Team India: పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్ షాక్.. ఆసుపత్రిలో చేరిన విధ్వంసకర బ్యాట్స్ మెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌పై అనిశ్చితి ముగిసింది. హై డ్రామాకు తెరలేపిన పాక్ ఎట్టకేలకు భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఆందోళన కలిగించే వార్త వెలుగులోకి వచ్చింది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ కడుపు ఇన్ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. నమీబియాతో జరగనున్న గ్రూప్ మ్యాచ్‌కు అభిషేక్ దూరమయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, అమెరికాతో జరిగిన మ్యాచ్‌కు ముందే అభిషేక్‌కు ఆరోగ్యం బాగోలేదు. అయినప్పటికీ ఆ మ్యాచ్ ఆడాడు. కానీ మ్యాచ్ తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. తీవ్ర జ్వరం రావడంతో వెంటనే డ్రిప్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అభి ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన జట్టు ప్రాక్టీస్‌కు హాజరుకాలేదు.
READ MORE: AP Assembly 2026: అసెంబ్లీలో డిజిటల్ అటెండెన్స్.. ఫేషియల్ రికగ్నిషన్‌తో సభ్యుల హాజరు నమోదు!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఈ విషయంపై భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే మీడియాతో మాట్లాడారు. “అభిషేక్‌కు ఇంకా కడుపుతో సంబంధమైన సమస్యలు ఉన్నాయి. రెండు రోజుల్లో జరిగే మ్యాచ్‌లో పాల్గొంటాడని ఆశిస్తున్నాం” అని చెప్పారు. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ గోల్డెన్ డక్‌గా ఔటయ్యాడు. ఆ తర్వాత భారత బౌలింగ్ సమయంలో మైదానంలోకి రాలేదు. అతని స్థానంలో సంజూ శాంసన్ ఫీల్డింగ్ చేశాడు. మ్యాచ్ గెలిచిన తర్వాత జరిగే హ్యాండ్‌షేక్స్‌కు సైతం అభిషేక్ రాకపోవడం అప్పుడే చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని రోజులల్లో పాకిస్థాన్ vs భారత్ మ్యాచ్ ఉంది. అప్పట్లోగా అభిషేక్ కోలుకుంటాడా? ఈ మ్యాచ్ ఆడతాడా? లేదా? అనే అంశంపై క్లారిటీ లేదు. ఇదిలా ఉండగా, వాషింగ్టన్ సుందర్ భారత జట్టుతో కలిసినట్లు ర్యాన్ టెన్ డోషాటే ధృవీకరించారు. ఫిబ్రవరి 12న నమీబియాతో జరగనున్న రెండో గ్రూప్ మ్యాచ్‌కు ముందు సుందర్ జట్టులో చేరాడు. “సుందర్ నిన్న జట్టుతో కలిశాడు. ఇవాళ జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేస్తాడు,” అని తెలిపారు.
READ MORE: Rajnikanth : రాధికాతో అర్ధరాత్రి బైక్ రైడ్.. ఎమోషన్ అయిన సూపర్ స్టార్
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?