Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి
- ఢిల్లీలో మరో ఘోరం
- ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి
- రేఖా గుప్తా ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఇటీవల గుంతలో పడి బైకర్ చనిపోయిన సంఘటన మరువక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది.
ఇది కూడా చదవండి: TGTET Results : అలర్ట్.. టీజీ టెట్ ఫలితాలు విడుదల..
Also Read
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
ఇటీవల ఢిల్లీలో జల్ బోర్డు అధికారులు నడిరోడ్డుపై గుంత తవ్వి ఎటువంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకుండా వదిలేశారు. దీంతో ఒక బైకర్ తెలియకుండా వచ్చేయడంతో గుంతలో పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ ఘటన జరిగి 5 రోజులు కాకముందే మరో ఘోరం జరిగింది మ్యాన్‌హోల్‌ను ఓపెన్ చేసి ఉంచడంతో యువకుడు బిర్జు కుమార్ (30) మృతి చెందాడు. ఒక దుర్ఘటన జరిగి పెద్ద రాద్ధాంతం జరిగినా కూడా అధికారులు పాఠం నేర్చుకోలేదు. నిర్లక్ష్యం కారణంగా మరో నిండు ప్రాణం పోయింది.
ఇది కూడా చదవండి: Varanasi : ‘వారణాసి’ కోసం రాజమౌళి కొత్త ప్లాన్.. ఆ సీన్లు మాత్రమే ఐమాక్స్ ఫార్మాట్‌లో!
రోహిణిలోని బేగంపూర్ ప్రాంతంలో మహాశక్తి కాళి ఆలయానికి సమీపంలోని ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (DDA) భూమిలోని మ్యాన్‌హోల్ ఓపెన్ చేసిందని.. అయితే 30 ఏళ్ల బిర్జు కుమార్ అనే కార్మికుడు, అతని స్నేహితుడు ఇంటికి వెళుతుండగా ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. బిర్జు కుమార్, స్నేహితుడు కూడా కార్మికులేనని.. ఇద్దరూ రోజంతా మద్యం సేవించి ఉన్నారని.. సంఘటన జరిగిన సమయంలో కూడా మద్యం మత్తులో ఉన్నారని వెల్లడించారు.
బిర్జు కుమార్ సోమవారం రాత్రి పడిపోగా.. మరుసటి రోజు మృతదేహం లభించింది. బిర్జు కుమార్‌కు ఫోన్ చేయడానికి ప్రయత్నించానని, కానీ స్పందన రాలేదని, బాగా తాగి ఉండటంతో ఇంటికి వెళ్లానని స్నేహితుడు చెప్పాడు. మరుసటి రోజు కూడా కుమార్ జాడ తెలియకపోవడంతో ఢిల్లీ పోలీసులు, అగ్నిమాపక శాఖ గాలింపు చర్యలు చేపట్టగా మ్యాన్‌హోల్ పక్కన అతని చెప్పులు కనిపించాయని చెప్పాడు. మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో కుమార్ మృతదేహాన్ని మురుగు కాలువ నుంచి వెలికితీసిన తర్వాత ఆయన మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందినవాడిగా గుర్తించారు.
ఈ ఘటనపై ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగానే ఈ దుర్ఘటన జరిగిందని ఆరోపించారు. రేఖ గుప్తా ప్రభుత్వం పనికిరాని ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు. ప్రసంగాలపై ఉన్న శ్రద్ధ… ప్రభుత్వాన్ని నడపడడం చేతకావడం లేదని మండిపడ్డారు.
#WATCH | Delhi: A 32-year-old man died after falling into an open drain in Rohini Sector 32, near Mahashakti Kali Temple. Visuals from the spot. https://t.co/trUzf8715N pic.twitter.com/zsDIGROGyR
— ANI (@ANI) February 10, 2026
ब्रेकिंग (शर्मनाक)
दो आदमी दिल्ली के रोहिणी सेक्टर 32 में सड़क पर जा रहे थे , चलते चलते उनके से एक गड्ढे में गिरा । जहाँ गिरा वो गड्ढ़ा एक गेहरा नाला था।
लाश भी नहीं मिली ।
रेखा गुप्ता की सरकार सिर्फ़ फोटोबाज़ी और भाषणबाज़ी की नकारा सरकार है । इनको सरकार नहीं चलानी , सिर्फ़…
— Saurabh Bharadwaj (@Saurabh_MLAgk) February 10, 2026
తాజావార్తలు
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
-
AP Weather Update: ఏపీకి 4 రోజుల పాటు వర్ష సూచన!
-
New Mobile Launched: ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా.. ఈ కొత్త ఫోన్‌తో పరిష్కారం దొరికినట్లే..
-
Kitchen Cleaning Tips: కిచెన్ సింక్‌లో నీళ్లు నిలిచిపోతున్నాయా? ఈ చిట్కాలతో సులభంగా క్లియర్ చేయండి!
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!