AP Assembly 2026: 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు.. ఫిబ్రవరి 14న బడ్జెట్!
- 17 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు
- ఫిబ్రవరి 14న వార్షిక బడ్జెట్
- ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక కార్యక్రమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్‌పై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలను మార్చి 7 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అవసరమైతే పొడిగించాలని కూడా నిర్ణయించారు. మొత్తం 17 రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ముగించాలని, రోజూ జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయించారు.
ఈ నెల 14న అసెంబ్లీలో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మహా శివరాత్రి పర్వదినం తర్వాతి రోజున (ఫిబ్రవరి 16) సెలవు ప్రకటించారు. 17, 18 తేదీల్లో బడ్జెట్‌పై చర్చ జరగనుంది. 18న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానం ఇవ్వనున్నారు. మార్చి 1, 2, 3 తేదీల్లో సెలవు ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా పలు కీలక చర్చలు, బిల్లుల ఆమోదం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ విధానాలు, ఆర్థిక ప్రణాళికలపై ప్రతిపక్షం నుంచి తీవ్ర చర్చలు జరిగే అవకాశముందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
- Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
- iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
- Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే "బీరకాయ రోటి పచ్చడి" చేసేయండిలా..!
Also Read: AP Ministers: తస్మాత్ జాగ్రత్త అంటూ.. ఏపీలో కీలక మంత్రులకు హెచ్చరిక లేఖలు!
బడ్జెట్ సమావేశాల మధ్యలో ఎమ్మెల్యేల కోసం ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 24, 25, 26 తేదీల్లో ఎమ్మెల్యేలకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణం పెంపొందించడమే లక్ష్యంగా ఉన్నట్లు సమాచారం. ఈసారి అసెంబ్లీ సమావేశాలు రాజకీయంగా, పరిపాలనా పరంగా కీలకంగా మారనున్నాయి. బడ్జెట్ ప్రవేశపెట్టడం, కీలక చర్చలు జరగడం వంటి అంశాలతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు
-
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు
-
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
CEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు
ట్రెండింగ్
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!