Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Municipal Elections Live Updates Polling 116 Municipalities 7 Corporations

Telangana Municipal Elections Live Updates: ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

Published Date :February 11, 2026 , 7:10 am
By RAMAKRISHNA KENCHE
  • మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
  • సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్..
  • 2,569 వార్డుల్లో కొనసాగుతున్న పోలింగ్‌
Telangana Municipal Elections Live Updates: ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికల పోలింగ్..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Telangana Municipal Elections Live Updates: తెలంగాణలోని 116 మునిసిపాలిటీలు, ఏడు కార్పోరేషన్ల పరిధిలోని వార్డు, డివిజన్లకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ కొనసాగనుంది. ఈ పోలింగ్‌లో మొత్తం 52,17,413 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఓటర్లలో పురుషుల(25,49,750) కంటే మహిళలే(26,67,025) అధికంగా ఉన్నారు. ఇతరులు 638 మంది ఉన్నారు. అయితే.. ఇప్పటికే 116 మునిసిపాలిటీల్లోని మొత్తం 2,582 వార్డులకు గానూ ఇప్పటికే 12 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీలోని ఒక వార్డులో ఎన్నిక వాయిదా పడింది. మిగిలిన 2,569 వార్డుల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటల వరకు 28.48% నమోదైంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్టీవీ లైవ్ అప్డెట్స్ మీకోసం..

READ MORE: Telangana Municipal Elections: తెలంగాణలో ఎన్నికల పోరు షురూ..

The liveblog has ended.
  • 11 Feb 2026 02:12 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం..

    మున్సిపల్‌ ఎన్నికల్లో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌ జడ్పీ హైస్కూల్‌లో ఆయన ఓటు వేశారు. అనంతరం హైదరాబాద్‌కు తిరిగి బయల్దేరారు. కాసేపట్లో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకుని ఢిల్లీ వెళ్లనున్నారు.

  • 11 Feb 2026 02:05 PM (IST)

    శేరిగూడా బూత్‌లో ఉద్రిక్తత..

    ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ ఎన్నికల్లో శేరిగూడా బూత్‌లో ఉద్రిక్తత.. ఒక్కసారిగా బూత్ వద్ద జనాలు గుమిగూడటంతో వారిని చెదరగొడుతున్న పోలీసులు.. శేరిగూడా 16 వార్డు వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం.. అధికార పార్టీకి చెందిన కొందరు బూత్ లోపల డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు పోలింగ్ కేంద్రం వద్ద ఆందోళన.. ఇప్పటివరకు 52% పోలింగ్ పూర్తి..

  • 11 Feb 2026 02:03 PM (IST)

    అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం: డీజీపీ శివధర్ రెడ్డి

    పోలింగ్‌కు సమస్యలు లేకుండ ఏర్పాట్లు చేశాం.. నల్గొండ, కరీంనగర్‌లో జరిగినవి చిన్న గొడవలే.. పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తే స్టేషన్‌కు తరలిస్తాం.. ఎన్నికల సమయంలో రూల్స్ ప్రకారమే వెళ్తాం.. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవం..

  • 11 Feb 2026 01:52 PM (IST)

    ప్రశాంతంగా పోలింగ్ : డీసీపీ

    ఇబ్రహీంపట్నం, మహేశ్వరంలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. ఇబ్రహీంపట్నం లో సమస్యాత్మకంగా 44 సెంటర్లు ఉన్నాయి.. ఈ సెంటర్లలో భారీగా తమ బందోబస్తు మోహరించి పనిచేస్తున్నాం.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం: ఇబ్రహీంపట్నం డీసీపీ నారాయణరెడ్డి

  • 11 Feb 2026 01:51 PM (IST)

    పోలింగ్ శాతం..

