SwayambhuTeaser : స్వయంభు టీజర్.. నిఖిల్ అదరగొట్టాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ తన కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో, ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘స్వయంభూ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ‘ఎపిక్ టీజర్’ విడుదలైంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, భారతీయ చరిత్రలోని ఒక అన్ టోల్డ్ హీరో కథను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించబోతోంది.
Also Read
- Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
- 50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
- US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
- 200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
టీజర్ పరిశీలిస్తే బాహుబలి లాంటి మరొక భారీ సినిమా ఫీలింగ్ అనిఇంచింది. భారీ సెట్స్, అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంది అలాగే నిఖిల్ చెప్పిన “బలం ఏదో ఒక చోట నశిస్తుంది మిత్రమా.. కానీ, తెగింపు ఎంత దూరమైనా వెళ్తుంది” డైలాగ్స్ సినిమా థీమ్‌ను స్పష్టం చేస్తున్నాయి. ఒక సామాన్య వీరుడు అజేయమైన శక్తిగా ఎలా ఎదిగాడనేది ఈ చిత్రంలో ప్రధానాంశం. వేసవిలో ‘స్వయంభూ’ బాక్సాఫీస్ వద్ద భారీ యుద్ధానికి సిద్ధమైంది. ఈ సినిమాను కేవలం భారతీయ భాషల్లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు చైనీస్, స్పానిష్, అరబిక్ భాషల్లో కూడా ఈ చిత్రం విడుదల కానుంది. ‘బాహుబలి’ ఫేమ్ కేకే సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ మరియు ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. సంయుక్త మీనన్, నభా నటేష్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని పిక్సెల్ స్టూడియోస్ నిర్మిస్తోంది. నిఖిల్ ఈ సినిమా కోసం రెండేళ్లకు పైగా ఆయుధ విద్యల్లో కఠినమైన శిక్షణ తీసుకున్నారు. టీజర్‌లో ఆయన మేకోవర్ మరియు విజువల్స్ చూస్తుంటే, ‘కార్తికేయ 2’ తర్వాత నిఖిల్ మరో గ్లోబల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
తాజావార్తలు
-
Rain Alert: తీవ్ర వాయుగుండం ముప్పు.. మూడు రోజులు ఈ జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్!
-
JAILER 2 : నీలాంబరిని విద్యాబాలన్ మైమరిపించగలదా..?
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!
-
US-Iran Conflict: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా బిగ్ షాక్.. సెప్టెంబర్ 23 నుంచి పూర్తిగా బంద్?
-
200MP Zeiss టెలిఫొటో కెమెరా, 2K 144Hz డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో VIVO X500 Pro Max లాంచ్..!
ట్రెండింగ్
-
144Hz డిస్‌ప్లే, IP68+IP69 రేటింగ్, 1TB స్టోరేజ్, 90W ఛార్జింగ్‌తో VIVO X500.. ధర, ఫీచర్లు ఇదిగో.!
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!