India vs Pakistan: “మాకు ముందే తెలుసు”.. పాకిస్థాన్ డ్రామపై టీమిండియా ఫస్ట్ రియాక్షన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India vs Pakistan: పాకిస్థాన్ హై డ్రామాకు తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్ vs పాకిస్థాన్ మ్యాచ్‌పై కొద్ది రోజులుగా అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. పాకిస్థాన్ ప్రభుత్వం సూచనల కారణంగా ఆ మ్యాచ్‌కు హాజరుకాకపోవచ్చని అక్కడి బోర్డు ప్రకటించింది. దీంతో ఈ హై వోల్టేజ్ పోరు జరుగుతుందా లేదా అన్న సందేహం అభిమానుల్లో పెరిగింది. అయితే వీకెండ్‌లో పరిస్థితి మారింది. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీకి అధికారికంగా సమాచారం ఇచ్చి, షెడ్యూల్ ప్రకారం అన్ని మ్యాచ్‌లలో పాల్గొంటామని తెలిపింది. దీంతో ఈ కీలక మ్యాచ్‌పై ఉన్న అనిశ్చితికి తెరపడింది.
READ MORE: Delhi: ఢిల్లీలో మరో ఘోరం.. ఓపెన్ మ్యాన్‌హోల్‌లో పడి యువకుడి మృతి
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ఈ అంశంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషాటే స్పందించారు. ఈ పరిణామాలు జట్టుపై ఎలాంటి ప్రభావం చూపలేదని స్పష్టం చేశారు. శ్రీలంక బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన ఆయన.. “మేము మొదటినుంచే మ్యాచ్ జరుగుతుందని భావించాం. వాళ్లు రాకపోతేనే వేరే విషయం. అప్పటివరకు ఆడతామనే సిద్ధంగా ఉన్నాం” అన్నారు. అంటే బయట ఏం జరిగినా డ్రెస్సింగ్ రూమ్‌లో మాత్రం ఒక్క దృష్టి క్రికెట్‌పైనే ఉందని చెప్పేశారు. రెండు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల గురించి ఆయన ప్రస్తావించారు. కానీ ఆ విషయాలను పక్కన పెట్టి, కేవలం ఆటపైనే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం అని చెప్పారు. దేశంలో భావోద్వేగాలు ఉంటాయి, రాజకీయ విషయాలు ఉంటాయి. కానీ మా పని మైదానంలో రాణించడమని పేర్కొన్నారు. అయితే పాకిస్థాన్‌కు ఒక చిన్న అడ్వాంటేజ్ ఉండొచ్చని ఒప్పుకున్నారు. గత రెండు వారాలుగా ఆ జట్టు కొలంబోలోనే ఉండటంతో అక్కడి పరిస్థితులకు అలవాటు అయిపోయిందని చెప్పారు. ఇది సవాలే కానీ.. తాము ఎదుర్కోగలమని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!