Khawaja Asif: ‘అమెరికా మనల్ని టాయిలెట్ పేపర్ కంటే హీనంగా వాడుకుంది’.. నిజం ఒప్పుకున్న పాక్ రక్షణ మంత్రి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Khawaja Asif: అమెరికా గురించి ప్రపంచం మొత్తం తెలుసు. ఎప్పుడు ఎలాంటి వైఖరిని ప్రదర్శిస్తుందో.. దేశాన్ని ఎందుకు వాడుకుంటుందో బాధిత దేశం నష్టపోయే వరకు తెలియదు. ఈ అంశంపై పాకిస్థాన్ పార్లమెంట్‌లో రచ్చ చోటు చేసుకుంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ పార్లమెంట్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాకిస్థాన్‌ను ఉపయోగించుకుందని, పని అయిపోయిన తర్వాత టాయిలెట్ పేపర్ కంటే హీనంగా విసిరేస్తుందని విమర్శించారు. ఆసిఫ్ మాటల్లో బాధ స్పష్టంగా కనిపించింది. 1980లలో సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన యుద్ధంలో పాకిస్థాన్ పాల్గొన్న తీరు గురించి ప్రశ్నించారు. అది మతపరమైన యుద్ధం కాదని, ఇస్లాం రక్షణ కోసం చేసింది కాదన్నారు. అమెరికా వ్యూహంలో భాగంగానే యుద్ధం కొనసాగిందని అంగీకరించారు. ఆ సమయంలో రష్యా ఆఫ్ఘనిస్తాన్‌ను పూర్తిగా ఆక్రమించి, జిహాద్ ప్రకటించాల్సిన పరిస్థితి లేదని చెప్పారు. అయినా పాకిస్థాన్ ఆ యుద్ధంలోకి దూకిందని తెలిపారు. ఆ నిర్ణయాల ప్రభావం ఇప్పటికీ దేశం అనుభవిస్తోందని ఎట్టకేలకు నిజం ఒప్పున్నారు. జిహాద్ పేరుతో యువకులను యుద్ధాలకు పంపడం పెద్ద తప్పిదమన్నారు. యుద్ధాన్ని సమర్థించేందుకు విద్యా పాఠ్యాంశాల్లో మార్పులు చేశారని, ఆ మార్పులను ఇప్పటికీ పూర్తిగా సరిచేయలేకపోతున్నామని తెలిపారు. అంటే ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాలు సమాజంపై ఎంత లోతైన ప్రభావం చూపాయో మంత్రి మాటల్లో తెలుస్తోంది.
READ MORE: Toxic : ‘టాక్సిక్’ ఓవర్సీస్ డీల్ క్లోజ్.. కన్నడ సినిమా చరిత్రలో కనివినీ ఎరుగని రికార్డు!
Also Read
- Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
- Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
1999 తర్వాత పరిస్థితి మరింత క్లిష్టమైందని ఆసిఫ్ చెప్పారు. అమెరికా మద్దతు పొందాలనే ఉద్దేశంతో మళ్లీ వాషింగ్టన్‌తో కలిసి నడిచామని, కానీ ఆ నిర్ణయం దేశానికి చాలా నష్టం తెచ్చిపెట్టిందని అన్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత అమెరికా నేతృత్వంలో జరిగిన ‘వార్ ఆన్ టెరర్’లో పాకిస్థాన్ తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడింది. అయితే కొంతకాలం తర్వాత అమెరికా అక్కడి నుంచి వెళ్లిపోయిందని, కానీ ఆ యుద్ధం వల్ల వచ్చిన సమస్యలు మాత్రం పాకిస్థాన్‌ను ఇప్పటికీ వెంటాడుతున్నాయని పేర్కొన్నారు. మాజీ సైనిక పాలకులు జియా ఉల్ హక్, పరవేజ్ ముషర్రఫ్‌లపై నేరుగా విమర్శలు చేశారు. దేశానికి సంబంధించినవి కాని యుద్ధాల్లో పాకిస్థాన్‌ను తోసేశారని ఆరోపించారు. ఇతరుల యుద్ధాల్లో పాకిస్థాన్ ఒక బొమ్మలా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. “ఈ నష్టాన్ని ఎప్పటికీ పూడ్చలేం” అని ఆసిఫ్ అన్నారు. తీసుకున్న కొన్ని నిర్ణయాలు తిరిగి మార్చలేని తప్పిదాలుగా మిగిలిపోయాయని చెప్పారు. ఒకప్పుడు మిత్రత్వం పేరిట తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఎంతటి భారం అయ్యాయో ఇప్పుడు స్పష్టమవుతోందని మంత్రి మాటల్లో కనిపించింది.
READ MORE: Canada: కెనడా స్కూల్‌లో ఘోరం.. విచక్షణారహితంగా కాల్పులు.. 10 మంది మృతి
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..