    మధ్యాహ్నం 1 గంట వరకు 48.54% పోలింగ్ నమోదు

  • 11 Feb 2026 01:30 PM (IST)

    బైక్‌పై మంత్రి పర్యటన.. బీఆర్ఎస్‌ నేతల ఫైర్

    మంచిర్యాల జిల్లా : చెన్నూర్ మున్సిపాలిటీ పరిధిలో బైక్ పైన మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన.. ఎన్‌పీ వాడాలోని 1,2,3,9, 4, 5వ బూత్‌లను సందర్శించిన మంత్రి.. కాంగ్రెస్ కార్యకర్తలు, అభ్యర్థులతో కలిసి బైక్‌పై తిరుగుతున్న వివేక్.. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతలు.. నిషేధం ఉన్నప్పటికీ బైక్ పై ర్యాలీగా తిరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. మంత్రి వివేక్ తీరు పై మండిపడ్డ చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్.. రాజ్యాంగ విలువను, ఎన్నికల విధానాలను తుంగలో తొక్కుతున్నారంటూ వ్యాఖ్యలు.. కేసు నమోదు చేయాలని డిమాండ్

  • 11 Feb 2026 01:21 PM (IST)

    పోల్ శాతం మందకోడిగా సాగుతుంది: రాణి కుమిదిని

    వంద శాతం వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ జరుగుతుంది.. పోల్ శాతం మందకోడిగా సాగుతుంది.. సాయంత్రం వరకు పోలింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నాం.. ఓటర్లు అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి.. వెబ్ కాస్టింగ్ అనేది ఓటు వేయాలని అవగాహన చేయడమే.. యువ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు అందరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలి.. అభివృద్ధికి ఓటు అనేది కీలకం.. చెదురుమదురు ఘటనలు తప్ప ఎలాంటి సమస్యలు లేవు.. పండగ వాతావరణంలో పోలింగ్ జరుగుతుంది: రాణి కుమిదిని, రాష్ట్ర ఎన్నికల కమిషనర్

  • 11 Feb 2026 12:36 PM (IST)

    ఓటేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి

    జగిత్యాల: జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి.. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు, వలస వాదులకు మధ్య జరుగుతున్న ఎన్నికలు.. ఈ ఎన్నికలు కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మ అభిమానం, ఆత్మగౌరవ అంశంగా పరిగణిస్తా.. జగిత్యాల ప్రజలు నాలుగు దశాబ్దాల కాంగ్రెస్ అభివృద్ధిని గుర్తించి ఓటేస్తారని ఆశిస్తున్న: జీవన్ రెడ్డి

  • 11 Feb 2026 12:34 PM (IST)

    డబ్బులు పంచుతుండగా పట్టుకున్న పోలీసులు..

    వరంగల్ జిల్లా: నర్సంపేట మున్సిపాలిటీ 24 వార్డులో బీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుండగా పట్టుకున్న పోలీసులు.. రూపాయలు 11,600/- నగదు సీజ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..

  • 11 Feb 2026 12:24 PM (IST)

    ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం: మంత్రి పొన్నం

    సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ మున్సిపాలిటి లోని 3 వ వార్డు నవ భారత్ పబ్లిక్ స్కూల్‌లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఒక ఆయుధం.. ఓటింగ్ రోజు ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్న.. గ్రామీణ ప్రాంతాల్లో 90% ఓటు వేస్తున్న పరిస్థితుల్లో అర్బన్ ఓటర్లకు మోటివేషన్ తక్కువగా ఉంది.. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు ఉన్న ప్రతి అర్బన్ ఓటర్ కు విజ్ఞప్తి చేస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ప్రజాప్రతినిధులను ఏ విధంగా ఆ గ్రామ ప్రజలు ఎన్నుకుంటున్నారో, అర్బన్ ప్రాంత ఓటర్లు తమ విచక్షణతో ఓటు హక్కును వినియోగించుకోవాలి.. ప్రజాస్వామ్యాన్ని కాపాడి ప్రజాప్రతినిధిని ఎంపిక చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా.. ఓటు వెయ్యకుంటే గ్రామీణ ప్రాంతాల్లో తాము జీవించి ఉన్నట్టు లెక్క కాదనే నానుడి చెప్తారు.. ఓటింగ్ రోజు అనేక పనులు ఉన్న వెసులుబాటు చేసుకొని అర్బన్ ప్రాంతాల్లో నూటికి నూరు శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలి.. ఇది ప్రజాస్వామ్యానికి నిదర్శనం: మంత్రి పొన్నం

  • 11 Feb 2026 11:58 AM (IST)

    నిజామాబాద్‌లో ఉద్రిక్తత.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు..

