AP Ministers: తస్మాత్ జాగ్రత్త అంటూ.. ఏపీలో కీలక మంత్రులకు హెచ్చరిక లేఖలు!
- ఏపీలో కీలక మంత్రులకు హెచ్చరిక లేఖలు
- అజ్ఞాత వ్యక్తుల నుంచి హెచ్చరిక లేఖలు
- తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్‌లో కొందరు కీలక మంత్రులకు అజ్ఞాత వ్యక్తుల నుంచి హెచ్చరికలతో కూడిన లేఖలు రావడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. జాగ్రత్తగా ఉండాలంటూ పంపిన ఈ లేఖలపై భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై ఇప్పటికే మంత్రి కందుల దుర్గేష్ పీఎస్.. పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్‌లకు కూడా ఇదే తరహా హెచ్చరిక లేఖలు అందాయి.
ఒకే విధమైన సందేశంతో పలువురు మంత్రులకు లేఖలు రావడం వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో లేఖపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ లేఖల వ్యవహారం అసెంబ్లీ లాబీల్లో విస్తృత చర్చకు దారి తీసింది. హెచ్చరిక లేఖల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై ప్రభుత్వం మరింత జాగ్రత్తలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది. ఘటనపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
- Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
- YS Jagan: ఎంపీ మిథున్‌రెడ్డికి జగన్ ఫోన్.. ఎన్నికల్లో ధైర్యంగా పోరాడతాం.. న్యాయపోరాటం చేస్తాం..
Also Read: AP Assembly 2026: అసెంబ్లీ నుంచి వైసీపీ వాకౌట్.. గవర్నర్ ప్రసంగం మధ్యలోనే ఉద్రిక్తత!
కందుల దుర్గేష్ మాట్లాడుతూ… ‘మావోయిస్టుల పేరుతో వచ్చిన లేఖ చూసి కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. నాకు చాలా మంది ఫోన్లు చేశారు. నేను పనిచేసేది టూరిజం లాంటి చిన్న శాఖ. దీంట్లో మావోయిస్టులు లేక రాయాల్సినంత పెద్ద హడావిడి ఏముంటుంది. వ్యక్తిగతంగా, శాఖ పరంగా ఎక్కడ ఎలాంటి తప్పులు ఉండవు. ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఈ లేఖలు రాసి ఉంటారు. మావోయిస్టులు లేఖలు ఇలా ఉండవు కదా?’ అని అన్నారు.
తాజావార్తలు
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
-
Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
-
KitKat Chocolate Worms : కిట్ క్యాట్‌లో పురుగులు.. కూకట్పల్లి లులు మాల్లో షాకింగ్ ఘటన
-
Sundeep Kishan: ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
-
Supreme Court: CJI సూర్యకాంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. సంజయ్ రౌత్‌కు సుప్రీంకోర్టు నోటీసులు..
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!