ఉంచుకునేందుకు ఇష్టపడ లేదు గానీ.. బిడ్డను దత్తత ఇవ్వాలని సందీప్ కోరగా ఆమె నిరాకరించింది.

2024లో కప్తాన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో మహిళ హత్యకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు అయిందని ఏఎస్పీ శ్యామ్‌కాంత్ తెలిపారు. కోర్టు ఆదేశాలతోనే హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉందని వెల్లడించారు. బిడ్డను అప్పగించాలని సందీప్ కోరాడని.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.

తాజావార్తలు
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Hyderabad: ఉప్పల్లో మ్యాచ్కు ముందు సంచలనం.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు అరెస్ట్..!
-
21st Century Best Bowler: 21వ శతాబ్దపు టాప్-10 బౌలర్లు.. టాప్ లేపిన ఆసీస్ దిగ్గజం.. బుమ్రా స్థానం ఎక్కడో తెలుసా?
-
Sushila Devi Inspirational Story: 63 ఏళ్ల వయసులో పదో తరగతి పాసైన బామ్మ.. 79.6 శాతం మార్కులతో అదరగొట్టిందిగా..
ట్రెండింగ్
-
Sound Glow ఫీచర్తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
Temba Bavuma: కెప్టెన్గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!