    నిజామాబాద్ : నగరంలోని 19వ డివిజన్‌లో ఉద్రిక్తత.. గుపన్ పల్లి 19 వ డివిజన్ లో పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్- బీజేపీ పోటాపోటీ ప్రచారం.. పోటాపోటీ నినాదాలు.. లాఠీలకు పని చెప్పిన పోలీసులు.. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు.. ఓటర్లను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసుల హెచ్చరిక.. పోలింగ్ సెంటర్ నుంచి ఆయా పార్టీల కార్యకర్తలను చెదర గొట్టిన పోలీసులు..

  • 11 Feb 2026 11:53 AM (IST)

    ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత..

    కామారెడ్డి: ఎల్లారెడ్డిలో ఉద్రిక్తత.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, అతడి పీఏలు పోలింగ్ స్టేషన్లో దూరి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారంటూ రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్.. పోలీసుల సహకారంతో నాన్ లోకల్ కాంగ్రెస్ నాయకులను మున్సిపాలిటీలోని వార్డులలో ప్రచారం చేయిస్తున్నారంటూ రోడ్డుపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు..

  • 11 Feb 2026 11:45 AM (IST)

    రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ శాతం..

    రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటల వరకు 28.48% నమోదు

  • 11 Feb 2026 11:28 AM (IST)

    పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాం: సీపీ రమేష్ రెడ్డి

    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.. లాల్ గడి మలక్పేట్ ను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించాం.. పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశాం: సీపీ రమేష్ రెడ్డి

  • 11 Feb 2026 11:28 AM (IST)

    టాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో

    టాన్ చెరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో 11 గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం

    * ఇస్నాపూర్ : 37.54
    * ఇంద్రేశం-33.55
    * గడ్డపోతారం..38.86

  • 11 Feb 2026 11:27 AM (IST)

    ఉమ్మడి ఆదిలాబాద్..

    ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 26.14 శాతం నమోదు..

  • 11 Feb 2026 11:27 AM (IST)

    మెదక్ జిల్లా వ్యాప్తంగా ఓటింగ్ శాతం..

    మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 35.94 శాతం పోలింగ్ నమోదు
    1. మెదక్ మున్సిపాలిటీ- 35.64 శాతం
    2. రామాయంపేట మున్సిపాలిటీ- 38.27 శాతం
    3. తుప్రాన్ మున్సిపాలిటీ- 35.94 శాతం
    4. నర్సాపూర్ మున్సిపాలిటీ- 34.09 శాతం

  • 11 Feb 2026 11:26 AM (IST)

