T20 World Cup 2026: స్కూల్ బోర్డు నుంచి స్కోర్ బోర్డు వరకు.. టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లను ఉతికి ఆరేసిన టీచర్ కొడుకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
T20 World Cup 2026: ఓ స్కూల్ టీచర్ కొడుకు టీ20 ప్రపంచకప్‌లో బౌలర్లను ఉతికి ఆరేసి రికార్డులను సృష్టించాడు. ఇంతకీ ప్లేయర్ ఎవరో తెలుసా.. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్. ఆయన తండ్రి న్యూజిలాండ్‌లోని బోర్డింగ్ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఇటీవల మొదలైన 2026 టీ20 ప్రపంచ కప్‌లో న్యూజిలాండ్ శుభారంభం చేసింది. మంగళవారం చెన్నై వేదికగా యూఏఈ- న్యూజిలాండ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 10 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ సీఫెర్ట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ యూఏఈపై తుఫాను అర్ధ సెంచరీ నమోదు చేసి రెండు రికార్డులను నెలకొల్పాడు.
READ ALSO: ఘుమఘుమలాడే ‘తలకాయ కూర’.. అమ్మ చేతి వంటలా రుచిగా రావాలంటే ఇలా చేయండి.!
Also Read
- Tea Drinking Mistakes: 'టీ' తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
- Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
- Jim Jim Taara Song: "జుమ్ జుమ్ తార" అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
- Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
టిమ్ సీఫెర్ట్ డబుల్ ఫీట్
17 ఏళ్లలో ఒక న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఈ రేంజ్ తుఫాన్ అర్ధ సెంచరీ సాధించడం ఇదే తొలిసారి. యూఏఈపై టిమ్ సీఫెర్ట్ కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి, న్యూజిలాండ్ తరపున 2009 టీ20 ప్రపంచ కప్‌లో ఐర్లాండ్‌పై 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించిన ఆరోన్ రెడ్‌మండ్‌ను సీఫెర్ట్ రికార్డ్‌ను సమం చేశాడు. 2026 T20 ప్రపంచ కప్‌లో టిమ్ సీఫెర్ట్‌కు ఇది వరుసగా రెండో హాఫ్ సెంచరీ. అఫ్గానిస్తాన్‌పై కూడా ఈ స్టార్ ప్లేయర్ 65 పరుగులు చేయడం ద్వారా న్యూజిలాండ్‌ను విజయపథంలో నడిపించాడు. USAతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో కూడా సీఫెర్ట్ 66 పరుగులు చేశాడు. వరుసగా మూడు T20 మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి. 2026 T20 ప్రపంచ కప్‌లో సీఫెర్ట్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డ్‌ను సృష్టించాడు.
అద్భుతంగా రాణించిన ఫిన్ అల్లెన్..
యూఏఈపై టిమ్ సీఫెర్ట్ మాత్రమే కాదు, ఫిన్ అల్లెన్ కూడా అద్భుతంగా రాణించి సూపర్ ఆఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 27 బంతుల్లో తన అర్ధ సెంచరీ మార్క్‌కు చేరుకున్నాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు కేవలం 51 బంతుల్లోనే సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 10 వికెట్ల తేడాతో గెలిచింది. కివీస్ 174 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలోనే ఛేదించింది.
The highest partnership in T20 World Cup History. Tim Seifert and Finn Allen, everybody 🙏#NZvUAE #T20WorldCup
📷 = ICC/Getty pic.twitter.com/e3vlMwaGz7
— BLACKCAPS (@BLACKCAPS) February 10, 2026
READ ALSO: Allu Arjun: అల్లు అర్జున్ వివాదంపై ఐకాన్ స్టార్ టీం అధికారిక ప్రకటన.. లేఖలో ఏముందంటే?
తాజావార్తలు
-
West Indies Players-ICC: వెస్టిండీస్‌కు భారీ షాక్.. ఇద్దరు స్టార్ బ్యాటర్లపై ఐసీసీ చర్యలు!
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!