    Mimను తరిమికొట్టడమే మా లక్ష్యం: సంజయ్

    కరీంనగర్ జిల్లా: ఓటేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని వినతి... ప్రజాస్వామ్యంలో ఓటు అనే ఆయుధాన్ని కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకోవాలి.. రాష్ట్ర ప్రభుత్వంకు రాజకీయం మీద ఆస్తి ఉంది. కానీ రైతుల మీద శ్రద్ధ లేదు.. శంకరపట్నంలో యూరియా కోసం రైతులు రోడ్ల ఎక్కాల్సిన దుస్థితి ఉంది.. కనీసం రైతులకు యూరియా అందించలేకపోవటంపై సీఎం సమాధానం చెప్పాలి.. కేంద్ర ప్రభుత్వాన్ని నిందించటం తప్ప రైతుల కోసం ఏం చేయటం లేదు.. రైతులకు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవటం లేదు.. బీజేపీ, BRS లకు ఎంత సేపు రాజకీయం తప్ప రైతులను పట్టించుకోవటం లేదు.. ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని దృష్టి మల్లించే విధంగా ఇరు పార్టీలు ప్రయత్నం చేస్తున్నారు.. ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని రాష్ట్ర మంత్రి స్వయంగా చెప్తున్నారు.. కేసీఆర్ కుటుంబం మీద వస్తున్న ఆరోపణలపై రాష్ట్రానికి సంబంధం లేదని చెప్తే కేంద్రం విచారణ చేపడుతుంది.. Mim పార్టీ కాంగ్రెస్ తో సంసారం చేస్తూ BRS కి కన్ను కొడుతోంది.. Mim రాష్ట్రంలో లేకుండా తరిమికొట్టడమే మా లక్ష్యం.. ట్రిపుల్ తలాక్ అంశంలో ముస్లింలు mim నీ పట్టించుకునే పరిస్థితి లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నారు.. అంబేద్కర్ ఆలోచనలకు విరుద్ధంగా రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు.. కాంగ్రెస్ పార్టీ నీ ఎవ్వరు నాశనం చెయ్యరు. వారికి వారే తూట్లు పొడుచుకుంటున్నారు.. నదీ జలాల విషయంలో BRS రాష్ట్రాన్నికి తీవ్ర అన్యాయం చేసింది: కేంద్ర మంత్రి బండి సంజయ్

  • 11 Feb 2026 11:24 AM (IST)

    ఓటేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    ఖమ్మం జిల్లా: మధిరలో ఓటేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అనంతరం మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పండగ జరుగుతున్నది.. ప్రజలందరూ కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించండి.. ప్రజా ప్రభుత్వం పట్టణాల్లో మౌలిక పరిస్థితుల కల్పనకు ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతుంది.. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జి సెంటర్లు ఏర్పాటు చేస్తాం.. ప్రపంచంతో పోటీపడే విధంగా విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నాం.. 2047 కల్లా 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దనున్నాం.. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నది: భట్టి

  • 11 Feb 2026 11:12 AM (IST)

    మళ్ళీ ఉద్రిక్తత..

    మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీలో మళ్ళీ ఉద్రిక్తత.. 8వ వార్డులో కాంగ్రెస్, BRS, BJP కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని మూడు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం, తోపులాట.. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

  • 11 Feb 2026 11:04 AM (IST)

    బీజేపీ కార్యకర్త vs పోలీసులు

    నిర్మల్ ఖానాపూర్‌లో బీజేపీ కార్యకర్త మెడలో కండువా లాగేసిన పోలీసులు.. స్కూటీ మీద ఉన్న కార్యకర్తతో పోలీసుల వాగ్వాదం.. తమ కార్యకర్తపై పోలీసులు చేయి చేసుకున్నారని ఆరోపించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్..

  • 11 Feb 2026 11:03 AM (IST)

    కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం: మహేష్ కుమార్ గౌడ్

    నిజామాబాద్: పుట్టిన గడ్డ నిజామాబాద్ పట్టణంలో ఓటు హక్కు వినియోగించుకున్నాను.. రాష్ట్రంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదు అవుతుంది.. ఓటు హక్కు అనేది రాజ్యాంగం ఇచ్చిన వరం దాన్ని అందరూ వినియోగించుకోవాలి.. నాణ్యమైన నాయకులను ఎన్నుకునేందుకు దోహదపడాలి.. బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చ గొట్టే ప్రయత్నం చేస్తున్నారు.. ప్రజలు విజ్ఞులు.. అన్ని తెలుసుకుంటారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 90 శాతం విజయాలు నమోదు చేస్తుంది.. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయం: మహేష్ కుమార్ గౌడ్

  • 11 Feb 2026 10:56 AM (IST)

    ఎస్పీ ఆకస్మిక తనిఖీ..

    రాజన్న సిరిసిల్ల జిల్లా: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్నికల నిర్వహణ తీరును, భద్రతా ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని,ప్రజలు శాంతియుత వాతావరణంలో తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునేలా అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీల్లో ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, పట్టణ సి.ఐ కృష్ణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

  • 11 Feb 2026 10:24 AM (IST)

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మందకొడిగా పోలింగ్..

    ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మందకొడిగా పోలింగ్..
    1.మంచిర్యాల కార్పొరేషన్‌లో 9.71 శాతం
    2.ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 10.7 శాతం.
    3.ఆసిఫాబాద్ లో 15.82 శాతం.
    4.కాగజ్ నగర్ లో 10.19 శాతం.
    5.ఖానాపూర్ పోలింగ్ శాతం 9.8
    6.చెన్నూర్.14.83శాతం.
    7.బెల్లంపల్లి 12.44
    8.క్యాతన్ పల్లి లో 14 శాతం
    9.లక్షేట్టిపేట 14% పోలింగ్ నమోదు.
    10.నిర్మల్.6.89 శాతం.
    11.భైంసాలో 11.91 శాతం పోలింగ్ నమోదు.

  • 11 Feb 2026 10:23 AM (IST)

    ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10.59 %

    వరంగల్: ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు.. జనగామ మున్సిపాలిటీలో 10.59 % పోలింగ్ నమోదు

    భూపాలపల్లి మున్సిపాలిటీలో 12.0% పోలింగ్ నమోదు
    తొర్రూరు మున్సిపాలిటీలో 8.77%పోలింగ్ నమోదు
    స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలో 11.53%పోలింగ్ నమోదు
    ములుగు మున్సిపాలిటీలో 10.19%పోలింగ్ నమోదు
    వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02%పోలింగ్ నమోదు
    నర్సంపేట మున్సిపాలిటీలో 12.29%పోలింగ్ నమోదు
    మహబూబాబాద్ మున్సిపాలిటీలో 10.58 %పోలింగ్ నమోదు
    డోర్నకల్ మున్సిపాలిటీలో 13.11% పోలింగ్ నమోదు
    పరకాల మున్సిపాలిటీలో 9.20% పోలింగ్ నమోదు
    కేసముద్రం మున్సిపాలిటీలో 13.36% పోలింగ్ నమోదు
    మరిపెడ మున్సిపాలిటీలో 16.32% పోలింగ్ నమోదు

  • 11 Feb 2026 10:21 AM (IST)

    ఓ వైపు ఎన్నికల పోలింగ్.. మరో వైపు డబ్బు కట్టల కలకలం..

    జయశంకర్ భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి మున్సిపాలిటీ లో ఓ వైపు ఎన్నికల పోలింగ్.. మరో వైపు డబ్బు కట్టల కలకలం.. 22వ వార్డు పోలింగ్ కేంద్రం సమీపంలో డబ్బు విసిరేసి పరారైన ఓ బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు.. 22వ వార్డు కు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి ఓటర్ డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునే క్రమంలో డబ్బు వదిలేసి పరార్.. సుమారు 1లక్ష రూపాయల డబ్బు స్వాధీనం చేసుకొని వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

  • 11 Feb 2026 10:11 AM (IST)

    నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత..

    మెదక్: నర్సాపూర్ మున్సిపాలిటీ 15వ వార్డులో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ.. చొక్కాలు పట్టుకుని కొట్టుకున్న బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు.. ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు

  • 11 Feb 2026 09:43 AM (IST)

    ఆదిలాబాద్ మున్సిపాటీల్లో 10.7 శాతం..

    ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 10.7 శాతం పోలింగ్..

    ఆసిఫాబాద్ లో 15.82 శాతం.
    కాగజ్ నగర్ లో 10.19 శాతం.
    ఖానాపూర్ పోలింగ్ శాతం 9.8
    చెన్నూర్.14.83శాతం.
    బెల్లంపల్లి 12.44
    క్యాతన్ పల్లి లో 14 శాతం
    లక్షేట్టిపేట 14% పోలింగ్ నమోదు.

  • 11 Feb 2026 09:39 AM (IST)

    కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్..

    కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతున్న మున్సిపల్ పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు కరీంనగర్ కార్పొరేషన్ లో 9.18 శాతం పోలింగ్ నమోదు

    ధర్మపురిలో 16.42 శాతం పోలింగ్

    జగిత్యాల 13.23 శాతం

    హుజురాబాద్ 11.71 శాతం

    సుల్తానాబాద్ 15.75 శాతం

    పెద్దపల్లి 11.12 శాతం

    జమ్మికుంట 7.74 శాతం

    చొప్పదండి 12. 47 శాతం

    మంథని 15.01 శాతం

    రాయికల్ 12.97 శాతం

    వేములవాడ 14.10 శాతం

    కోరుట్ల 10.38 శాతం

    మెట్ పల్లి 10.30 శాతం

    సిరిసిల్ల 12.18 శాతం

  • 11 Feb 2026 09:37 AM (IST)

    రాష్ట్ర వ్యాప్తంగా..

    రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 11.16% పోలింగ్ నమోదు

  • 11 Feb 2026 09:37 AM (IST)

    రంగారెడ్డి జిల్లాలో మొదటి రెండు గంటల్లో 11.75శాతం పోలింగ్

    రంగారెడ్డి జిల్లా లో మొదటి రెండు గంటల్లో 11.75శాతం పోలింగ్ నమోదు

    Shadnagar- 11.84
    Chevella- 11.54
    Ibrahimpatnam- 12.21
    Moinabad- 12.41
    Amangal- 11.42
    Sankerpally- 9.26

  • 11 Feb 2026 08:49 AM (IST)

    మలక్పేట్‌లో భారీ బందోబస్తు..

    మేడ్చల్ జిల్లా అలియాబాద్ లాల్గాడి మలక్పేట్‌లో భారీ బందోబస్తు.. నిన్న బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య గొడవ.. నిన్న కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మేడ్చల్ డీసీపీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్.. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సమావేశం ఎలా నిర్వహిస్తారు అంటూ అడ్డుకోబోయిన బీఆర్ఎస్ కార్యకర్తలు.. ఇరు వర్గాల మధ్య గొడవ.. ఈరోజు ఎలాంటి గొడవలు తలెత్తకుండా.. ముందు జాగ్రత్తగా భారీ బందోబస్తు..

  • 11 Feb 2026 08:47 AM (IST)

    మహదేవప్ప కుటుంబానికి అండగా బీజేపీ: కిషన్‌రెడ్డి

    మక్తల్ లో ఎరుకల మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మక్తల్ మున్సిపాలిటీలో 6వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గిరిజన బిడ్డ మహాదేవప్ప.. కాంగ్రెస్ పార్టీ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప.. ఎరుకల మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం... మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. మహదేవప్ప కుటుంబానికి బీజేపీ అండగా ఉంటుందని హామీ..

  • 11 Feb 2026 08:05 AM (IST)

  • 11 Feb 2026 08:03 AM (IST)

    పారద్శకంగా ఎన్నికలు

    ప్రజాపాలన ప్రభుత్వంలో ఎన్నికలు పారదర్శకంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు.. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టి ప్రజలకు సంక్షేమ పథకాలను సమర్థంగా అందిస్తుంది. ప్రస్తుత ప్రజాపాలనలో ఎక్కడా పోలీసు ఒత్తిడి లేదని స్పష్టం మైంది. గత ప్రభుత్వ హయాంలో ప్రజాస్వామ్యాన్ని హరించి, ఎన్నికలు నిర్వహించకుండా బెదిరింపులకు పాల్పడి ఏకగ్రీవాలు చేయించిన ఘటనలు ఉన్నాయి: మంత్రి వివేక్ వెంకటస్వామి

  • 11 Feb 2026 08:01 AM (IST)

    ఓటేసిన కార్మిక మంత్రి..

    Mantri

    మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని 227వ బూత్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కార్మిక & మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.. తన నివాసం నుంచి నడుచుకుంటూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్న మంత్రి..

  • 11 Feb 2026 07:56 AM (IST)

    రంగారెడ్డి జిల్లాలో ఇలా

    రంగారెడ్డి జిల్లా: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో 240 మంది ఎన్నికల అధికారులు... మొత్తం 24 వార్డులు.. 19 లొకేషన్లలో 48 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు.. మొత్తం 4 రెవెన్యూ విలేజ్ లు.. సీతారాంపేట్, శేరిగూడ, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం.. 83 మంది కౌన్సిలర్ అభ్యర్థులు.. మొత్తం ఓటర్లు 25,993..

  • 11 Feb 2026 07:42 AM (IST)

    సింబల్స్ తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్..

    మహబూబ్‌నగర్: 45వ డివిజన్ 5వ బూత్‌లో నిలిచిన పోలింగ్.. సింబల్స్ తారుమారు కావడంతో నిలిచిన పోలింగ్..పోలింగ్ కేంద్రం వద్ద అభ్యర్థుల ఆందోళన

  • 11 Feb 2026 07:40 AM (IST)

    జోగులంబ గద్వాల జిల్లా..

    గద్వాల మున్సిపాలిటీలో 37 వార్డులలో 108 పోలింగ్ బూత్‌లలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

  • 11 Feb 2026 07:26 AM (IST)

    ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో

    ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న పోలింగ్.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1 కార్పొరేషన్, 10 మున్సిపాలిటీల్లో పోలింగ్..
    మంచిర్యాల కార్పొరేషన్‌లో 60 డివిజన్‌లు, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో 49 వార్డులు, బెల్లంపల్లి లో 44, చెన్నూరులో 18, క్యాతనపల్లిలో 22 వార్డులకు పోలింగ్..

  • 11 Feb 2026 07:07 AM (IST)

    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో..

    ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 మున్సిపాలిటీలకు నేడు పోలింగ్.. 260 వార్డులకు బరిలో నిలిచిన 1072 మంది అభ్యర్థులు.. 12 మున్సిపాలిటీల్లో 525 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు.. ఓటు హక్కు సద్వినియోగం చేసుకోనున్న 3,35,272 మంది ఓటర్లు.. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌.. పోలింగ్ నిర్వహణ కోసం 2,100 మందికి పైగా సిబ్బంది నియామకం.. మొత్తం మూడువేల మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

  • 11 Feb 2026 07:07 AM (IST)

    అత్యధిక మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గం పటాన్ చెరు

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌ డే.. అత్యధిక మున్సిపాలిటీలు ఉన్న నియోజకవర్గం పటాన్ చెరు.. నియోజకవర్గంలో ఐదు మున్సిపాలిటీలు.. ఇంద్రేశం, ఇస్నాపూర్, గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం మున్సిపాలిటీలు
    ఇస్నాపూర్ మున్సిపాలిటీలో 24 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Election Live News Telugu
  • municipal elections Telangana
  • Municipal Polling Today
  • NTV Election Coverage
  • NTV Live Updates

ట్రెండింగ్‌

  • Summer Alert : శరీరంలో నీరు తగ్గిందని తెలిపే ‘రెడ్ ఫ్లాగ్’ లక్షణాలు ఇవే.. నిర్లక్ష్యం చేస్తే డేంజరే..!

  • Karnataka Special Carrot Palya : నిమిషాల్లో తయారయ్యే హెల్తీ రెసిపీ.. టేస్ట్ అదిరిపోతుంది.!

  • Panakam Recipe: తక్షణ శక్తి కోసం శ్రీరామ నవమి పానకం.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోతుంది.!

  • Stomach Pain After Eating.? తిన్న వెంటనే కడుపు నొప్పా..? ఈ 5 కారణాలు తెలిస్తే షాక్ అవుతారు!

  • Stock Market: భారీ నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు.. బిక్కుబిక్కుమంటున్న మదుపరులు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions